తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఇంటిని కలిగి ఉండడం అనేది అందరూ కోరుకునే నిశ్చింతమైన జీవితాన్ని సూచిస్తుంది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలతో, ప్రతి ఒక్కరూ ఇంటిని కొనుగోలు చేయలేరు. అందుకే వారు తమ కలలను నిజం చేసుకోవడానికి ఒక హోమ్ లోన్‌ను పొందుతారు. వివిధ దరఖాస్తుదారుల అవసరాలను తీర్చడానికి ఆర్థిక సంస్థలు వివిధ రకాల హోమ్ లోన్లను అందిస్తాయి.
ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి రుణం అవసరం కావచ్చు, మరొకరు దానిని పునరుద్ధరించడానికి రుణం అవసరం కావచ్చు. అందుకే, ఆర్థిక సంస్థలు వివిధ రకాల హోమ్ లోన్ల కోసం ఏర్పాట్లు కలిగి ఉంటాయి.
మీరు ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే, మీ కోసం ఏ హోమ్ లోన్ రకం ఉత్తమమైనదో తెలుసుకోవడానికి ఈ బ్లాగ్‌ను చదవండి:
భారతదేశంలో అందించబడే వివిధ రకాల హోమ్ లోన్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి
మీ అవసరాలు మరియు బడ్జెట్ ఆధారంగా మీరు వివిధ హౌసింగ్ ఫైనాన్స్ ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు, మీరు హోమ్ లోన్ అర్హత మరియు హోమ్ లోన్ డాక్యుమెంటేషన్ అవసరాల గురించి తెలుసుకోవాలి.
హోమ్ లోన్ కొనుగోలు
ఒక హోమ్ లోన్ ఒక విశాలమైన ఫ్లాట్, రో హౌస్ లేదా బంగ్లా సొంతం చేసుకోవాలనే మీ కలను నిజం చేయవచ్చు. కొత్త లేదా ప్రీ-ఓన్డ్ ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఈ రుణం ఆర్థిక సహాయం అందిస్తుంది. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జీతం పొందే వ్యక్తులకు సంవత్సరానికి 8.25%* మరియు స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారులకు సంవత్సరానికి 8.10%* నుండి ప్రారంభమయ్యే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది.
తప్పక చదవండి: హోమ్ లోన్ అంటే ఏంటి?? హౌసింగ్ లోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు
హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్లు
పేరు సూచిస్తున్నట్లుగా, ఒక హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ అనేది ఒక నిర్మాణం పూర్తి అయినది కొనుగోలు చేయడానికి బదులుగా తమ ఇంటిని నిర్మించాలనుకునే వ్యక్తుల కోసం ఇవ్వబడుతుంది. దరఖాస్తుదారుల బడ్జెట్లు మరియు నిర్మాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్లను పిఎన్‌బి హౌసింగ్ అందిస్తుంది. ఈ రుణంతో, మీరు మీ ఇంటిని పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో నిర్మించుకోవచ్చు మరియు 30 సంవత్సరాల సౌకర్యవంతమైన అవధిలో తిరిగి చెల్లించవచ్చు.
హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్లు
హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ వివిధ రకాల హోమ్ లోన్లలో ప్రముఖమైనది, ఎందుకంటే ఇది ఒక ఇంటిని పునరుద్ధరించడానికి, మరమ్మత్తు చేయడానికి లేదా రీఫర్బిష్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. దీనిలో సాధారణంగా పూర్తి పునరుద్ధరణ, అప్‌గ్రేడేషన్, ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ పెయింట్ లేదా మరమ్మత్తులు, టైలింగ్, ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, వుడ్‌వర్క్ మొదలైన వాటి కోసం కవరేజ్ ఉంటుంది.
హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్
మీ కుటుంబం పెరిగే కొద్దీ, మీరు మీ ప్రేమ, సమయం మరియు మీ బడ్జెట్‌ను కూడా విస్తరిస్తారు. మరి మీ ఇంటి సంగతి? మీ పిల్లలు, వారి స్టడీ రూమ్ లేదా మీ లైబ్రరీ కోసం మీ ప్రస్తుత ఇంటిలో మీకు మరింత స్థలం అవసరం కావచ్చు. అటువంటి సందర్భంలో మీ ఇంటిని విస్తరించడానికి మీరు ఒక హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్‌ను తీసుకోవచ్చు.
ప్లాట్ లోన్
ప్లాట్ లోన్లు ఒక రెసిడెన్షియల్ ప్లాట్‌ను ఫైనాన్స్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. పిఎన్‌బి హౌసింగ్ ప్లాట్ ధరలో దాదాపుగా 70-75% ని ఫైనాన్స్ చేస్తుంది. అయితే, ప్లాట్ లోన్ల పై వడ్డీ రేట్లు కొనుగోలు కోసం ఇవ్వబడే హౌస్ లోన్ల కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.
తప్పక చదవండి: హోమ్ లోన్ ఆమోదం పొందడానికి ఎంత సమయం పడుతుంది?
ఎన్‌ఆర్‌ఐ హోమ్ లోన్
నాన్-రెసిడెన్షియల్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐలు) మరియు భారతీయ మూలానికి చెందిన వ్యక్తులు (పిఐఒలు) ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా పాతదాన్ని మరమ్మత్తు చేయడానికి హోమ్ లోన్ కోసం కూడా ఎంచుకోవచ్చు. దరఖాస్తుదారునికి వారి భారతీయ మూలానికి చట్టపరమైన రుజువు లేదా ఎన్ఆర్ఐ అనే స్టేటస్ ఉండాలి. అలాగే, వారికి విదేశంలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
ముగింపు
ఒక హోమ్ లోన్ అనేది మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతించే ఒక రుణం. మీ అన్ని హౌసింగ్ అవసరాలను తీర్చుకోవడానికి పిఎన్‌బి హౌసింగ్ వివిధ రకాల హోమ్ లోన్లను అందిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ నెట్‌వర్క్, ఇంటి వద్ద సేవలు, త్వరిత ఆమోదం మరియు పంపిణీ, ప్రత్యేకమైన బృందాలు, పారదర్శకత మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లుతో, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మీ కలల ఇంటిని పొందడాన్ని సులభతరం మరియు వేగవంతం చేస్తుంది.