భారతదేశంలోని లక్షలాది మంది ప్రజలకు హోమ్ లోన్లు జీవితాన్ని సులభతరం చేసింది అనేది కాదనలేని వాస్తవం. ఇది ఒక ఇంటిని సొంతం చేసుకోవాలని లేదా రియల్ ఎస్టేట్ ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని అనుకునే ఎవరికైనా చాలా సరసమైన పరిష్కారం. ఎందుకు? ఎందుకంటే ఒక హోమ్ లోన్ సులభంగా నిర్వహించగలిగే ఇఎంఐ లలో ఆస్తి ఖర్చును చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కానీ మీరు మీ రుణదాత నుండి మొత్తం ఆస్తి ధరను లోన్‌గా పొందుతారా? సమాధానం కాదు.
మీరు హోమ్ లోన్ డౌన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుదారుగా మీరు ఆస్తి కొనుగోలు కోసం చెల్లించే ముందస్తు ఖర్చు, మిగిలిన ఆస్తి ఖర్చును హోమ్ లోన్ ఇఎంఐ లుగా చెల్లించాలి.
ఈ బ్లాగ్‌లో, ఒక డౌన్ పేమెంట్ అంటే ఏమిటి, ఒక హోమ్ లోన్ కోసం కనీస డౌన్ పేమెంట్ ఎంత, డౌన్ పేమెంట్ నిర్వహించడానికి చిట్కాలు మరియు మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
హోమ్ లోన్ డౌన్ పేమెంట్ అంటే ఏమిటి?
మీ హోమ్ లోన్ డౌన్ పేమెంట్ అనేది మీ హోమ్ లోన్ అర్హత పై ఆధారపడి ఉంటుంది.
ఒక హోమ్ లోన్ మంజూరు చేయడానికి ముందు, మీ రుణదాత మీ హోమ్ లోన్ అప్లికేషన్ మరియు సంబంధిత డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రుణదాత పరిశీలించే అంశాలు ఇవి:
- దరఖాస్తుదారుడి యొక్క వయస్సు
- దరఖాస్తుదారుని ఆదాయం
- దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోర్
- దరఖాస్తుదారు యొక్క ప్రస్తుత రుణాలు
- దరఖాస్తుదారుని వృత్తి/వ్యాపారం యొక్క స్వభావం
- దరఖాస్తుదారుని ఆదాయపు పన్ను రిటర్న్స్
- స్థిరాస్తి విలువ
మీరు హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ మరియు హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి తనిఖీ చేయవచ్చు.
ఈ అంశాల ఆధారంగా, రుణదాత మీకు అర్హత కలిగిన హౌసింగ్ లోన్ యొక్క గరిష్ట మొత్తాన్ని మీకు తెలియజేయగలుగుతారు. చివరగా, మీరు ఒక హోమ్ లోన్ రూపంలో 100% ఆస్తి విలువను పొందరు. ఆస్తి ఖర్చులో మీరు విక్రేతకు ముందుగానే చెల్లించవలసిన కొంత శాతం ఉంటుంది. దీనిని ఇంటి పై డౌన్ పేమెంట్ లేదా ఆస్తి కొనుగోలుకు 'ఒకరి స్వంత సహకారం' అని పేర్కొంటారు.
తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం డౌన్ పేమెంట్ అంటే ఏమిటి?
హోమ్ లోన్ కోసం అవసరమైన కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ఆర్‌బిఐ/ఎన్‌హెచ్‌బి మార్గదర్శకాల ప్రకారం, ఆస్తి ఖర్చును బట్టి బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు 90% ఎల్‌టివి (రుణ విలువ నిష్పత్తి) వరకు అందించవచ్చు.
- 30 లక్షల కంటే తక్కువ ఆస్తి కోసం: గరిష్టంగా 90% ఎల్‌టివి అనుమతించబడుతుంది
- 30 నుండి 75 లక్షల వరకు ఉండే ఆస్తి కోసం: గరిష్టంగా 80% ఎల్‌టివి అనుమతించబడుతుంది
- 75 లక్షల కంటే ఎక్కువ ఆస్తి కోసం: గరిష్టంగా 75% ఎల్‌టివి అనుమతించబడుతుంది
అంటే హోమ్ లోన్ పొందడానికి బ్యాలెన్స్ ఆస్తి ధరను ఇంటి కొనుగోలుదారు డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది.
హోమ్ లోన్ కోసం కనీస డౌన్ పేమెంట్ చెల్లించడం వలన కలిగే ప్రయోజనాలు
అయితే, ఒక హోమ్ లోన్ కోసం చిన్న డౌన్ పేమెంట్ చెల్లించడం చాలా సహేతుకమైనది మరియు లాభదాయకమైనదిగా అనిపిస్తుంది. దాని ప్రయోజనాల్లో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- ఇది మరింత సరసమైనది.
- డౌన్ పేమెంట్ కోసం డబ్బును జనరేట్ చేయడానికి మీ ముఖ్యమైన పొదుపులు లేదా పెట్టుబడులను మీరు ఉపయోగించవలసిన అవసరం ఉండదు.
- మిగిలిన నగదు మొత్తాన్ని అధిక రాబడిని అందించే ఇతర ఆస్తులలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.
అయితే, మీ డౌన్ పేమెంట్ ఎంత తక్కువగా ఉంటే, మీ హోమ్ లోన్ మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం మీరు ఎక్కువ కాలం పాటు అధిక వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు.
హోమ్ లోన్ కోసం పెద్ద డౌన్ పేమెంట్ చెల్లించడం వలన ప్రయోజనాలు
మీకు వీలైతే, ఆర్థికంగా సాధ్యమైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లించవలసిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. అయితే, ఇది మీ పొదుపు మొత్తాలను లేదా మీ ఆర్థిక భద్రతను ప్రమాదంలో పడేయకూడదు. అలా చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
- మీ హోమ్ లోన్ మొత్తం తగ్గించబడుతుంది, ఇది చివరికి మీ మొత్తం బాధ్యతను తగ్గిస్తుంది.
- తక్కువ హోమ్ లోన్ మొత్తంతో, మీ రుణదాత నుండి మీరు మరింత అనుకూలమైన వడ్డీ రేట్లు మరియు తక్కువ ఇఎంఐ ని పొందుతారు.
- మీ హోమ్ లోన్‌ను మీరు చాలా త్వరగా చెల్లించవచ్చు.
తప్పక చదవండి: మీ హోమ్ లోన్ వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి (4 సాధారణ చిట్కాలు)
ముగింపు
మీరు చెల్లించవలసిన హోమ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం సరి అయిన మొత్తం అంటూ ఏదీ లేదు. ఇది పూర్తిగా మీ ఆర్థిక సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. అయితే, మీకు వీలైతే, ఒక 30-40% డౌన్ పేమెంట్ చెల్లించడం వలన దీర్ఘకాలంలో మీ హోమ్ లోన్ అత్యంత సరసమైనదిగా మారుతుంది! అందువల్ల, మీ ఆర్థిక భారం తగ్గడం కోసం డౌన్ పేమెంట్‌గా చెల్లించగల సాధ్యమైనంత ఉత్తమ మొత్తం తెలుసుకోవడానికి మీరు రుణదాత ఖచ్చితంగా సంప్రదించాలి.
పిఎన్‌బి హౌసింగ్ వద్ద, డౌన్ పేమెంట్స్ పై మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేటు వద్ద అత్యంత సరసమైన మరియు విశ్వసనీయమైన హోమ్ లోన్ ఆఫర్లను పొందడానికి మీకు సహాయపడతాము. మరింత తెలుసుకోవడానికి నేడే మమ్మల్ని సంప్రదించండి!