ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు అనేది ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరిచినప్పుడు ఆర్థిక సంస్థ, డిపాజిటర్‌కు అందించే ఒక డాక్యుమెంట్. మీరు ఒక దుకాణం నుండి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు మీరు అందుకునే ఒక ఇన్వాయిస్ లాంటిది. ఒక బిల్లు మాదిరిగా, ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి అన్ని వివరాలు పేర్కొనబడి ఉంటాయి.
ఎఫ్‌డిఆర్‌లో పేర్కొనబడిన అంశాలు
ఎఫ్‌డి రసీదు లేదా ఎఫ్‌డిఆర్ అనేది జమ చేసిన డబ్బు మొత్తాన్ని పేర్కొనే ఒక డాక్యుమెంట్, ఇది ఎఫ్‌డి ఫిక్స్ చేయబడిన నిర్ణీత సమయం మరియు ఆ మొత్తానికి వర్తించే ప్రస్తుత వడ్డీ రేటు వివరాలను కలిగి ఉంటుంది.
ఎఫ్‌డి స్కీమ్‌కు సంబంధించిన ప్రతి నిర్దిష్ట వివరాలు, ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదులో పేర్కొనబడి ఉంటాయి. ఎఫ్‌డిఆర్ ఫార్మాట్‌లో ఇవి ఉంటాయి:
- ఆర్థిక సంస్థ యొక్క ప్రకటన
- డిపాజిటర్ పేరు మరియు వయస్సు
- ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు లింక్ చేయబడిన అకౌంట్ నంబర్
- అసలు మొత్తం లేదా డిపాజిట్ చేయబడిన పూర్తి మొత్తం
- డిపాజిట్ వ్యవధి లేదా కాలం
- ఫిక్స్‌డ్ డిపాజిట్ పై వర్తించే వడ్డీ రేటు
- బుకింగ్ తేదీ
- మెచ్యూరిటీ తేదీ
- టిడిఎస్‌కు లోబడి మెచ్యూరిటీ పై డిపాజిటర్ అందుకునే వడ్డీ
- నామినీ
- జరిమానా రేట్లు, ఎఫ్‌డి పై లోన్ గురించి సూచనలు మొదలైనటువంటివి డిపాజిట్‌కు సంబంధించిన సూచనలు.
ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు అనేది యాజమాన్యాన్ని నిరూపించే ఒక రుజువు, అలాగే, డిపాజిటర్లు భద్రపరచుకోవలసిన ఒక ముఖ్యమైన డాక్యుమెంట్.
తప్పక చదవండి: భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రకాలు
ఎఫ్‌డిఆర్ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి?
ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్, అనేక సందర్భాల్లో ఒక ఆర్థిక సంస్థ దీనిని అడగవచ్చు:
ఎఫ్‌డి రెన్యూవల్ సమయంలో
ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆఫ్‌లైన్‌లో తెరవబడితే, డిపాజిటర్ దానిని రెన్యూ చేయడానికి ప్రస్తుత ఎఫ్‌డిఆర్‌ను సరెండర్ చేయాల్సి రావచ్చు. అప్‌డేట్ చేయబడిన అవధితో కొత్త ఎఫ్‌డి రసీదు జారీ చేయబడుతుంది.
ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్స్ కోసం
డిపాజిటర్ ఎఫ్‌డిని మధ్యంతరంగా నిలిపివేయాలనుకుంటే మరియు మెచ్యూరిటీ తేదీకి ముందు ఫండ్స్ విత్‍డ్రా చేయాలనుకుంటే, వారు యాజమాన్యం రుజువుగా ఎఫ్‌డి రసీదును సమర్పించాలి.
ఎఫ్‌డి పై రుణం పొందడానికి
నగదు కొరత లాంటి కారణాల వల్ల డిపాజిటర్‌కు లోన్ అవసరమైతే, వారు వారి ప్రస్తుత ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఒకదాని కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ ఒక అన్‍సెక్యూర్డ్ లోన్ కన్నా తక్కువ వడ్డీ రేటుకు ఇవ్వబడుతుంది. ఈ లోన్‌ను పొందేందుకు, దరఖాస్తుదారులు లోన్ అవధి పూర్తయ్యే వరకు ఎఫ్‌డిఆర్‌ను ఆర్థిక సంస్థకు అందించాలి. డిపాజిటర్ రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత, వారు నవీకరించబడిన వివరాలతో ఎఫ్‌డిఆర్‌ని తిరిగి పొందుతారు.
తప్పక చదవండి: మీ వెకేషన్‌ను ప్లాన్ చేసుకోవడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎందుకు మంచి ఎంపిక
ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు చెక్‌లిస్ట్
ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదులను నిశితంగా పరిశీలించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అవి ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలను కలిగి ఉంటాయి. ఒక ఆర్థిక సంస్థ నుండి ఎఫ్‌డిఆర్‌ను అంగీకరించేటప్పుడు చూడవలసిన కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి:
- వర్తించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మరియు నిబంధనలు: ఇది ఎఫ్‌డి యొక్క అత్యంత ప్రాథమిక అంశం, దీనిని రెండుసార్లు చెక్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ వ్యవధి మరియు వర్తించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు గమనించాలి, ముఖ్యంగా ఇప్పటికే ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ రెన్యూ చేయబడినప్పుడు వాటిని తెలుసుకోవాలి. ఎందుకంటే వడ్డీ రేటు మార్పుకు లోబడి ఉంటుంది మరియు రెన్యూవల్ సమయంలో అది మారుతుంది.
- ఆటో-రెన్యూవల్ తేదీలు మరియు మెచ్యూరిటీ: ఎఫ్‌డిఆర్‌ను అంగీకరించడానికి ముందు మెచ్యూరిటీ తేదీని చెక్ చేయడం ముఖ్యం. లేకపోతే స్పష్టత లోపించవచ్చు మరియు మెచ్యూరిటీ తేదీకి ముందే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు, ఇది ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ కారణంగా వడ్డీ నష్టం లాంటి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. డిపాజిటర్ ఆటో-రెన్యూవల్ సౌకర్యాన్ని ఎంచుకున్నట్లయితే రెన్యూవల్ తేదీ గురించి స్పష్టతను కలిగి ఉండాలి.
- ఛార్జీలు మరియు జరిమానాలు: ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించిన ఏవైనా ఛార్జీలు లేదా జరిమానాలను ఎఫ్‌డి రసీదుపై పేర్కొనవలసి ఉంటుంది.
- నామినేషన్ వివరాలు: ఎవరైనా డిపాజిటర్‌కు ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే ఆ ఎఫ్‌డి మొత్తాన్ని నామినీ స్వీకరిస్తారు. భవిష్యత్తులో సమస్యలను నివారించడానికి ఈ నిర్దిష్ట వివరాలను తప్పనిసరిగా క్రాస్-చెక్ చేయాలి.
గతంలో, ఈ ఎఫ్‌డి రసీదులు యాజమాన్యానికి ఏకైక రుజువుగా ఉండేవి, మొత్తం ప్రక్రియ ముగిసే వరకు దానిని సురక్షితంగా ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎఫ్‌డిలను తెరిచే ప్రక్రియలోని డిపాజిటర్లు ఆన్‌లైన్ ఎఫ్‌డిఆర్ అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇది సులభంగా పొందవచ్చు. పాత బ్యాంకింగ్ విధానాలను అనుసరించే వారు, అవసరమైనప్పుడు అందజేసేందుకు తప్పనిసరిగా ఈ రసీదును భద్రపరచుకోవాలి.