PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

ఎన్ఆర్ఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరవడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

give your alt text here

ప్రపంచ దృష్టాంతంలో ఆర్థిక పెట్టుబడులపై అధిక రాబడులను అందించే కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ అటువంటి ఒక సాధనం. నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) రోజురోజుకీ పెరుగుతూ ఉండటంతో, చాలామంది భారతదేశంలో తమ కార్పస్‌ను తిరిగి పెట్టుబడి పెట్టడానికి లాభదాయకంగా భావిస్తారు. తక్కువ రిస్క్ రాబడులు మరియు మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా రక్షణగా ఉండే ఇతర భారతీయ ఆర్థిక సాధనాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులకు సాధారణంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

బ్యాంకులు, కార్పొరేట్లు మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్‌సి) వంటి అనేక ఫైనాన్షియల్ సంస్థలు నాన్-రెసిడెంట్ ఇండియన్స్‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తాయి. కార్పొరేట్లు మరియు హెచ్ఎఫ్‌సిలు అందించే వడ్డీ రేటు సాధారణంగా బ్యాంకులు అందించే వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడి యొక్క అవసరాలకు వద్దాం. అటువంటి ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు, ఎన్ఆర్ఐ దరఖాస్తుదారులు ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

  • దరఖాస్తుదారులు తమ నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (NRO) అకౌంట్ ద్వారా భారతీయ కార్పొరేట్లు మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మాత్రమే పెట్టుబడి పెట్టగలరని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా, మెచ్యూరిటీ సమయంలో సంపాదించిన కార్పస్ వారి ఎన్ఆర్ఒ అకౌంట్లలోకి మాత్రమే జమ చేయబడుతుంది. ఇవి అన్ని ట్రాన్సాక్షన్లు భారతీయ కరెన్సీలో మాత్రమే జరిగే అకౌంట్లు.
  • పిఎన్‌బి హౌసింగ్ ఎఫ్‌డి లో పెట్టుబడి పెట్టడానికి, ఎన్ఆర్ఐ దరఖాస్తుదారులు ఈ క్రింది డాక్యుమెంట్లను అందించాలి.
    • ఫొటోగ్రాఫ్
    • గుర్తింపు రుజువు
    • పాన్ కాపీ
    • చిరునామా రుజువు
    • పాస్‌పోర్ట్ కాపీ
    • ఎఫ్‌ఎటిసిఎ ఫారం
  • ఎన్ఆర్ఐలు పిఎన్‌బి హౌసింగ్ వద్ద అతి తక్కువగా ₹10,000 కార్పస్‌తో ఎఫ్‌డి తెరవవచ్చు. 1 నుండి 3 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • కొన్ని దేశాల విషయంలో 30% నుండి అతి తక్కువగా 5% వరకు పన్ను రేటును తగ్గించడం ద్వారా ఎన్ఆర్ఐ ఎఫ్‌డిలను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఎన్ఆర్ఐ దరఖాస్తుదారులు డిటిఎఎ కింద వస్తున్న ఒక ప్రకటనను దాఖలు చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

కార్పొరేట్లు మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందించే మరొక ప్రయోజనం ఏంటంటే తమ కస్టమర్లకు వారు అందించే అనేక సేవలు. ముఖ్యంగా పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కస్టమర్ పోర్టల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు, ఇక్కడ మీరు లైవ్ చాట్ ద్వారా కంపెనీ అధికారులతో మాట్లాడవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఆటో రెన్యూవల్ మరియు అకౌంట్స్‌ స్టేట్‌మెంట్‌లను (ఎస్ఒఎ) కూడా కోరవచ్చు.

మీరు భారతీయ పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న ఎన్ఆర్ఐ అయితే మరియు అతి తక్కువ రిస్క్‌తో హామీ ఇవ్వబడిన రాబడుల కోసం చూస్తున్నట్లయితే, కార్పొరేట్లు మరియు హెచ్ఎఫ్‌సిల ద్వారా అందించబడే ఎఫ్‌డిలు వాస్తవానికి మంచి ఎంపికగా ఉండవచ్చు !!

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్