అర్హత ప్రమాణాలు
ఎన్‌ఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్‌డేట్:
-
english
శోధించండి ఆన్‌లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
మీ ఆస్తి విలువలో
90% వరకు హోమ్ లోన్ పొందండి
హోమ్ లోన్
అర్హత ప్రమాణాలు
మార్కెట్‌లో అతి తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేట్లను అందిస్తూ పిఎన్‌బి హౌసింగ్, తమ కలల ఇంటిని కొనుగోలు చేయాలనే లేదా నిర్మించాలనే ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని చూస్తున్న వారందరికీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
కాబట్టి, మీరు గరిష్ఠంగా 30 సంవత్సరాల వ్యవధితో, ముందస్తు చెల్లింపు లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు లేకుండా, ఆస్తి విలువలో 90% వరకు రుణంగా అందించే వ్యక్తిగతీకరించిన హోమ్ లోన్‌ను ఎలా పొందగలరు? చాలా సులభం! ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న లేదా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అన్ని రకాల జీతభత్యాలు గల ఉద్యోగుల కోసం మేము అత్యంత పారదర్శకమైన హోమ్ లోన్ అర్హత ప్రమాణాలను కలిగి ఉన్నాము.
మీరు దీని కోసం ప్రమాణాలను నెరవేర్చారో హోమ్ లోన్ పిఎన్‌బి హౌసింగ్ నుండి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది, వీటితో సహా:
హోమ్ లోన్
వృత్తి ఆధారంగా అర్హత ప్రమాణాలు
-
వయస్సు: లోన్ ప్రారంభమయ్యే సమయానికి జీతం పొందే దరఖాస్తుదారులందరూ తప్పనిసరిగా 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సును కలిగి ఉండాలి. అదనంగా, లోన్ మెచ్యూరిటీ సమయంలో మీ వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు.
-
నివాసం: మీరు భారతదేశంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
-
వృత్తి అనుభవం: మీరు కనీసం 3 సంవత్సరాల వృత్తి అనుభవం కలిగి ఉండాలి.
-
జీతం: మీ కనీస జీతం నెలకు ₹15,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
-
రుణ మొత్తం: ₹8 లక్షల నుండి ప్రారంభం
-
వ్యవధి: 30 సంవత్సరాల వరకు
-
ఎల్‌టివి: 90% వరకు
-
అవసరమైన క్రెడిట్ స్కోర్: 611+
-
వయస్సు: హోమ్ లోన్ కోసం అప్లై చేసే సమయంలో దరఖాస్తుదారులు 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. హోమ్ లోన్ మెచ్యూరిటీ సమయంలో వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు.
-
నివాసం: మీరు భారతదేశంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
-
వృత్తి అనుభవం: మీరు కనీసం 3 సంవత్సరాల వ్యాపార కొనసాగింపును కలిగి ఉండాలి.
-
రుణ మొత్తం: ₹8 లక్షల నుండి మొదలవుతుంది.
-
అవధి: 20 సంవత్సరాల వరకు.
-
ఎల్‌టివి: 90% వరకు
-
అదనంగా: మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ కోసం అప్లై చేయండి.
-
క్రెడిట్ స్కోర్: *ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి కనీసం 611 క్రెడిట్ స్కోర్ అవసరం.
ను ఉపయోగించేందుకు అనుమతిస్తుంది, వీటి సహాయంతో మీ హోమ్ లోన్ అర్హత, లోన్ వ్యవధిని మరియు ఇఎంఐని అంచనా వేయవచ్చు.
స్వయం-ఉపాధిగల/వృత్తిపరమైన నిపుణుల కోసం అవసరమైన హోమ్ లోన్ డాక్యుమెంట్లు
జీతం పొందే దరఖాస్తుదారులకు అవసరమైన హోమ్ లోన్ డాక్యుమెంట్లు
స్వయం ఉపాధిగల/ వృత్తి నిపుణుల కోసం
-
రుణ దరఖాస్తు ఫారం లాంటి తప్పనిసరి డాక్యుమెంట్లు
-
వయస్సు మరియు నివాస రుజువుగా కెవైసి డాక్యుమెంట్లు
-
గత 3 సంవత్సరాల ఐటిఆర్, మునుపటి 12 నెలల వ్యాపార అకౌంటు సంబంధిత బ్యాంక్ స్టేట్ మెంట్లు
-
ఆస్తి టైటిల్, ఆమోదించబడిన ప్లాన్, సేల్ డీడ్ మొదలైనటువంటి ఇతర ఆస్తి డాక్యుమెంట్లు.
జీతం పొందే దరఖాస్తుదారుల కోసం
-
చిరునామా రుజువు : ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, ఎలక్షన్ కార్డు, చట్టపరమైన అధికారిక సంస్థ నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్
-
వయస్సు రుజువు : పాన్ కార్డు, పాస్‌పోర్ట్, చట్టపరమైన అధికారిక సంస్థ నుండి ఏదైనా ఇతర సర్టిఫికెట్
-
ఆదాయం రుజువు: గత 3 నెలల శాలరీ స్లిప్పులు
మీ అర్హతను లెక్కించండి
హోమ్ లోన్
వయస్సు ఆధారంగా అర్హత ప్రమాణాలు
దరఖాస్తుదారుని వయస్సు | గరిష్ఠ హోమ్ లోన్ అవధి |
---|---|
25 సంవత్సరాలు | 30 సంవత్సరాలు |
30 సంవత్సరాలు | 30 సంవత్సరాలు |
35 సంవత్సరాలు | 30 సంవత్సరాలు |
40 సంవత్సరాలు | 30 సంవత్సరాలు |
45 సంవత్సరాలు | 25 సంవత్సరాలు |
50 సంవత్సరాలు | కంపెనీ అభీష్టానుసారం* |
తనిఖీ చేయండి
ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ అర్హత ప్రమాణాలు
అయితే, హోమ్ లోన్ అర్హత ప్రమాణాలను ప్రభావితం చేసే అంశాలు ఏవి? వయస్సు, ఆదాయం, వృత్తి, క్రెడిట్ చరిత్ర, ఆస్తి విలువ, ఇప్పటికే ఉన్న ఏవైనా రుణాలు/ఇఎంఐలు మొదలైనటువంటి నిర్ధిష్ట పారామితులు. ఇవి సాధారణంగా మీ క్రెడిట్ యోగ్యతను మరియు డిఫాల్ట్ లేకుండా హోమ్ లోన్‌ను చెల్లించే మీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రుణదాతను అనుమతిస్తాయి.
పిఎన్‌బి హౌసింగ్ వద్ద మీరు ఇప్పుడు సులభంగా ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ అర్హతను చెక్ చేసుకోవచ్చు. మా హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ సరళంగా, ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. ఈ కింది వివరాలను నమోదు చేయండి మరియు స్లైడర్లను సర్దుబాటు చేస్తూ మీరు ఎంత రుణ మొత్తానికి అర్హత కలిగి ఉన్నారో తెలుసుకోండి:
నికర నెలసరి ఆదాయం
అవసరమైన లోన్ వ్యవధి
వడ్డీ రేటు
ఏవైనా ప్రస్తుత ఇఎంఐలు
అధ్యయనం కోసం సిఫార్సు చేయబడినవి
హోమ్ లోన్ బ్లాగులు








.jpg/4343a0f3-b1f0-73f6-1bbe-1371a3c3b483?version=1.0&t=1740120801621)



అర్హత ప్రమాణాలకు సంబంధించిన
సాధారణ ప్రశ్నలు
వెబ్‌సైట్‌లో వివరాలను చెక్ చేయండి: పిఎన్‌బి హౌసింగ్ వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన హోమ్ లోన్ అర్హత ప్రమాణాలు అనేవి ప్రభుత్వ ఉద్యోగులు/జీతం పొందే వ్యక్తులు/స్వయం-ఉపాధిగల వారు ఒక హోమ్ లోన్ పొందడానికి కలిగి ఉండవలసిన కీలక అవసరాలను తెలియజేస్తుంది.
లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించండి: అర్హత కలిగిన లోన్ మొత్తాన్ని నిర్ణయించడానికి వెబ్‌సైట్‌లో పిఎన్‌బి హౌసింగ్ కాలిక్యులేటర్లో నిర్ధిష్ట సంఖ్యలను నమోదు చేయండి. ఈ సమర్థవంతమైన టూల్ స్లైడర్లను ఉపయోగించి మీరు మీ హోమ్ లోన్ కోట్‌ను వ్యక్తిగతీకరించుకోవచ్చు.
మా ప్రతినిధులను సంప్రదించండి: మా హోమ్ లోన్ ప్రతినిధులు ఎల్లప్పుడూ మీ అర్హత తనిఖీ మరియు ఇతర ప్రశ్నల విషయంలో మీకు సహాయం చేయడానికి కాల్, ఇమెయిల్ లేదా వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటారు.
హోమ్ లోన్ ద్వారా మీ కలల ఇంటికి నిధులు సమకూర్చుకోవడానికి, మీరు లేదా ఎవరైనా ఇతర దరఖాస్తుదారు తప్పనిసరిగా ప్రాథమిక హోమ్ లోన్ అర్హత ప్రమాణాలను నెరవేర్చాలి. అలాంటి ప్రమాణాలు క్రెడిట్ స్కోర్, ప్రస్తుత వయస్సు, ప్రస్తుత ఆదాయం, ఏవైనా ఆర్థిక బాధ్యతలు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
పిఎన్‌బి హౌసింగ్ వద్ద మేము, ఒక ఇంటిని కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తికి సేవలు అందించేలా, సులభమైన అర్హత ప్రమాణాలతో హోమ్ లోన్లను అందిస్తూ మా ప్రత్యేకతను చాటుకున్నాము. సంక్షిప్త రూపంలో మా ప్రాథమిక హోమ్ లోన్ అవసరాలు:
వయో పరిమితి |
హోమ్ లోన్ కోసం అప్లై చేసే సమయంలో దరఖాస్తుదారులు 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. హోమ్ లోన్ మెచ్యూరిటీ సమయంలో వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు. |
నెలవారీ జీతం/ఆదాయం |
₹15,000 మరియు ఆపై |
అవసరమైన సిబిల్ స్కోరు |
611+ |
జీతం పొందే వ్యక్తులకు వృత్తి అనుభవం |
3+ సంవత్సరాలు |
స్వయం ఉపాధి గల వారికి వ్యాపార కొనసాగింపు |
3+ సంవత్సరాలు |
జాతీయత |
భారతీయుడు (నివాసి) |
హోమ్ లోన్ పొందేందుకు వయస్సు అర్హత రుణదాత నుండి రుణదాతకు మారుతుంది.
పిఎన్‌బి హౌసింగ్ ఉత్తమమైన హోమ్ లోన్ వడ్డీ రేట్లు అందిస్తుంది, ఇది 21 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు మరింత సరమైనవిగా ఉంటాయి
అదనంగా, మీ హోమ్ లోన్ మెచ్యూరిటీ సమయంలో మీ వయస్సు 70 సంవత్సరాలు మించకూడదు
హోమ్ లోన్ కోసం వయస్సు ఒక ముఖ్యమైన ప్రమాణం, ఇది మీ లోన్ వ్యవధిని నిర్ణయిస్తుంది మరియు లోన్ అర్హత, ఇఎంఐపై కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల, ఒకరు తగినంత క్రెడిట్ యోగ్యతతో పాటు హోమ్ లోన్‌ను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు, అనగా యుక్త వయస్సులో హోమ్ లోన్ తీసుకోవడం మంచిది.
పెన్షన్ పొందేవారు లేదా రిటైర్ అయిన వారు ఒక హోమ్ లోన్‌ను పొందడం చాలా కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే ఆ వయస్సులో వారి ఇఎంఐ చెల్లించే సామర్థ్యం పై రుణదాతకు అంతగా విశ్వాసం ఉండకపోవచ్చు. అయితే, పిఎన్‌బి హౌసింగ్ లాంటి విశ్వసనీయ రుణదాతల నుండి పెన్షనర్లు ఖచ్చితంగా హోమ్ లోన్ పొందవచ్చు. మేము ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూస్తాము మరియు సాధారణంగా తమ రుణ దరఖాస్తులో స్థిరమైన, నిలకడైన ఆదాయం కలిగిన వారిని సహా-దరఖాస్తుదారుగా కలిగి ఉన్న పెన్షనర్లకు హోమ్ లోన్లను అందిస్తాము.
చాలా మంది కస్టమర్లు హోమ్ లోన్ కోసం సహ-దరఖాస్తుదారును కలిగి ఉండటం ముఖ్యమైన ప్రమాణం కాదని నమ్ముతారు. అయితే, పిఎన్‌బి హోసింగ్ వద్ద హోమ్ లోన్ దరఖాస్తుదారులు వారి హోమ్ లోన్ అప్లికేషన్‌లో సహ-దరఖాస్తుదారుని కలిగి ఉండటం తప్పనిసరి. అయితే, ఆర్థిక బాధ్యత భారాన్ని తగ్గించుకోవడానికి మరియు అనుకూలమైన హోమ్ లోన్ నిబంధనలను పొందడానికి సహ-దరఖాస్తుదారుని జోడించాలని మా నిపుణులు అత్యంత సిఫార్సు చేస్తున్నారు. ప్రధాన దరఖాస్తుదారు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు, తగినంత ఆదాయం లేదా క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండనప్పుడు లేదా ఒక పెన్షనర్ అయినప్పుడు సహ-దరఖాస్తుదారు చాలా కీలకంగా మారతారు, ఈ కారణంగా మీ మొత్తం హోమ్ లోన్ అర్హత పెరుగుతుంది. అంతేకాక, సమర్థవంతుడైన సహ-దరఖాస్తుదారు సహాయంతో సరసమైన వడ్డీ రేటు, ఎక్కువ వ్యవధితో పాటు అధిక రుణ మొత్తాన్ని పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే, ఒక మంచి విషయం ఏమిటో తెలుసా? మీరు వారి అనుకూలతను బట్టి మీ ఇఎంఐని కూడా విభజించుకోవచ్చు! ఒకవేళ మీరు సహ-దరఖాస్తుదారుతో కొనసాగాలనుకుంటే, మా హోమ్ లోన్ కొరకు అవసరమైన డాక్యుమెంట్లు జాబితాను మరియు హోమ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను చూడండి.
మీరు ఒకసారి ఒక హోమ్ లోన్ మాత్రమే తీసుకోగలరని అనేది అవాస్తవం. నిజానికి మీరు తీసుకోగల హోమ్ లోన్ల సంఖ్యకు ఎలాంటి పరిమితి లేదు, అర్హత ప్రమాణాలను నెరవేర్చినంత వరకు మీరు ఎన్ని లోన్లు అయినా పొందవచ్చు. అయితే, మొదటి హోమ్ లోన్ తర్వాత ప్రతి తదుపరి హోమ్ లోన్‌తో మీ ఎల్‌టివి శాతం తగ్గుతుంది. ప్రాపర్టీ ఇన్వెస్టర్లు సాధారణంగా ఇలా చేస్తారు. దీని కోసం ఒకరికి తగినంత రీపేమెంట్ సామర్థ్యం ఉండాలి, మునుపటి లోన్లను మూసివేయడంలో మంచి ట్రాక్ రికార్డును కలిగి ఉండాలి మరియు సకాలంలో ఇఎంఐలను చెల్లించాలి మరియు బహుళ హోమ్ లోన్లను పొందేందుకు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి.
మీరు తక్కువ రుణ మరియు క్రెడిట్ చరిత్రను కలిగి ఉంటే, అప్పుడు మీకు హోమ్ లోన్ కోసం అర్హత సాధించడం కష్టతరమవుతుంది. రుణదాతల పరంగా చూసుకుంటే, మీరు అధిక-రిస్క్ కేటగిరీలో వస్తారు. అయినప్పటికీ, మీరు ఒక హోమ్ లోన్ పొందవచ్చు:
మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి మీ బకాయిలను చెల్లించాలి
మీ రుణదాతతో అప్పును సెటిల్ చేసుకోవాలి మరియు ఎన్ఒసి పొందాలి
మంచి క్రెడిట్ చరిత్ర కలిగిన సహ-దరఖాస్తుదారుతో రుణం కోసం అప్లై చేయాలి
సిబిల్ స్కోర్ అనేది 3-అంకెల సంఖ్య, ఇది మీ క్రెడిట్ చరిత్రను సంగ్రహిస్తుంది మరియు మీ గత రుణాలు, ఇఎంఐల ఆధారంగా క్రెడిట్-విలువను అంచనా వేస్తుంది. సిబిల్ సంక్షిప్త రూపం క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్.
అలాగే, హోమ్ లోన్ కోసం అవసరమైన కనీస సిబిల్ స్కోర్ రుణదాత నుండి రుణదాతకు మారుతుంది. మంచి రుణం పొందడానికి సాధారణ కట్-ఆఫ్ స్కోర్ 611+. పిఎన్‌బి హౌసింగ్ వద్ద మేము విభిన్న సిబిల్ స్కోరు కలిగిన వ్యక్తుల కోసం అతి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాము, 800+ స్కోర్‌కు అతి తక్కువ వడ్డీ రేటు అందించబడుతుంది మరియు నెగటివ్ స్కోర్ ఉన్నవారికి అత్యధిక వడ్డీ రేటు విధించబడుతుంది. మీరు ఇక్కడ సిబిల్ స్కోర్ ఆధారంగా పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను చెక్ చేయవచ్చు.
ఆదాయ రుజువు అనేది దరఖాస్తుదారు లోన్ రీపేమెంట్ సామర్థ్యం మరియు హోమ్ లోన్ అర్హతను నిర్ధారించే ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. అయితే, పిఎన్‌బి హౌసింగ్ ప్రోగ్రెసివ్ ఉన్నతి హోమ్ లోన్లు అనేవి అధికారిక ఆదాయ రుజువు లేని మరియు బాధ్యతలను నెరవేర్చగలిగే ఆదాయం కలిగి ఉన్న వ్యక్తులకు హోమ్ లోన్లు అందిస్తాయి. ఉన్నతి హోమ్ లోన్లకు సంబంధించిన కొన్ని ఫీచర్లు ఇలా ఉన్నాయి:
35 లక్షల వరకు రుణ మొత్తం
ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 90% వరకు నిధులు
కనీస అధికారిక ఆదాయ డాక్యుమెంటేషన్
30 సంవత్సరాల వరకు అవధితో తక్కువ ఇఎంఐలు
మీ అవసరాలను నెరవేర్చుకోవడానికి అనుకూలీకరించబడిన అర్హత
లేదు, మీరు మీ ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తి చేయకుండా ఒక హోమ్ లోన్ పొందలేరు. గుర్తుంచుకోండి, పిఎన్‌బి హౌసింగ్‌తో సహా ఏ రుణదాత అయినా, రిజిస్టర్ చేయబడని ఆస్తి కోసం రుణాలను అందించరు. కావున, హోమ్ లోన్ కోసం అప్లై చేయాలని ప్లాన్ చేయడానికి ముందు దరఖాస్తుదారు తప్పనిసరిగా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సమర్పించాలి. అయితే, మీకు నిర్మాణంలో ఉన్న ఒక ఆస్తి ఉంటే, అప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా హోమ్ లోన్ పొందడం సాధ్యమవుతుంది.
వ్యక్తులు గత 30 నిమిషాల్లో అప్లై చేశారు.
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.