ఒక ఇంటి కొనుగోలు అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక జీవితంలో అతిపెద్ద ఆర్థిక నిర్ణయం మరియు ట్రాన్సాక్షన్. ఇది అనేక సంవత్సరాలపాటు ప్రభావం చూపే ఒక నిర్ణయం. ఇది అనేక సంవత్సరాలపాటు మీ ఆదాయ అవుట్‌ఫ్లో ప్రకారం ప్లాన్ చేయవలసిన ఒక ట్రాన్సాక్షన్.
ఒక హోమ్ లోన్ అనేది ఒక దీర్ఘకాలిక ఆర్థిక నిబద్ధత, ఇది సాధారణంగా 20 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రకారం వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుని, హోమ్ లోన్ ప్రొవైడర్లు వడ్డీ రేట్లకు సంబంధించి మీకు రెండు ఎంపికలను అందిస్తారు. ఒకటి ఫిక్స్‌డ్ రేటు మరియు మరొకటి ఫ్లోటింగ్ రేటు.
వాటికి ఉన్న పేర్లు సూచిస్తున్నట్లుగానే, ఫిక్స్‌డ్ రేటు రుణం ఒక నిర్దిష్ట వ్యవధి కోసం ముందుగా పేర్కొన్న వడ్డీ రేటు వద్ద లభిస్తుంది, ఆ వ్యవధి తర్వాత అది ఫ్లోటింగ్ రేటు వద్ద తిరిగి చెల్లించబడుతుంది ; ఫ్లోటింగ్ రేట్ లోన్ విషయంలో, రుణ అవధి అంతటా రేటు మారుతుంది, ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మారే రిఫరెన్స్ వడ్డీ రేటు పై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతి దానికి స్వంత లక్షణాలు ఉన్నాయి మరియు మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ఫిక్స్‌డ్ రేట్ హోమ్ లోన్
- ముందుగా నిర్ణయించబడిన సమయం వరకు హెచ్చుతగ్గుల నుండి భద్రత: ఆర్థిక పరిస్థితులు సాధారణ వడ్డీ రేట్లలో పెరుగుదలకు కారణం అయ్యే సందర్భాలు ఏర్పడవచ్చు. ఒక ఫిక్స్‌డ్ రేటును ఎంచుకోవడం అనేది ప్రారంభంలో అటువంటి హెచ్చుతగ్గుల నుండి మీకు రక్షణ కల్పిస్తుంది మరియు మీరు ఫిక్స్‌డ్ టర్మ్ సమయంలో ప్రతి నెలా ఒక నిర్ణీత ఇఎంఐ మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే, ఫిక్స్‌డ్ టర్మ్ ముగిసిన తర్వాత, మీ వడ్డీ రేటు ఒక ఫ్లోటింగ్ ప్లాన్‌కు మారుతుంది, ఉదా., మీరు ఒక 5-సంవత్సరాల ఫిక్స్‌డ్ టర్మ్ ప్లాన్ ఎంచుకున్నట్లయితే, అప్పుడు 6వ సంవత్సరం నుండి, మీ హోమ్ లోన్ ప్రస్తుత ఫ్లోటింగ్ వడ్డీ రేటుకు లోబడి ఉంటుంది. కాబట్టి మీ వడ్డీ ఫిక్స్ చేయబడిన సమయంలో, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో మీరు తరచుగా తనిఖీ చేయవలసిన అవసరం లేదు
ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్
- కొద్దిగా చవక:ఫ్లోటింగ్ రేటు లోన్ల యొక్క వడ్డీ రేటు కొద్దిగా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ద్రవ్యోల్బణం లేదా వృద్ధి కారకాలు మొదలైనటువంటి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఇది హెచ్చుతగ్గులకు లోనవుతుంది. మార్కెట్ స్థితిగతుల ఆధారంగా రుణదాత రేటును పెంచుతారు లేదా తగ్గిస్తారు. అందువల్ల తక్కువ ద్రవ్యోల్బణం అవధిలో ఫ్లోటింగ్ రేటు అత్యంత ప్రయోజనకరంగా ఉండవచ్చు.
- రేట్లు తగ్గినప్పుడు తక్కువ ఇఎంఐ: హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండి లేదా డౌన్‌వర్డ్ ట్రెండ్‌లో ఉన్నట్లయితే, వడ్డీ రేట్లలో తగ్గుదల నుండి మీరు ప్రయోజనం పొందుతున్నందున మీరు ఫ్లోటింగ్ రేట్ లోన్‌లో డబ్బును ఆదా చేసుకోవచ్చు.
క్లుప్తంగా చెప్పాలంటే:
మీ అవసరాల ఆధారంగా మీరు రుణం రకాన్ని ఎంచుకోవాలి. అతనికి/ఆమెకు ఏది ఉత్తమంగా సరిపోతుందో దాని ఆధారంగా ఏమి ఎంచుకోవాలో రుణగ్రహీత నిర్ణయించుకోవాలి. మీ ప్రధాన ఆందోళన భద్రత మరియు నిశ్చితత్వం గురించి అయితే, మీరు కొంత వడ్డీ రేటు ప్రీమియం లేదా ఇతరత్రా ఖర్చుతో ఒక నిర్ణీత వడ్డీ రేటును ఎంచుకోవచ్చు
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ మరియు ఫ్లోటింగ్ రేటు లోన్లను అందిస్తుంది. ఫిక్స్‌డ్ రేటు 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వ్యవధికి వర్తిస్తుంది, దీని తర్వాత వడ్డీ రేటు ఆటోమేటిక్‌గా మారుతుంది