PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం నెలవారీ వడ్డీని ఎలా లెక్కించాలి?

కాల్ చేయాల్సిందిగా అభ్యర్థించండి
give your alt text here

ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి చాలామంది తమ డబ్బును ఆదా చేసుకోవడానికి మరియు హామీ ఇవ్వబడిన రాబడులను పొందడానికి ఇష్టపడే పెట్టుబడి సాధనాలు. భవిష్యత్తు లక్ష్యాల కోసం మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం నిధులను ఆదా చేయడానికి ఇది ఒక సురక్షితమైన ఎంపిక. అనేక ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక లక్ష్యాలు మరియు ప్రాధాన్యతలకు సరిపోయే విధంగా వివిధ రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రోడక్టులను అందిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అనేవి ఆర్థిక సంస్థ, ఎంచుకున్న ఎఫ్‌డి రకం, అవధి మరియు వయస్సు ఆధారంగా మారతాయి.

1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం నెలవారీ వడ్డీని అంచనా వేయడానికి ముందు, వివిధ రకాల ఎఫ్‌డిలను అర్థం చేసుకోవడం ముఖ్యం.

వివిధ రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు

క్యుములేటివ్ మరియు నాన్-క్యుములేటివ్ వంటి వడ్డీ చెల్లింపు విధానాల ఆధారంగా ఆర్థిక సంస్థలు రెండు రకాల ఎఫ్‌డిలను అందిస్తాయి.

  • నాన్ - కుములేటివ్: నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై వడ్డీ అనేది డిపాజిటర్ ఎంచుకున్న ఫ్రీక్వెన్సీ ప్రకారమే చెల్లించబడుతుంది. ఇది నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక మరియు వార్షికంగా కావచ్చు, అలాగే, మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తం అలాగే ఉంటుంది.
  • కుములేటివ్: ఈ రకం ఎఫ్‌డిలపై పొందిన వడ్డీ అసలు మొత్తానికి జోడించబడుతూ ఉంటుంది. పెట్టుబడిదారు మెచ్యూరిటీ సమయంలో చెల్లించే సంచిత మొత్తం పై చక్రవడ్డీతో ప్రయోజనం పొందవచ్చు.

ఏ ఎఫ్‌డి మెరుగైనది?

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ప్రతి సంస్థకి భిన్నంగా ఉంటాయి, కావున పెట్టుబడిపై అందే రాబడి వేరుగా ఉంటుంది. ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీపై ఆధారపడి ఉండేవారు నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి ప్రయోజనం పొందగలరు. మరోవైపు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఆదా చేసినవారు క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు, సమ్మేళన వడ్డీ నుండి ప్రయోజనం పొందవచ్చు.

తప్పక చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు అంటే ఏమిటి?

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

పిఎన్‌బి హౌసింగ్ అందించే వడ్డీ రేట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి, దీనిని ఉపయోగించి మీరు నెలకు లేదా సంవత్సరానికి 1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ పై వడ్డీని లెక్కించవచ్చు:

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (₹5 కోట్ల వరకు)
అవధి క్యుములేటివ్ ఆప్షన్* ఆర్‌ఒఐ (సంవత్సరానికి) నాన్-క్యుములేటివ్ ఆప్షన్ ఆర్‌ఒఐ (సంవత్సరానికి)
నెల ఆర్‌ఒఐ (సంవత్సరానికి) మెచ్యూరిటీ పై ఆదాయం నెలవారీ త్రైమాసిక అర్ధ వార్షిక వార్షిక
12 – 23 7.35% 7.35% 7.11% 7.15% 7.22% 7.35%
24 – 35 7.00% 7.25% 6.79% 6.83% 6.89% 7.00%
36 – 47 7.70% 8.31% 7.44% 7.49% 7.56% 7.70%
48 – 59 7.40% 8.26% 7.16% 7.20% 7.26% 7.40%
60 -71 7.50% 8.71% 7.25% 7.29% 7.36% 7.50%
72 – 84 7.40% 8.91% 7.16% 7.20% 7.27% 7.40%
120 7.40% 10.42% 7.16% 7.20% 7.27% 7.40%

గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు:

  • ఎఫ్‌డి అకాల ఉపసంహరణ కారణంగా ముందుగా అంగీకరించిన వడ్డీ రేట్లు మార్చవచ్చు.
  • 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లు, 1 కోటి ఫిక్స్‌డ్ డిపాజిట్ పరిమితి వరకు సాధారణ ఎఫ్‌డి వడ్డీ రేటు కంటే 0.25% ఎక్కువ ప్రాధాన్యత రేటును పొందుతారు.

తప్పక చదవండి: మీ వెకేషన్‌ను ప్లాన్ చేసుకోవడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎందుకు మంచి ఎంపిక

1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం నెలవారీ వడ్డీ ఎంత?

నేటి డిజిటల్ యుగంలో, ప్రతి ఆర్థిక సంస్థ నాన్-క్యుములేటివ్ మరియు క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను లెక్కించడంలో సహాయపడటానికి ఆన్‌లైన్‌లో ఒక క్యాలిక్యులేటర్‌ను అందిస్తుంది. క్యుములేటివ్ డిపాజిట్ కోసం, ఉపయోగించబడే ఫార్ములా:

a = p (1+r/n) ^ (n * t), ఇక్కడ:

  • a = మెచ్యూరిటీ మొత్తం
  • p = అసలు మొత్తం
  • r = ఎఫ్‌డి వడ్డీ రేటు
  • n = కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ
  • t = సంవత్సరం అవధి

నెలకు 1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం వడ్డీ అనేది ఆర్థిక సంస్థ అందించే ఫ్రీక్వెన్సీ మరియు అంచనా వేసిన వడ్డీ ద్వారా నిర్ణయించబడుతుంది. 1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం నెలవారీ వడ్డీని లెక్కించేందుకు వినియోగించే ప్రాథమిక వివరాలు ఎఫ్‌డి వడ్డీ రేటు, అవధి మరియు అమౌంట్, ఈ సందర్భంలో ఇది 1 లక్ష.

వివిధ చెల్లింపు ఫ్రీక్వెన్సీల ప్రకారం 12 నెలల అవధి కోసం రూ. 1 లక్షల ఎఫ్‌డి కొరకు మీ వడ్డీ చెల్లింపులు ఎలా ఉంటాయో ఇక్కడ ఇవ్వబడింది.

చెల్లింపు ఫ్రీక్వెన్సీ వడ్డీ రేటు వార్షిక మొత్తం వడ్డీ చెల్లింపు ఎం, క్యు, హెచ్ & వై వడ్డీ చెల్లింపు పూర్తి చెల్లింపు
నెలవారీ 7.11% 6,581 548 1,06,581*
త్రైమాసిక 7.15% 6,620 551 1,06,620*
అర్ధ వార్షిక 7.22% 6,854 571 1,06,854*
వార్షిక 7.35% 6,980 581 1,06,980*

కాబట్టి, మీరు 1 లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం నెలవారీ వడ్డీని తెలుసుకోవాలని అనుకుంటే, మీరు నెలవారీ వడ్డీ చెల్లింపును 7.11% వద్ద భాగించవచ్చు మరియు ఇది సంవత్సరానికి 6,581 ఉంటుంది మరియు దానిని 12 నెలల సంఖ్యతో భాగించవచ్చు. ₹1,00,000 ఎఫ్‌డి కోసం నెలవారీ వడ్డీ ₹548.

ముగింపు

తమ డబ్బు సురక్షితంగా ఉండాలనుకునే వారి కోసం మరియు రిస్కు తీసుకోవడం ఇష్టం లేని వారి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు గొప్ప పెట్టుబడి సాధనంగా ఉపయోగపడతాయి. చెల్లింపు సౌలభ్యం మరియు సులభమైన లభ్యతతో ఇది దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ప్రాధాన్యత గల ఎంపికగా కొనసాగుతుంది. పెట్టుబడి పెట్టడానికి ముందు మీకు అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను గురించి తెలుసుకోవడం, వాటిని సరిపోల్చడం ఉత్తమం.

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్