PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

హోమ్ లోన్ అంటే ఏంటి?? హౌసింగ్ లోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు

give your alt text here

మనం అందరం సాధ్యమైనంత ఉత్తమ ఇంటిని కొనుగోలు చేయాలని కలలు గంటాము. కానీ, ఆస్తి ధరలు క్రమంగా పెరుగుతుండటంతో, మీ కలను వాస్తవంగా మార్చుకోవడం అనేది అంత సులభం కాకపోవచ్చు. ఇక్కడ, సాధారణంగా హోమ్ లోన్స్ అనేవి ప్రాధాన్యతలోకి వస్తాయి.

ఒక హోమ్ లోన్ తీసుకోవడం అనేది మీ జీవితంలో పెద్ద దశ కావచ్చు. సరైన ఆర్థిక ప్రణాళికను మొదలుకొని ఆమోదం పొందే సుదీర్ఘమైన ప్రక్రియ వరకు, మొదటిసారి ఆలోచించే వారికి హోమ్ లోన్ ఒక కఠినమైన ప్రక్రియగా అనిపించవచ్చు. కానీ, వాస్తవానికి అది అలా ఉండకపోవచ్చు!

భారతదేశంలో ప్రాథమిక హోమ్ లోన్ వివరాలను తెలుసుకుందాం.

హౌసింగ్ లోన్ అంటే ఏమిటి?

పేరు సూచించినట్లుగా, హోమ్ లోన్ అనేది నివాస లేదా వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేయడానికి ఒక బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి ఒక వ్యక్తి అప్పుగా తీసుకునే మొత్తాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత, ఒక వ్యక్తి, రుణదాతకు రుణాన్ని సులువైన నెలవారీ వాయిదాల్లో (ఇఎంఐ) ఒక నిర్దిష్ట హోమ్ లోన్ వడ్డీ రేటుతో తిరిగి చెల్లించాలి.

భారతదేశంలో హోమ్ లోన్ల రకాలు

మీ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల హోమ్ లోన్లు మీకు అందుబాటులో ఉన్నాయి.

కొన్ని ప్రముఖ ఎంపికలు ఇలా ఉన్నాయి:

  1. ఇంటి కొనుగోలు లోన్ – ఇది మీ బడ్జెట్‌కు సరిపోయే మీ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  2. కన్‌స్ట్రక్షన్ హోమ్ లోన్ మీరు మీ స్వంత ఇంటిని నిర్మించాలనుకుంటే, ఇది మీకు సరైనది!
  3. ల్యాండ్ కొనుగోలు లోన్ – పేరు సూచిస్తున్నట్లుగా, ఇది మీ భూమిని కొనుగోలును అనుమతిస్తుంది.
  4. హోమ్ ఇంప్రూవ్‌‌మెంట్ లోన్ – ఏవైనా పునర్నిర్మాణాలు లేదా పునరుద్ధరణలు ఈ విభాగంలోకి వస్తాయి.
  5. హోమ్ రిపేర్ లోన్ – ఇది ప్రధానంగా ఇంటి చుట్టూ ప్రధానంగా అవసరమైన మరమ్మత్తుల కోసం.
  6. హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ – మీరు మీ ఇంటిని మరింత ప్రముఖంగా మరియు విశాలంగా విస్తరించుకోవాలని నిర్ణయించుకుంటే, ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది!

తప్పక చదవండి: ఒక హోమ్ లోన్ రుణదాతను ఎలా ఎంచుకోవాలి

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్