సరైన పనితీరు కోసం మీరు మీ పోర్ట్‌ఫోలియోలో విభిన్నమైన పెట్టుబడుల సమితిని ఉంచాలి. మీరు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు మరియు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టినప్పటికీ, కంపెనీ డిపాజిట్లు అనేవి మీరు పట్టించుకోని ఒక పెట్టుబడి ఎంపిక. ఇక్కడ మీరు కంపెనీ డిపాజిట్లను కూడా ఎందుకు పరిగణించాలి అనేది ఇవ్వబడింది:
డైవర్సిఫికేషన్: ఒక పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో స్థిరమైన మరియు సురక్షితమైన రాబడులు పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను కొంత మేరకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు అంచనా వేయదగిన రాబడిని కలిగి ఉన్నప్పుడు, తదనుగుణంగా మీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మీకు నిర్దిష్ట వ్యవధిలో స్థిరమైన రాబడులను అందిస్తాయి.
అధిక రాబడి రేటు: కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేటును అందించవచ్చు.
పన్ను ప్రయోజనాలు: ఒక కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి మీ వార్షిక వడ్డీ ఆదాయం రూ. 5,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు, మీరు మీ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి రాబడులపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు.
నామినేషన్ సౌకర్యం: మీరు ఒక కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు, మీ మరణం సందర్భంలో డిపాజిట్ ఆదాయాన్ని అందుకోవడానికి మీరు మీ కుటుంబం నుండి ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. ఇది పేపర్‌వర్క్‌ను తగ్గిస్తుంది అలాగే, పెట్టుబడిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఫ్లెక్సిబిలిటీ: లిక్విడిటీ పరంగా చూసుకుంటే, కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు సరైన పెట్టుబడులు. ఆర్థిక అత్యవసర పరిస్థితిలో మీరు కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి ప్రీమెచ్యూర్ విధానంలో డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అయితే, 3 నెలల కనీస లాక్-ఇన్ వ్యవధి వర్తిస్తుంది. ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ విషయంలో ఈ కింది నియమాలు వర్తిస్తాయి:
పెట్టుబడిదారుల వర్గం | డిపాజిట్ మెచూరిటీ కన్నా ముందుగానే తీసివేయుట | చెల్లించవలసిన వడ్డీ | డిపాజిట్ మెచూరిటీ కన్నా ముందుగానే తీసివేయుట | చెల్లించవలసిన వడ్డీ |
---|---|---|---|---|
వ్యక్తిగత పెట్టుబడిదారు | మూడు నెలల తరువాత కాని ఆరు నెలల ముందు | 4 శాతం | 6 నెలల తర్వాత, కానీ మెచ్యూరిటీ తేదీకి ముందుగానే | పబ్లిక్ డిపాజిట్‌పై వర్తించే వడ్డీ కంటే వ్యవధి డిపాజిట్ కోసం వడ్డీ 1 శాతం తక్కువగా ఉంటుంది. |
ఇతర పెట్టుబడిదారులు | మూడు నెలల తరువాత కాని ఆరు నెలల ముందు | ఏది కాదు | 6 నెలల తర్వాత, కానీ మెచ్యూరిటీ తేదీకి ముందుగానే | పబ్లిక్ డిపాజిట్‌పై వర్తించే వడ్డీ కంటే వ్యవధి డిపాజిట్ కోసం వడ్డీ 1 శాతం తక్కువగా ఉంటుంది. |
ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై లోన్: మీకు డబ్బు అవసరమైతే, మీరు మీ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై రుణాన్ని తీసుకోవచ్చు. ఇది వ్యాపారం లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ డిపాజిట్లను తాకట్టుగా ఉపయోగించాలనుకునే పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది. డిపాజిట్‌లో 75 శాతం వరకు రుణాలు తీసుకోవచ్చు.
కంపెనీ డిపాజిట్లు అనేవి పెట్టుబడిదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన తప్పనిసరి ఎంపిక ; ఇవి సాధారణ బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులను అందించవచ్చు. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తుంది, అలాగే, ఆర్థిక సేవా రంగాల్లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉంది. కంపెనీ భారతదేశ వ్యాప్తంగా విస్తృతమైన శాఖలతో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ముడిపడి ఉన్నాయి మరియు ఇది మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందినది. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు క్రిసిల్ ద్వారా ఎఫ్ఎఎఎ రేటింగ్ ఇవ్వబడింది, ఇది రేటింగ్ ఏజెన్సీ అందించే అత్యధిక భద్రతా రేటింగ్.