PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

సరైన హోమ్ లోన్ రుణదాతను ఎలా ఎంచుకోవాలి

give your alt text here

మీ కలల ఇంటిని కొనుగోలు చేయడం అంత సులభమేమి కాదు. దీని కోసం మీరు హోమ్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం, కొనుగోలు చేసిన తర్వాత చాలా కాలం పాటు ఇది మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. అయితే, ముందుగా మీరు సరైన రుణదాతను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనిని మీరు ఎలా మొదలుపెడతారు?

ఒక హోమ్ లోన్ కోసం మీరు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒక హోమ్ లోన్‌ కోసం వడ్డీ రేటు మాత్రమే కాకుండా అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక హోసింగ్ లోన్ సంస్థను ఎంచుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ఫీచర్లు మరియు విషయాలను తెలుసుకుందాం.

ప్రసిద్ధి చెందిన మరియు అనుభవం ఉన్న రుణదాతను ఎంచుకోండి

వినియోగదారుల నమ్మకం మరియు ఆత్మవిశ్వాసాన్ని నెరవేర్చే ఒక ప్రసిద్ధి చెందిన మరియు అనుకూలమైన పరిష్కారాలను అందించే సంవత్సరాల అనుభవంతో కూడిన ఒక సంస్థను ఎంచుకోండి. పిఎన్‌బి హౌసింగ్ సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉంది.

దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాకు సహాయసహకారాలను అందిస్తుంది. అగ్రశ్రేణి ఎంఎన్‌సి సంస్థ నుండి మీరు ఆశించే అధిక-నాణ్యత గల సేవలతో పాటు, పిఎస్‌యు సంస్థ నుండి మీరు పొందగల నమ్మకాన్ని, విశ్వసనీయతను మీకు అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఒక హోమ్ ఫైనాన్స్‌ నిపుణుడిగా ఇది కస్టమర్ అవసరాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, వాటికి అనుగుణంగా కస్టమైజ్ చేసిన పరిష్కారాలను మీకు అందిస్తుంది.

సుదీర్ఘకాలం పాటు మీకు అండగా ఉండే ఆర్థికంగా పటిష్టమైన ఒక రుణదాతను ఎంచుకోండి

హోమ్ లోన్ దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది కావున, కేవలం ప్రారంభ ఆఫర్లను చూసి మాత్రమే నిర్ణయం తీసుకోకూడదు. ఫ్లోటింగ్ రేట్ అనేది లోన్ అవధి సమయంలో అనేకసార్లు మారే అవకాశం ఉంటుంది, కావున, ప్రారంభంలో తక్కువ రేట్లు అందించే సంస్థలు దీర్ఘకాలంలో ఆర్థికంగా అనుకూలంగా ఉండవు అనేది వాస్తవం. అంతిమంగా ఒక రుణదాతను ఎంచుకోవడానికి ముందు మీరు గత కొన్ని సంవత్సరాల్లో వడ్డీ రేట్లలో మార్పులను చూడాలి.

పిఎన్‌బి హౌసింగ్ వద్ద మేము మా ప్రస్తుత కస్టమర్లకు కనీస ధరల పెంపును అందజేస్తాము, ఇది మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతదేశ వ్యాప్తంగా బ్రాంచ్‌లను కలిగిన రుణదాతను ఎంచుకోండి

మీరు ఈ రోజు ఢిల్లీలో ఉండవచ్చు, రేపు చెన్నైలో ఉండవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా మీకు అదే స్థాయి సేవలను అందించేందుకు మీ రుణ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ పరిధిని కలిగి ఉండాలి.

పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో దాని ఉనికిని కలిగి ఉంది. ఒకవేళ లోన్ వ్యవధిలో కస్టమర్లు ఇతర ప్రాంతానికి మారినట్లయితే, అతను/ఆమె పంపిణీ తరువాతి సేవలకు సంబంధించి ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేరు.

తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం డౌన్ పేమెంట్ అంటే ఏమిటి?

మీకు అనుకూలమైన, సమగ్రమైన ఫీచర్లను అందించే రుణదాతను ఎంచుకోండి

మీ రుణ ప్రయాణం సజావుగా సాగడానికి మీ రుణ సంస్థ, తక్షణ ఆన్‌లైన్ రుణ ఆమోదాలు, ఇంటి సౌకర్యం వద్ద సేవలు, సమర్థవంతమైన రిలేషన్‌షిప్ మేనేజర్లు మరియు విక్రయం తర్వాత ఉత్తమ సేవలు లాంటి ఫీచర్లు మరియు సౌకర్యాలను అందిస్తుందని నిర్ధారించుకోండి.

పిఎన్‌బి హౌసింగ్ కేవలం పైన పేర్కొన్న అన్ని సేవలను మాత్రమే కాకుండా, దురదృష్టవశాత్తు ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వినియోగదారులను రక్షించేందుకు దాని ఆప్షనల్ ఇన్సూరెన్స్ సౌకర్యం లాంటి విలువవైన జోడింపులను కూడా అందిస్తుంది.

మీకు సౌకర్యం మరియు బహుళ ప్రయోజనాలను అందించే ఒక రుణదాతను ఎంచుకోండి

మీ రుణ సంస్థ నుండి అధిక స్థాయి సౌలభ్యం మరియు బహుముఖ ప్రయోజనాలను డిమాండ్ చేసే హక్కు మీకు ఉంటుంది. అది గరిష్ట హోమ్ లోన్ అర్హతను కల్పించడం, కస్టమైజ్ చేసిన ఇఎంఐ ఎంపికలను అందించడం, ఫిక్స్‌డ్ రేట్ నుండి ఫ్లోటింగ్ రేటులోకి మారే అవకాశాన్ని అందించడం మొదలైనవి.

మా కస్టమర్లకు గరిష్ట రుణ అర్హతను అందించడమే మా ప్రయత్నం, సాధారణ అర్హతకు మించిన రుణ అర్హతను మీకు అందించేందుకు మేము ప్రత్యేక ప్రోగ్రామ్‌లను రూపొందించాము.

మీకు అధిక రుణ వ్యవధిని అందించే రుణదాతను ఎంచుకోండి

మీకు సాపేక్షంగా అధిక రుణ కాలపరిమితిని అందించడానికి సిద్ధంగా ఉన్న ఒక సంస్థను ఎంచుకోండి. ఇది మీకు అధిక రుణ మొత్తం కోసం అర్హత కల్పించడమే కాకుండా, ఇఎంఐ భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా మీరు మీ కలలన్నింటినీ నెరవేర్చుకోవచ్చు.

తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం రీపేమెంట్ వ్యవధి ఎంత?

పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్‌ వద్ద మీ హోమ్ లోన్ కోసం 30 సంవత్సరాల అవధిని ఎంచుకునే అవకాశం మీకు ఉంటుంది. దీర్ఘకాలిక అవధి ఆప్షన్లు ఇఎంఐ భారాన్ని తగ్గించడంలో మీకు సహాయపడతాయి, అలాగే, అధిక రుణ మొత్తం కోసం మీకు అర్హత కల్పిస్తాయి

మీకు హోమ్ లోన్ ప్రీపేమెంట్ ఆప్షన్లు అందించే రుణదాతను ఎంచుకోండి

హోమ్ లోన్ అనేది స్వేచ్ఛకు సంబంధించిన అంశం, పరిమితులకు సంబంధించినది కాదు. కావలసినన్ని సార్లు రీపేమెంట్ చేసే ఒక రీపేమెంట్ నిబంధన కోసం మీరు అర్హులు.

పిఎన్‌బి హౌసింగ్ కస్టమర్లకు ఎలాంటి ప్రీపేమెంట్ చార్జీలు వర్తించవు, వారు ఎప్పుడైనా వారి రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు*

ఎల్లప్పుడూ ఒక విశ్వసనీయమైన రుణదాతను ఎంచుకోండి

చివరిదే అయినా చాలా ముఖ్యమైనది, రుణం అనేది దీర్ఘకాలిక సంబంధంతో ముడిపడి ఉంటుంది కాబట్టి, కస్టమర్ డాక్యుమెంట్లు సురక్షితమైన కస్టడీలో ఉండటం ముఖ్యం మరియు రుణం ఇచ్చే సంస్థ పారదర్శకమైన పద్ధతిలో పూర్తి సమాచారానికి ప్రాప్యతను ఇస్తుంది.

పిఎన్‌బి హౌసింగ్ దాని న్యాయమైన వ్యవహారాలు మరియు నైతిక ప్రవర్తనకు ప్రసిద్ధి చెందింది, రుణ ఖాతా వివరాలకు సులభమైన ప్రాప్యత లేదా పంపిణీ తర్వాత ఏదైనా రకం సేవా అవసరాల కోసం కస్టమర్లు ఈ సంస్థను పూర్తిగా విశ్వసించవచ్చు.

*షరతులు వర్తిస్తాయి

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్