మొదటిసారి హోమ్ లోన్ కై దరఖాస్తు చేసేవారి కోసం ఒక పూర్తి గైడ్
మీరు ఎంతో గర్వంగా మీ స్వంతం అని చెప్పుకునే ఒక ఇంటి కొనుగోలు మీ జీవితకాల అనుభవం కావచ్చు. దీనికి కుటుంబ సభ్యుల అవసరాలు మరియు కాబోయే ఇల్లు గురించిన పరిశోధన, దాని డెవలపర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఇవి పూర్తయిన తర్వాత, మీ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి మీకు చివరగా నిధులు అవసరం.
అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం, సరైన ఇంటిని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది, అయితే మీరు ఏకకాలంలో మరో హోమ్‌వర్క్ చేయాలి, అంటే సరసమైన ఇఎంఐలలో మీకు సులభంగా హోమ్ లోన్ అందించగల హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని కనుగొనడం. కానీ, దాని కంటే ముందు హోమ్ లోన్‌కు సంబంధించిన వివిధ అంశాలను తెలుసుకుందాం:
ఇంటి లోన్ అంటే ఏంటి?
హోమ్ లోన్ అనేది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లేదా బ్యాంకులు అందించే ఒక సెక్యూర్డ్ లోన్. సాధారణంగా ఒక ఇంటిని కొనుగోలు చేయాలనుకునే లేదా నిర్మించాలనుకునే వ్యక్తులకు హోమ్ లోన్ అందించబడుతుంది. లోన్ రీపేమెంట్ పూర్తయ్యే వరకు ఆస్తి అనేది రుణదాత (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లేదా బ్యాంక్) వద్ద సెక్యూరిటీ కింద తాకట్టు పెట్టబడుతుంది. రుణాన్ని అంగీకరించిన వడ్డీతో సహా పూర్తిగా తిరిగి చెల్లించే వరకు రుణదాత ఆస్తి టైటిల్ లేదా డీడ్‌ను తన వద్ద కలిగి ఉంటాడు. కస్టమర్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే, రుణ సంస్థ ఆస్తిని అమ్మడం ద్వారా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు.
వివిధ రకాల హోమ్ లోన్లు ఏవి
ఒక హోమ్ లోన్ ద్వారా మీరు కొత్త ఇల్లు/ ఫ్లాట్‌ను కొనుగోలు చేయవచ్చు లేదా నిర్మించవచ్చు. అయితే, ఇప్పటికే మీకు ఒక ఇల్లు ఉంటే, మీరు మీ ఇంటికి మరింత స్థలం/ గదిని జోడించడానికి లేదా ఇంటిని పునర్నిర్మించాలనుకుంటే, హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ తీసుకోవచ్చు లేదా మీరు మీ ఇంటిని పునరుద్ధరించాలనుకుంటే హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు. మీరు ఒక ఇంటిని నిర్మించడానికి, భూమిని కొనుగోలు చేయడానికి కూడా రుణం తీసుకోవచ్చు.
ఇప్పటికే ఉన్న ఆస్తిపై రుణం పొందాలనుకునే వ్యక్తులకు ఆస్తి పై లోన్ కూడా అందించబడుతుంది. తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందడానికి మీ ప్రస్తుత అధిక వడ్డీ రేటు గల లోన్‌ను బదిలీ చేసేందుకు హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కూడా సాధ్యమవుతుంది.
తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం అవసరమైన కనీస డౌన్ పేమెంట్ ఎంత?
మీరు అప్పుగా తీసుకోగల గరిష్ఠ మొత్తం ఎంత
సాధారణంగా అప్పుగా తీసుకోగల రుణ మొత్తం అనేది కస్టమర్ యొక్క తిరిగి చెల్లించే సామర్థ్యం, అతని క్రెడిట్ స్కోర్, అతని ఆదాయ స్థాయి (అతను/ఆమె ఎంత ఇఎంఐ చెల్లించవచ్చో నిర్ధారించడానికి) మరియు హోమ్ లోన్ రకం (కొత్త కొనుగోలు, పునరుద్ధరణ, పొడిగింపు లేదా ఆస్తి పై లోన్ లాంటివి) పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అందించబడే గరిష్ఠ లోన్ అనేది ఆస్తి ధరలో 90% వరకు ఉంటుంది. ఇది అవసరమైన రుణ మొత్తాన్ని బట్టి మరియు మిగిలిన షరతులు నెరవేర్పుకు లోబడి ఉంటుంది.
వడ్డీ రేట్ల రకాలు ఏమిటి?
హోమ్ లోన్ల కోసం వడ్డీ రేట్లు రెండు రకాలుగా ఉంటాయి – ఫిక్స్‌డ్ రేటు లేదా ఫ్లోటింగ్ రేటు. కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, రుణగ్రహీత అవసరాలను బట్టి పాక్షికంగా ఫిక్స్‌డ్ మరియు/లేదా పాక్షికంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటును కూడా అందించవచ్చు.
ఫిక్స్‌డ్ రేటు హోమ్ లోన్ - ఫిక్స్‌డ్ రేటు లోన్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటుతో వస్తుంది, ఆ తరువాత అది ఫ్లోటింగ్ రేటుతో తిరిగి చెల్లించబడుతుంది
ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్– ఫ్లోటింగ్ రేటు లోన్ విషయంలో, లోన్ అవధి అంతటా రేటు మారవచ్చు ఎందుకంటే ఇది ఆర్థిక బాధ్యతల ఆధారంగా మారే రిఫరెన్స్ వడ్డీ రేటుతో ముడిపడి ఉంటుంది.
హోమ్ లోన్ పై పన్ను ప్రయోజనాలు ఏమిటి
ఒక హోమ్ లోన్ పై ఆకర్షణీయమైన ఆదాయ పన్ను ప్రయోజనాలు ఉన్నాయి మరియు వాటిని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు –
- ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 24 కింద, స్వీయ-ఆక్రమిత ఆస్తి కోసం చెల్లించిన వడ్డీపై రూ. 200,000 మినహాయింపు పొందవచ్చు
- ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద, స్వీయ-ఆక్రమిత ఆస్తి కోసం ప్రిన్సిపల్ రీపేమెంట్ పై రూ.150,000 మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
- 2016-17 ఆర్థిక సంవత్సరం నుండి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే "హోమ్ లోన్‌పై వడ్డీ"గా మరో ₹50,000 పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే, ఇంటి విలువ ₹50 లక్షల కన్నా తక్కువగా ఉండాలి, హోమ్ లోన్ మొత్తం ₹35 లక్షల కంటే తక్కువగా ఉండాలి మరియు రుణం మంజూరు చేయబడిన తేదీన పన్ను చెల్లింపుదారు ఏ ఆస్తిని కలిగి ఉండకూడదు.
అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి
ఒకవేళ మీరు జీతం పొందే వ్యక్తి లేదా స్వయం-ఉపాధిగల నిపుణులు అయితే, హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు కింది విధంగా ఉన్నాయి–
జీతం పొందే ఉద్యోగులు | స్వయం ఉపాధిగల వారు/ వృత్తినిపుణులు |
---|---|
ఫోటోతో పాటు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారం | ఫోటోతో పాటు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారం |
వయస్సు రుజువు (పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టపరమైన సంస్థ నుండి పొందిన ఏదైనా ఇతర సర్టిఫికెట్) | వయస్సు రుజువు (పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, చట్టపరమైన సంస్థ నుండి పొందిన ఏదైనా ఇతర సర్టిఫికెట్) |
నివాస రుజువు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్) | నివాస రుజువు (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, చట్టపరమైన అధికారి నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్) |
విద్యా అర్హతలు – ఇటీవలి డిగ్రీ | విద్యా అర్హతలు - ఇటీవలి డిగ్రీ (ప్రొఫెషనల్స్ కోసం) |
గత 3 నెలల శాలరీ-స్లిప్‌లు | వ్యాపార ప్రొఫైల్‌తో పాటు వ్యాపార ఉనికికి సంబంధించిన సర్టిఫికేట్ మరియు రుజువు |
గత 2 సంవత్సరాల ఫారం 16 | చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా సర్టిఫై చేయబడిన/ఆడిట్ చేయబడిన ప్రాఫిట్ & లాస్ అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్లతో గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్ (స్వీయ మరియు వ్యాపారం) |
గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ (శాలరీ అకౌంట్) | గత 12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు (స్వీయ మరియు వ్యాపారం) |
‘పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ పేరుతో ప్రాసెసింగ్ ఫీజు చెక్కు | ‘పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ పేరుతో ప్రాసెసింగ్ ఫీజు చెక్కు |
ఆస్తి టైటిల్ డాక్యుమెంట్ల ఫోటోకాపీ, ఆమోదించబడిన ప్లాన్ | ఆస్తి యొక్క టైటిల్ డాక్యుమెంట్లు, ఆమోదించబడిన ప్లాన్ మొదలైన వాటి ఫోటోకాపీ. |
అన్ని డాక్యుమెంట్లకు స్వీయ-ధృవీకరణ అవసరం.
తప్పక చదవండి: హోమ్ లోన్లపై పన్ను ప్రయోజనాలు ఏమిటి? వాటిని ఎలా పొందాలి?
లోన్ అర్హతను ఎలా లెక్కించాలి
మీ లోన్ అర్హత అనేది మీ వయస్సు, ఆదాయ స్థాయి, రీపేమెంట్ సామర్థ్యం (ఇఎంఐ నుండి ఆదాయ నిష్పత్తి), ఇతర లోన్లకు చెందిన రీపేమెంట్ చరిత్ర మరియు మరి ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది. మీ హోమ్ లోన్ అర్హత ప్రమాణాలను చెక్ చేయడానికి, ఈ హోమ్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
ఇల్లు అనేది మీ జీవితకాలంలో మీరు కొనుగోలు చేసే అతి ముఖ్యమైన ఆస్తులలో ఒకటి ; ఈ చిట్కాలు ఒక ఇంటిని కలిగి ఉండటంలో మీకు సహాయపడతాయి.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ తన క్లయింట్స్ కోసం ఫిక్స్‌డ్ మరియు ఫ్లోటింగ్ రేటుతో, వివిధ కాలాల కోసం డైనమిక్ శ్రేణి హోమ్ లోన్లను అందిస్తుంది. మేము మీ లోన్లను 7 రోజుల్లోపు ప్రాసెస్ చేస్తామని మీకు తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము, ఎందుకంటే మీరు మీ కలల ఇంటిని త్వరగా సొంతం చేసుకోగలరని అర్థం చేసుకున్నాము.