PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

హోమ్ లోన్ కోసం డౌన్ పేమెంట్ అంటే ఏమిటి?

give your alt text here

ప్రతి మనిషికి మూడు ముఖ్యం - ఆహారం, దుస్తులు మరియు ఒక ఇల్లు. మొదటి రెండింటినీ సులభంగా పొందగలిగినప్పటికీ, ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి భారీ ఖర్చు అవుతుంది. ఇలాంటి సందర్భాల కోసమే వేల మంది ప్రజల ఆకాంక్షను తీర్చడానికి హోమ్ లోన్లు ఆవిర్భవించాయి.

ఒక రుణదాత అందించే హోమ్ లోన్‌లో ఆస్తి ఖర్చు యొక్క పూర్తి మొత్తం పొందుతారు అనే అపోహ ఉంది. అందరూ పరిగణలోకి తీసుకోవడానికి మర్చిపోయే అంశం హోమ్ లోన్ డౌన్ పేమెంట్. ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, ₹30 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఆస్తి విలువలో రుణదాతలు గరిష్టంగా 80% వరకు రుణమొత్తం అందించడానికి పరిమితం చేయబడ్డారు. మిగిలిన మొత్తం రుణగ్రహీత చెల్లించవలసి ఉంటుంది.

అటువంటి ముందస్తు చెల్లింపు అనేది ఒక హోమ్ లోన్ కోసం అవసరమైన డౌన్ పేమెంట్‌గా పేర్కొనబడుతుంది. ఆ మొత్తాన్ని రుణగ్రహీతలు చెల్లించడమనేది ఆర్థిక భారంగా మారుతుంది అని మీరు అనుకోవచ్చు. అయితే, మీరు దాని గురించి తెలుసుకున్న తరువాత, డౌన్ పేమెంట్ చెల్లించడం వలన ప్రయోజనాలు ఉంటాయి అని మీరు అర్థం చేసుకుంటారు.

మరింత వివరంగా తెలుసుకుందాం.

డౌన్ పేమెంట్ కోసం ఆదా చేయడం

మీరు ఒక హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ‌ను ఎంత హోమ్ లోన్ కోసం మీరు అర్హత కలిగి ఉన్నారో తనిఖీ చేయడానికి ఉపయోగించినప్పుడు, డౌన్ పేమెంట్‌‌ను కూడా ఖచ్చితంగా పరిగణించండి. ఇది మీ ఇంటి కొనుగోలు కోసం మెరుగైన ప్రణాళిక వేయడానికి ఉపయోగపడుతుంది.

ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి ఒక డౌన్ పేమెంట్‌ను చేయడం అనేది చిన్న పెట్టుబడి కాదు అని గుర్తుంచుకోండి. ఉదాహరణకి, సగటున ₹50 లక్షలు ఖర్చు అయ్యే ఆస్తిని మీరు భారతదేశంలో కొనుగోలు చేయాలని అనుకుంటే, బ్యాంకు ₹40 లక్షల వరకు మాత్రమే డబ్బును అందిస్తుంది. వాస్తవానికి, వయస్సు, ఆదాయం, అవధి, క్రెడిట్ స్కోర్ మొదలైన వాటి ఆధారంగా మీ అర్హత స్థితిని బట్టి రుణ మొత్తం ఇంకా తక్కువగా కూడా ఉండవచ్చు.

అంటే, దీని అర్థం మీరు ఇంకా హోమ్ లోన్ కోసం కనీస డౌన్ పేమెంట్ రూపంలో ₹10 లక్షల చెల్లించవలసి ఉంటుంది, ఇది భారీ మొత్తం. అందువల్ల, ఒక హోమ్ లోన్ ద్వారా ఒక ఇంటి కొనుగోలును పరిగణనలోకి తీసుకునేటప్పుడు, మీరు డౌన్ పేమెంట్ కోసం ఎలా ఆదా చేస్తారో నిర్ధారించుకోండి. కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • ముందస్తుగా పెట్టుబడి పెట్టండి
    ముందుగా ప్రణాళిక వేసుకొని కొన్ని సంవత్సరాల పాటు డబ్బును పెట్టుబడి చేసి ఒక కార్పస్‌ను సృష్టించి, దాని నుండి చెల్లింపు చేయడం ఒక మంచి ఆలోచన.
  • దామాషా పద్ధతిలో విడుదలను కోరండి
    కొన్ని ఆస్తులు మరియు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి కొంతమంది రుణదాతలు ఏకమొత్తంగా కాకుండా వాయిదాలలో హోమ్ లోన్ డౌన్ పేమెంట్ చెల్లించడానికి కస్టమర్లను అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా, నిర్మాణంలో ఉన్న ఆస్తుల విషయంలో ఇది అమలవుతుంది. మీకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దామాషా పద్ధతిలో విడుదలను ఉపయోగించడానికి ప్రయత్నించండి.

డౌన్ పేమెంట్‌ను ఎలా చేయకూడదు

  • ఇంటి కొనుగోలు కోసం డౌన్ పేమెంట్ చేయడానికి మీరు దీర్ఘకాలంగా పొదుపు చేసిన మొత్తాన్ని ఉపయోగించడం లేదా మీ ఇన్సూరెన్స్ పై రుణాన్ని తీసుకోవడం వంటివి అసలు చేయకూడదు. ఇది మీకు ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు లేదా ఆర్థిక భారాన్ని కలిగించవచ్చు మరియు మీ ఇతర ఇఎంఐ లు లేదా పెట్టుబడుల పై ప్రభావం పడవచ్చు.
  • అంతేకాకుండా, డౌన్ పేమెంట్ కోసం అదనపు రుణం మీ ఇఎంఐ మరియు ఆదాయం నిష్పత్తి పై ప్రతికూల ప్రభావం చూపుతుంది మరియు మంచి హోమ్ లోన్ డీల్ పొందడం నుండి మిమ్మల్ని నివారిస్తుంది.
  • అత్యవసర నిధుల వినియోగం కూడా మంచిది కాదు, ఎందుకంటే అత్యవసర వైద్య పరిస్థితులు, విపత్తులు లేదా ఆకస్మిక పరిస్థితులలో ఇది ఉపయోగపడుతుంది.

తప్పక చదవండి: మీ హోమ్ లోన్ అర్హతను ఎలా మెరుగుపరచుకోవాలి?

పెద్ద డౌన్ పేమెంట్ చేయడం వలన ప్రయోజనాలు

ఒక హోమ్ లోన్ కోసం కనీస డౌన్ పేమెంట్ మొత్తం కంటే ఎక్కువ మొతం చెల్లించినట్లయితే, మీ ఆస్తిలో మీరు ఎక్కువ వాటా పొందగలుగుతారు. దీని అర్థం ఒక పెద్ద హోమ్ లోన్ మొత్తాన్ని అప్పుగా తీసుకోవలసిన అవసరం మీకు తగ్గుతుంది.

  • మీరు హోమ్ లోన్ కోసం అవసరమైన అధిక డౌన్ పేమెంట్ చెల్లించినందున, తగ్గించబడిన అసలు మొత్తం కోసం మీరు మరింత అనుకూలమైన షరతులను పొందవచ్చు. అనేక రుణదాతలు వివిధ రుణ స్లాబ్‌లను కలిగి ఉన్న వాస్తవాన్ని బట్టి, తక్కువ రుణ స్లాబ్ తక్కువ వడ్డీ రేటు మరియు తక్కువ ఇఎంఐ కూడా అందించవచ్చు.
  • ఇంకా, అప్పుగా తీసుకునే డబ్బు ఎంత తక్కువగా ఉంటే, మీ హోమ్ లోన్‌ను మీరు అంత త్వరగా చెల్లించవచ్చు. మీరు అదనపు హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఖర్చులు లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కూడా ఆదా చేసుకోవచ్చు.
  • చివరిగా, ఒక తక్కువ రుణం మొత్తం రుణ సంస్థకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మరియు రుణం వేగంగా ఆమోదం పొందే అవకాశాన్ని పెంచుతుంది.

ముగింపు

మీరు మరింత డబ్బును చెల్లించినప్పుడు, మీరు మెరుగైన హోమ్ లోన్ షరతులు మరియు హోమ్ లోన్ వడ్డీ రేట్లు పొందుతారు. అందువల్ల, మెరుగైన ప్రణాళిక వేసినట్లయితే, మరింత సరసమైన మరియు ఆచరణాత్మక హోమ్ లోన్‌ను పొందడానికి ఒక హోమ్ లోన్ డౌన్ పేమెంట్ ఒక ముఖ్యమైన సాధనం కావచ్చు. ఖచ్చితంగా, ఇక్కడ ప్రణాళిక ముఖ్యం.

పిఎన్‌బి హౌసింగ్ వద్ద, మేము డౌన్ పేమెంట్ కోసం కస్టమర్లు అందరికీ గొప్ప ఫ్లెక్సిబిలిటీని అందిస్తాము. మీకు తగిన విధంగా సరిపోయే డౌన్ పేమెంట్‌ను తెలుసుకోవడానికి మరియు హోమ్ లోన్‌కు సంబంధించి ఏదైనా ఇతర ప్రశ్న కోసం నేడే మా నిపుణులను సంప్రదించండి.

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్