PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

హోమ్ లోన్ కోసం రీపేమెంట్ వ్యవధి ఎంత?

give your alt text here

తగినంత ఆర్థిక వనరులు లేకుండా తమ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి చాలామందికి సవాలుగా ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో ఒక హోమ్ లోన్ అనేది ఉత్తమ ఎంపిక, ఎందుకంటే ఇది ఒకేసారి డబ్బును ముందుగానే చెల్లించకుండా ఒక ఇంటిని సొంతం చేసుకోవడానికి ప్రజలకు స్వేచ్ఛను ఇస్తుంది. రుణం అంగీకరించబడిన నిబంధనల ప్రకారం, ఒక నిర్దిష్ట వ్యవధిలో వడ్డీతో పాటు మొత్తం రుణం మొత్తాన్ని చెల్లించవచ్చు.

దీనినే మేము హోమ్ లోన్ యొక్క రీపేమెంట్ అవధి అని పేర్కొంటాము. తరచుగా 30 సంవత్సరాల వరకు ఉండే హోమ్ లోన్ అవధులు మీ ఫైనాన్సులకు హాని కలిగించని వ్యవధిని మీరు ఎంచుకోవచ్చు. కానీ అనేకమంది దరఖాస్తుదారులకు హోమ్ లోన్ రీపేమెంట్ అవధికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి - సరైన అవధిని ఎలా ఎంచుకోవాలి అనేది ఒక ప్రశ్న. ఈ బ్లాగ్‌లో, వాటికి సమాధానం ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము.

రుణ అవధి అంటే అర్థం ఏమిటి?? హోమ్ లోన్ కోసం సరైన మరియు గరిష్ట అవధి గురించి తెలుసుకోండి

బ్యాంకింగ్ పరిభాషలో రుణ అవధి అంటే రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించడానికి మీ రుణ ఇఎంఐ చెల్లింపులను విభజించిన పూర్తి వ్యవధి. ఇది 30 సంవత్సరాలకు పైగా ఉండవచ్చు. గరిష్ట హోమ్ లోన్ అవధి సాధారణంగా దరఖాస్తుదారు యొక్క రిటైర్‌మెంట్ వయస్సు ఆధారంగా నిర్ణయించబడుతుంది, కానీ ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

ఒక హోమ్ లోన్ అవధిని హోమ్ లోన్ రీపేమెంట్ అవధి అని కూడా పిలుస్తారు, అంటే ఇది ఒక నిర్దిష్ట సమయం, ఈ సమయంలో మీరు వడ్డీతో పాటు మీ మొత్తం హోమ్ లోన్ చెల్లించాలి. ఒక హోమ్ లోన్ సాధారణంగా దీర్ఘకాలికంగా లేదా స్వల్పకాలికంగా ఉంటుంది. హోమ్ లోన్ గరిష్ట అవధి 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు. మరింత తెలుసుకుందాం:

దీర్ఘకాలిక హోమ్ లోన్ అవధి

  • అత్యంత దీర్ఘకాలిక లోన్లు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. గరిష్ట హోమ్ లోన్ అవధి 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
  • దీర్ఘకాలిక రుణాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలిక అవధి కూడా రుణ అర్హతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
  • రుణ అవధిని బట్టి, ఇఎంఐ లు తక్కువగా ఉంటాయి. అందువల్ల, దీర్ఘకాలిక హోమ్ లోన్ అవధులు దీర్ఘకాలంలో మరింత సరసమైనవిగా ఉంటాయి.
  • అయితే, దీర్ఘకాలిక అవధి కోసం హోమ్ లోన్ యొక్క వడ్డీ భాగం చాలా ఎక్కువగా ఉంటుంది.

స్వల్పకాలిక హౌసింగ్ లోన్ అవధి

  • స్వల్పకాలిక హౌసింగ్ లోన్ అవధి అనేది ఐదు సంవత్సరాల కంటే తక్కువ లేదా సమానంగా ఉన్న ఏదైనా హోమ్ లోన్ అవధిని సూచిస్తుంది. హోమ్ లోన్ కనీస అవధి సాధారణంగా 2 సంవత్సరాలుగా ఉంటుంది.
  • అటువంటి రుణం యొక్క ప్రయోజనం ఏంటంటే మీరు త్వరగా రుణ విముక్తులు అవుతారు మరియు తక్కువ సమయంలో ఆస్తిని మీ పేరు పై రిజిస్టర్ చేయించుకుంటారు.
  • హోమ్ లోన్ అవధి తక్కువగా ఉన్నందున, తక్కువ రుణ వ్యవధి ఉన్న రుణాల కోసం బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి.
  • స్వల్పకాలిక రుణాల అవధి తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇఎంఐ లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. అయితే, రుణం పై పూర్తి వడ్డీ మొత్తం దీర్ఘకాలిక హోమ్ లోన్ కంటే తక్కువగా ఉంటుంది.

స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాల మధ్య భేదాలు

దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక హోమ్ లోన్ అవధి మధ్య ఎంచుకోవడం అనేది మీ అవసరాలు, ఆర్థిక సామర్థ్యాలు మరియు అర్హత మీద ఆధారపడి ఉంటుంది.

మీరు ప్రతి నెలా తక్కువ ఇఎంఐ మొత్తాన్ని చెల్లించాలనుకుంటే మరియు మీరు రుణ వడ్డీ రూపంలో చెల్లించవలసిన వడ్డీ గురించి చింత లేకపోతే మీరు దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక హోమ్ లోన్లు సాధారణంగా యువ దరఖాస్తుదారులకు అందించబడతాయి.

మరోవైపు, మీరు త్వరిత రైనా రీపేమెంట్ కోరుకుంటే మరియు అధిక వడ్డీ రేట్ల గురించి చింత లేకపోతే స్వల్పకాలిక రుణాలు మెరుగ్గా ఉంటాయి. మీరు ఎక్కువ వయస్సు ఉన్న దరఖాస్తుదారు అయితే, మీ హోమ్ లోన్ అవధి సాధారణంగా తక్కువగా ఉంటుంది మరియు మీరు రిటైర్ అయ్యే సమయంలో ముగుస్తుంది.

హౌసింగ్ లోన్ అవధి మీ ఇఎంఐ మరియు వడ్డీ భాగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో లెక్కించడానికి మా వెబ్‌సైట్‌లో హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ సాధనాన్ని మీరు ఉపయోగించవచ్చు.

ఉత్తమ హోమ్ లోన్ అవధిని ఎలా ఎంచుకోవాలి

మీరు హౌసింగ్ లోన్ అవధిని నిర్ణయించడానికి ముందు అనేక అంశాల గురించి ఆలోచించవలసి ఉంటుంది. అవి:

  1. రుణ మొత్తం – పెద్ద హోమ్ లోన్ మొత్తం తీసుకున్న సందర్భంలో మీ హోమ్ లోన్ అర్హతను మెరుగుపరచడానికి , దీర్ఘకాలిక హోమ్ లోన్ అవధిని ఎంచుకోవడం ఎల్లప్పుడూ మంచి ఆలోచన. ఎందుకంటే, దీర్ఘకాలిక హోమ్ లోన్లు మీ ఇఎంఐ ను తగ్గిస్తాయి, ఇది రుణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యం పై రుణదాతకు మరింత విశ్వాసం అందిస్తుంది.
  2. ఇఎంఐ – దీర్ఘకాలంలో మీరు ఎంత ఇఎంఐ ని భరించగలరు అనేది మీ అవధిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఇప్పటికే ప్రతి నెలా ఇతర ఇఎంఐ లను చెల్లిస్తున్నట్లయితే, మీరు పెద్ద మొత్తంలో హోమ్ లోన్ ఇఎంఐ ని భరించలేరు. అయితే, దీర్ఘకాలిక రుణం తక్కువ ఇఎంఐ కలిగి ఉన్నప్పటికీ, మీరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారు అని గుర్తుంచుకోండి.
  3. వయస్సు – మీరు స్థిరమైన, ఆరోగ్యకరమైన ఆదాయం కలిగి యుక్త వయస్సులో ఉన్నట్లయితే, మీ ఆర్థిక స్థితి ప్రకారం దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక రుణాల మధ్య ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది.

ముగింపు

అందువల్ల, మీ హోమ్ లోన్ అవధిని ఆప్టిమైజ్ చేయడం ద్వారా, మీరు మీ మొత్తం వడ్డీ ఖర్చును కూడా తగ్గిస్తూ ఇఎంఐలను నియంత్రించవచ్చు. కాబట్టి, సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం!

ఇదంతా మీకు గందరగోళాన్ని కలిగిస్తే, చింతించకండి! పిఎన్‌బి హౌసింగ్ వద్ద మా ప్రతినిధులు ఎల్లప్పుడూ, సరైన హోమ్ లోన్ అవధిని ఎలా ఎంచుకోవాలి సహా మీ హోమ్ లోన్ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. నేడే సంప్రదించండి!

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్