కార్పొరేట్ సామాజిక బాధ్యత
మా గురించి
పెహెల్ ఫౌండేషన్
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ అట్టడుగు వర్గాల వారిని చేరుకోవడం, వారి అభివృద్ధికి, వృద్ధికి పరిష్కారాలను అందించే ప్రాజెక్టులను రూపొందించడం, లబ్ధిదారులకు గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ సిఎస్ఆర్‌లో భాగమైన పెహెల్ ఫౌండేషన్ కూడా అదే దిశలో రూపొందించిన సిఎస్ఆర్ కార్యక్రమాలను అమలు చేయడానికి మరియు బలోపేతం చేయడానికి మాధ్యమంగా పనిచేస్తుంది. ఇది సమాజంలోని అణగారిన వర్గాల వృద్ధిని, సంక్షేమాన్ని నిర్ధారించే దిశగా మా 'నిరంతర' ప్రయత్నం మరియు 'చొరవను' సూచిస్తుంది. మరింత మంది జీవితాలను మెరుగుపరచేలా చేయడమే మా ప్రధాన లక్ష్యం.
ఎఫ్‌వై 2019-20 లో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 'పెహెల్ ఫౌండేషన్'ను స్థాపించింది’. ఇది సిఎస్ఆర్ కార్యక్రమాలను అమలు చేయడానికి, బలోపేతం చేయడానికి ఒక మాధ్యమంగా నిలుస్తుంది. ఇది సమాజంలోని అణగారిన వర్గాల వృద్ధిని, సంక్షేమాన్ని నిర్ధారించే దిశగా మా 'నిరంతర' ప్రయత్నం మరియు 'చొరవను' సూచిస్తుంది. మరింత మంది జీవితాలను మెరుగుపరచేలా చేయడమే మా ప్రధాన లక్ష్యం.
పిఎన్‌బి హౌసింగ్
సిఎస్ఆర్ జోక్యాలు
మహిళా సాధికారతలో అట్టడుగు వర్గానికి చెందిన మహిళల సార్వత్రిక వృద్ధి మరియు అభివృద్ధిని సాధించడంపై మేము దృష్టి సారిస్తున్నాము. మహిళల ఆదాయాన్ని పెంచడం, ఆర్థిక స్వతంత్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం మా ప్రధాన లక్ష్యం.
మహిళా సాధికారత ప్రాజెక్టుల ద్వారా అందించబడే మద్దతు/ అమలు ఈ కింది విధంగా ఉంది:
- a. గత ఆర్థిక సంవత్సరంలో రెండు నాప్కిన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి లక్నోలో ఉంది, మరొకటి గుజరాత్‌లోని వల్సాడ్‌లో ఉంది. సమీపంలోని గ్రామాల నుండి 64 మహిళలు ప్రస్తుతం నాప్కిన్‌ల ఉత్పత్తి, ప్యాకేజింగ్ మరియు విక్రయంలో నిమగ్నమై ఉన్నారు. రుతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం కారణంగా అనేక ఆరోగ్య ప్రమాదాలతో జీవిస్తున్న ఇతర గ్రామీణ మహిళలకు, వారి గ్రామాల్లో అవగాహన సెషన్లను నిర్వహించడంలో కూడా ఈ మహిళలు పాల్గొంటున్నారు. 200 గ్రామాల్లోని గ్రామీణ మహిళలను చేరుకోవడమే మా లక్ష్యం.
- b. మసాలా దినుసులు, ఊరగాయ ఉత్పత్తి కోసం మూడు యూనిట్లను ఏర్పాటు చేసి, 115 మంది గ్రామీణ మహిళలకు ఉత్పత్తి, ప్యాకేజింగ్, అమ్మకాలలో అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థను నిర్వహిస్తున్న మహిళలందరూ స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు. వారి ద్వారా సంపాదించిన లాభాలు వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించబడతాయి మరియు సభ్యుల మధ్య పంపిణీ చేయబడతాయి.
- c. కోవిడ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన వలస ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో 'మెరుగైన జీవన నాణ్యత'ను నిర్ధారించాలనే దిశగా ఒక ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టులో 150 మంది నిర్మాణ కార్మికులకు శిక్షణ ఇచ్చి, వారికి ఫ్యాషన్ పరిశ్రమలో చోటు కల్పించారు. ఈ అధునాతన శిక్షణలో జపాన్ నుండి దిగుమతి చేసుకున్న ప్రత్యేక కుట్టు మెషీన్లు ఉన్నాయి, వీటిపై శిక్షణ ఇవ్వడానికి ముందే మహిళలు వీటిని నేర్చుకున్నారు మరియు ఆచరణలో పెట్టారు. ఈ సంస్థల్లో పనిచేసే మహిళలు సగటున నెలకు ₹10,000 సంపాదిస్తున్నారు.
- d. 420 మంది చెవిటి మహిళలకు 4 వేర్వేరు వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. మిక్సర్ గ్రైండర్ రిపేర్, ఎల్ఇడి రిపేర్, మొబైల్ రిపేర్, ఎలక్ట్రికల్ లాంటి వృత్తులు ఉన్నాయి. శిక్షణ అనంతరం ఈ మహిళలు ప్రత్యేక వృత్తులలో నైపుణ్యం పొందుతారు, ఇది ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది.
- e. ఒడిశా రాష్ట్రం, భువనేశ్వర్ నగరంలోని ఎల్‌వి ప్రసాద్ ఐ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగుల పిల్లలను (10 సంవత్సరాల వయస్సు వరకు) చూసుకోవడానికి ఒక ప్రీస్కూల్ నిర్మించడం జరిగింది. ఈ చొరవ కారణంగా ఉద్యోగం, కుటుంబం మధ్యన ఏది ఎంచుకోవాలని సతమతం అయ్యే మహిళలు ఇప్పుడు నిశ్చింతగా ఉద్యోగం కొనసాగించేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా, ఇంతకు ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయిన మహిళా ఉద్యోగులలో కొందరు తిరిగి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
- f. రాజస్థాన్ గ్రామాల్లోని 7 గ్రామీణ కేంద్రాల్లో 120 మంది గ్రామీణ మహిళల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వీరు 6 నెలల పాటు శిక్షణ పొంది, ఆపై వారికి అందించిన మగ్గాలపై పని చేస్తున్నారు. వీరు తయారు చేసిన తివాచీలను విక్రయిస్తున్నారు మరియు ప్రస్తుతం తివాచీ తయారీ రంగంలో మంచి లాభాలను కూడా పొందుతున్నారు.
ఆరోగ్య సంరక్షణ అనేది మరో కీలక అంశం. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు, అధునాతన ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవలు అందుబాటులో లేని వర్గాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రాజెక్టులను రూపొందించేందుకు మేము కృషి చేస్తున్నాము.
సిఎస్ఆర్ ప్రాజెక్టులు అందించే మద్దతు/ ఆచరణ కింది విధంగా ఉంది:
- a. 6 పిహెచ్‌సి (ప్రాధమిక ఆరోగ్య కేంద్రం)/ సిహెచ్‌సి (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లకు మద్దతు ఇవ్వడమైనది. మౌలిక సదుపాయాలను పూర్తిగా మెరుగైన ప్రమాణాలకు మార్చడం జరిగింది. ఈ కేంద్రాలలో కొన్నింటిలో అధునాతన ప్రయోగశాలలు, పరీక్షా యంత్రాలు లాంటి అనేక వైద్య, ప్రయోగశాల పరికరాలు ఏర్పాటు చేయబడ్డాయి.
- b. మౌలిక సదుపాయాల నవీకరణతో పాటు పలు వైద్య, ప్రయోగశాల పరికరాలతో 2 ప్రభుత్వ ఆసుపత్రులకు మద్దతు ఇవ్వడం జరిగింది. వాటిలో ఒకటి (ససూన్ జనరల్ హాస్పిటల్, పూణే), దీనిలో 4000 ఒపిడి రోగులు, 1500 అడ్మిట్ రోగులకు వసతి సౌకర్యాలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల నవీకరణ, ఆధునిక ప్రయోగశాల ఏర్పాటుతో పాటు రోజుకు 500 ల్యాబ్ పరీక్షలు జరిగేలా భారీ స్థాయిలో మద్దతు అందించబడింది.
- c. శ్రామికుల అవసరాలను తీర్చేందుకు 4 ప్రాంతాల్లో (ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై) 4 మొబైల్ మెడికల్ క్లినిక్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ క్లినిక్‌లు మురికివాడల సమీప ప్రాంతాలకు, నిర్మాణ స్థలాలకు చేరుకుని, సాధారణ ఆరోగ్య కేంద్రాలకు చేరుకోలేని నిర్మాణ కార్మికులకు అక్కడి నుంచే ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి.
- d. రోగులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి 2 రోగి రవాణా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న రోగులకు ఆరోగ్య కేంద్రాలకు చేరుకోవడానికి, వీలు లేని గ్రామీణ ప్రజలకు ఇప్పుడు ఈ రవాణా ద్వారా ఆరోగ్య కేంద్రాలను సందర్శించడం సుసాధ్యం అయింది.
- ఇ. వినికిడి లోపం ఉన్న పిల్లలకు 250 వినికిడి పరికరాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ వినికిడి పరికరాలు పిల్లలకు ఆశీర్వాదం లాంటివి. వినికిడి పరికరాలను ఉపయోగించిన తరువాత వారికి మాట్లాడటానికి శిక్షణ ఇవ్వబడింది మరియు వారు మాట్లాడటం కూడా ప్రారంభించారు.
విద్యా రంగంలో మేము అడ్వాన్స్‌డ్ లర్నింగ్ టెక్నాలజీ, మెరుగైన మౌలిక సదుపాయాలు, స్కాలర్‌షిప్స్ మరియు అభ్యాస సహాయాన్ని కలిగి ఉన్న చొరవల ద్వారా విద్యార్థులకు మెరుగైన అభ్యాస ప్రయాణం మరియు భవిష్యత్తును అందించే ప్రాజెక్టులను మేము ఎంపిక చేస్తాము.
మద్దతు ఇవ్వబడిన/ప్రారంభించబడిన ప్రాజెక్టులు కింది విధంగా ఉన్నాయి:
- a. 4 ప్రభుత్వ అంగన్‌వాడీలలో మౌలిక సదుపాయాలు, విద్యా మెటీరియల్స్, ఆట స్థలాలు మరియు బొమ్మలతో నవీకరించబడింది. మరో ఐదు అంగన్‌వాడీలలో కూడా ఇలాంటి పనులు జరుగుతున్నాయి. అన్ని అప్‌గ్రేడేషన్ కార్యకలాపాలు రోజువారీ ప్రాతిపదికన మరింత మంది పిల్లలను అంగన్‌వాడీకి వచ్చేలా ప్రోత్సహించాయి.
- b. విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి, అభ్యాస ఉపకరణాలు మరియు గోడలపై సమాచారవంతమైన వాల్ ఆర్ట్‌తో 2 పాఠశాలల్లో పాఠశాల పరివర్తన జరిగింది. వినూత్నమైన ఆట స్థలం, ‘స్వచ్ఛతా వాహిని’ అని పిలువబడే పరిశుభ్రమైన మరుగుదొడ్లు బస్సు ఆకారంలో నిర్మించబడ్డాయి మరియు ప్రత్యేకమైన భోజన ప్రాంతం అనేవి ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యేకంగా నిలబెట్టడానికి మరియు సమీప గ్రామాల నుండి ఎక్కువ ప్రవేశాలను ఆకర్షించే ప్రత్యేక లక్షణాలు.
- c. విద్యుత్ కనెక్షన్‌లను చేరుకున్న గ్రామీణ గ్రామాల్లోని 23 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ లోడ్ షేడింగ్ ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో పగటిపూట విద్యుత్ సరఫరా లేనప్పుడు, ఈ చర్య వల్ల విద్యార్థులకు లోడ్ షేడింగ్ వల్ల కలిగే అసౌకర్యాల కారణంగా హాజరుకానితనం తగ్గుతుంది.
- d. 47 ప్రభుత్వ పాఠశాలల్లో ఇ-లెర్నింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ విద్యార్థులకు నేర్చుకోవడానికి ఆడియో-విజువల్ సహాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇ-లెర్నింగ్ మౌలిక సదుపాయాల ద్వారా 4500 మంది విద్యార్థులు ప్రతిరోజూ ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ తరగతులకు ప్రాప్యత కలిగి ఉంటారు.
- e. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు వారి చదువులను పూర్తి చేసుకొనేందుకు మద్దతును, ప్రేరణను అందించడం కోసం స్కాలర్ షిప్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ స్కాలర్‌షిప్‌ను పాన్ ఇండియాలోని 400 మంది విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది.
- f. జార్ఖండ్‌లోని పలు గిరిజన గ్రామాల నుండి విద్యార్థులను సమీప పాఠశాలలకు రవాణా చేయడానికి 1 స్కూల్ బస్సుకు మద్దతు ఇవ్వబడింది. గిరిజన పాఠశాల పిల్లలకు పేద కుటుంబ ఆదాయం కారణంగా పాఠశాలకు రవాణా సౌకర్యం లేదు మరియు ఎక్కువగా వీరు మారుమూల ప్రాంతాల నుండి వచ్చారు. స్కూల్ బస్సును అందించడం వల్ల పాఠశాలకు హాజరు కావడంలో సంకోచాన్ని అధిగమించడానికి మరియు వారికి సమానమైన విద్యా అవకాశాలకు ప్రాప్యత ఇవ్వడానికి సహాయపడుతుంది.
- g. 20 పాఠశాలల్లో స్టెమ్ (సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్) అభ్యాసానికి మద్దతు ఇస్తుంది. ఈ ప్రాజెక్టు వివిధ ప్రాక్టికల్ కార్యకలాపాలు, వర్క్‌షాప్‌లు, హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్ మరియు వివిధ భావనలు, నైపుణ్యాలను నేర్చుకోవడంలో సహాయపడే ప్రయోగాత్మక, సరదా అభ్యాసాన్ని నిర్వహించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన స్టెమ్ విద్యను అందిస్తుంది. ఇది కంప్యూటేషనల్ థింకింగ్, సమస్య-పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచన, లాజికల్ రీజనింగ్, మెరుగైన నిర్ణయం తీసుకోవడం మరియు మంచి పరిశీలన శక్తి లాంటి వినూత్నమైన నైపుణ్యాలను పెంచుతుంది.
పర్యావరణాన్ని పునరుద్దరించడానికి మరియు సమాజానికి తిరిగి ఇవ్వడానికి, వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే, లబ్ధిదారులకు స్వచ్ఛమైన నీటిని అందించే రీఛార్జ్, రీసైక్లింగ్ మరియు సహజ వనరుల నిర్వహణపై పనిచేసే బాధ్యతను మేము తీసుకున్నాము.
మద్దతు ఇవ్వబడిన/ప్రారంభించబడిన ప్రాజెక్టులు కింది విధంగా ఉన్నాయి:
- a. ఏటా 27.22 మిలియన్ లీటర్ల నీటిని సేకరించే సామర్థ్యంతో, 1606 గ్రామీణ జనాభాకు ప్రయోజనం చేకూర్చే విధంగా రెండు చెరువులు మొదటి నుండి అభివృద్ధి చేయబడ్డాయి. ఇది వారికి వ్యవసాయం, తోటల పెంపకం మరియు జంతువులకు నీటి లభ్యతలో ప్రయోజనం చేకూరుస్తుంది, దీని ఫలితంగా గ్రామస్తుల ఆదాయం మరింత పెరుగుతుంది.
- b. రాజస్థాన్‌లోని గౌలా మరియు మల్ కీ టూస్ అనే రెండు గ్రామాల్లో ఇంటి స్థాయిలో సురక్షితమైన తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 గ్రామాల్లో 944 కుటుంబాలు వారి జీవితంలో తొలిసారి ప్రత్యక్ష తాగునీటి పైప్‌లైన్ కనెక్షన్ పొందుతున్నారు. ఈ ప్రాజెక్టులో సోలార్ వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్‌తో పాటు ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించబడింది, ఈ సిస్టమ్ యొక్క స్థిరమైన పనితీరును నిర్ధారించడానికి నీటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
- c. తగినంత నీటి లభ్యత లేని మరియు నీటి నాణ్యత చాలా పెద్ద సమస్యగా ఉన్న ప్రాంతాల్లో ఒక గంటలో 1000 లీటర్ల నీటిని పంపిణీ చేసే సామర్థ్యం గల మూడు ఆర్ఒ ప్లాంట్లు స్థాపించబడ్డాయి. ఈ 3 ప్లాంట్లు నుండి సమిష్టిగా సంవత్సరానికి 75000 జనాభాకు తాగు నీరు అందిస్తుంది.
- d. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ దిశగా, ప్లాస్టిక్ వ్యర్థాలు భారీ పరిమాణంలో ఉత్పత్తి అయ్యే బహిరంగ ప్రదేశాల్లో 16 ప్లాస్టిక్ బాటిల్ క్రషర్ల ఏర్పాటు కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా మేము ఈ మెషీన్లలో ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను పారవేసేలా ప్రజలను ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము, వీటిని మెషీన్స్‌లో క్రష్ చేసి, రీసైక్లింగ్ యూనిట్లకు రీసైకిల్ కోసం పంపిస్తాము. ఈ విధంగా ఈ ప్రాజెక్టు అనేక రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను నెలలో కూరుకుపోకుండా ప్లాస్టిక్‌ని అరికడుతుంది, అలాగే, నేరుగా రీసైక్లింగ్ కోసం పంపబడుతుంది.
పిఎన్‌బి హౌసింగ్
కార్పొరేట్ సామాజిక బాధ్యత
విజన్ స్టేట్‌మెంట్
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత అనేది ఒక జీవన విధానం. మేము మా వ్యాపార తత్వశాస్త్రం మరియు కార్యకలాపాలలో కార్పొరేట్ బాధ్యత సూత్రాలను పొందుపరిచాము. ఇప్పటివరకు మా ప్రయాణంలో మేము స్థిరమైన వ్యాపార నమూనాను నిర్మించాము, మా వాటాదారులకు విలువను సృష్టించాము. పేద ప్రజల జీవితాలను మెరగుపరచగలము అన్న విశ్వాసం మాకు ఉంది. దేశ నిర్మాణం దిశగా మా వినయపూర్వకమైన సామూహిక ప్రయత్నాలను బలపరుస్తామని మేము నమ్ముతున్నాము.
మిషన్ స్టేట్‌మెంట్
సమగ్రవంతమైన చొరవలను ప్లాన్ చేసి, పెద్ద మొత్తంలో సమాజంలో సామాజిక-ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. ఈ చొరవలు ప్రత్యక్ష లబ్ధిదారుల అభివృద్ధిని మాత్రమే కాకుండా, ప్రభావ ప్రాంతం యొక్క పర్యావరణ వ్యవస్థలో ఉన్న వారి జీవన నాణ్యతను కూడా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి.