హోమ్ లోన్ అర్హతను అంచనా వేసేటప్పుడు లేదా ఏదైనా ఇతర రకమైన రుణం తీసుకునేటప్పుడు 'సిబిల్ స్కోర్' లేదా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. దరఖాస్తుదారులు వారి స్కోర్‌ను తనిఖీ చేయాలి మరియు వారి అర్హతను, వారి నుండి వసూలు చేయబడే ఆర్ఒఐ మరియు ప్లాన్ గురించి అర్థం చేసుకోవడానికి అది ఒక నిర్దిష్ట సంఖ్య కంటే ఎక్కువగా ఉందో లేదో తెలుసుకోవాలి. సిబిల్ స్కోర్ గురించి అవగాహన లేని వారికి అది ఒక ముఖ్యమైన ప్రొఫెషనల్ పరీక్షలో సాధించిన మార్కులుగా అనిపించవచ్చు. కానీ వాస్తవం అది కాదు. ఇది ఒక దరఖాస్తుదారు యొక్క క్రెడిట్‌యోగ్యత యొక్క అంచనాను అందిస్తుంది.
కాబట్టి, సిబిల్ స్కోర్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది మరియు హోమ్ లోన్లు విషయానికి వస్తే ఇది ఎందుకు ముఖ్యం? ఈ క్రింది బ్లాగ్‌లో ఈ అంశం గురించి విస్తృతంగా తెలుసుకుందాం.
సిఐబిఐఎల్ స్కోర్ అంటే ఏమిటి?
సిబిల్ స్కోర్ అనేది దరఖాస్తుదారుని క్రెడిట్ చరిత్ర మరియు పనితీరును సూచించే మూడు అంకెల సంఖ్య. ఇది 300-900 వరకు ఉంటుంది. ఎక్కువ స్కోర్ గల దరఖాస్తుదారుడిని రుణదాతలు తక్కువ రిస్కు గల కస్టమర్లుగా పరిగణిస్తారు. కావున, సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, దరఖాస్తుదారు అంత ఎక్కువ క్రెడిట్ కోసం అర్హులు. ఇది ఏదైనా రుణ అభ్యర్థన కోసం అనగా ఒక హోమ్ లోన్‌కు కూడా మెరుగైన అర్హతను చూపిస్తుంది.
మూడు అంకెల సిబిల్ స్కోర్‌ను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, సిబిల్ అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం.
- సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ - భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా లైసెన్స్ ఇవ్వబడిన ఒక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ.
- సిబిల్ అనేది భారతదేశంలో పురాతన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మరియు అమెరికన్ ట్రాన్స్‌యూనియన్ మల్టీనేషనల్ గ్రూప్‌లో ఒక భాగం.
- ముఖ్యంగా, వ్యక్తులు మరియు వ్యాపారాల రుణం మరియు క్రెడిట్ ట్రాన్సాక్షన్ల రికార్డులను సేకరించడానికి మరియు నిర్వహించడానికి సిబిల్ బ్యాంకులు మరియు ఆర్థిక సేవ ప్రదాతలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.
- ఈ క్రెడిట్ రికార్డులను సంకలనం చేయడం ద్వారా, సిబిల్ సంస్థల క్రెడిట్ పనితీరును అంచనా వేయవచ్చు - అవి ఎక్కువగా రుణాలను తీసుకున్నా, లేదా రుణాలను ఎగవేస్తున్నా, మొదలైనవి.
- ఈ ట్రాక్ రికార్డు ద్వారా సిబిల్ ప్రతి ఒక్కరి కోసం క్రెడిట్ రేటింగ్‌ని పొందుతుంది, ఎవరైనా భవిష్యత్తులో రుణం కోసం దరఖాస్తు చేసినట్లయితే, రుణదాతలు వారికి మంజూరు చేసే ముందు ఎంత నష్టభయం ఉందో అంచనా వేయవచ్చు.
- 600 మిలియన్లకు పైగా కస్టమర్లు మరియు 32 మిలియన్లకు పైగా వ్యాపారాలపై సిబిల్ క్రెడిట్ సమాచారాన్ని కలిగి ఉంది. దేశంలోని రుణదాతలు ఎక్కువగా అనుసరించే క్రెడిట్ రేటింగ్ ఇది.
ఇప్పుడు సిబిల్ స్కోర్ ఎలా రికార్డు చేయబడుతుందో తెలుసుకుందాం.
తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం ఉత్తమ క్రెడిట్ స్కోర్ ఏమిటి?
సిబిల్ నివేదిక అంటే ఏమిటి?
క్రెడిట్ సమాచారం సిబిల్ ద్వారా ఎలా నిల్వ చేయబడుతుంది మరియు రికార్డు చేయబడుతుంది?? అది ఒక సిబిల్ నివేదిక ద్వారా జరుగుతుంది.
- ఒక సిబిల్ నివేదిక లేదా క్రెడిట్ సమాచార నివేదిక అనేది ఒక వ్యక్తి లేదా వ్యాపారం యొక్క అన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ల రికార్డ్
- ఇందులో గత మరియు ప్రస్తుత రుణాలు, రీపేమెంట్ మరియు రుణ చరిత్ర, ఏవైనా క్రెడిట్ కార్డ్ బకాయిలు, చెల్లింపుల ఎగవేత, ఇఎంఐ ట్రాన్సాక్షన్లు మొదలైనటువంటి సమాచారం ఉంటుంది.
- అదనంగా, ఒక సిబిల్ నివేదిక ఒక వ్యక్తి యొక్క ఉపాధి వివరాలు అలాగే వ్యక్తి చేసిన రుణం విచారణల యొక్క అన్ని సందర్భాలను కూడా సంకలనం చేస్తుంది. ఒక దరఖాస్తుదారుని ఆర్థిక వివరాల గురించి మరింత సమగ్రమైన అవగాహనను ఇది రుణదాతకు అందిస్తుంది.
- వ్యక్తులు అధికారిక సిబిల్ వెబ్‌సైట్ నుండి సులభంగా సిబిల్ రిపోర్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు తనిఖీ చేసుకోవచ్చు. రుణదాతలు కూడా నామమాత్రపు ఫీజు వద్ద వారి యాప్స్ మరియు వెబ్‌సైట్ల ద్వారా ఈ సౌకర్యాన్ని అందిస్తారు.
అందువల్ల, ఒక సిబిల్ నివేదిక అనేది రుణదాతలకు అవసరమైన డాక్యుమెంట్లలో ఒకటి.
సిబిల్ స్కోర్ ఎలా పనిచేస్తుంది?
సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలుసుకున్నాము, ఇపుడు ఇది ఎలా లెక్కించబడుతుంది మరియు ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్ స్థిరంగా ఉండదు. వ్యక్తి యొక్క క్రెడిట్ చరిత్ర మరియు పనితీరు ఆధారంగా ఇది నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. దానిని ప్రభావితం చేసే నాలుగు అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- చెల్లింపు చరిత్ర – ఒక వ్యక్తి సకాలంలో రుణం చెల్లింపులు మరియు ఇఎంఐలను క్లియర్ చేయడంలో విఫలమైతే లేదా వాటిపై నిరంతరం డిఫాల్ట్ అయితే, అప్పుడు సిబిల్ స్కోర్ తగ్గుతుంది.
- క్రెడిట్ మిక్స్ – దరఖాస్తుదారు సెక్యూర్డ్ మరియు అన్‌సెక్యూర్డ్ రుణాల సంతులిత మిశ్రమం కలిగి ఉంటే, సిబిల్ స్కోర్ పాజిటివ్‌గా ఉంటుంది. ఇక్కడ, సెక్యూర్డ్ రుణాలు అంటే హోమ్ లోన్లు, కార్ లోన్లు, మొదలైనవి మరియు అన్‌సెక్యూర్డ్ రుణాలు అంటే క్రెడిట్ కార్డు బిల్లులు, వ్యక్తిగత రుణాలు మొదలైనవి.
- రుణ విచారణలు – నివేదికలో అనేక క్రెడిట్ లేదా రుణ తిరస్కరణలను కలిగి ఉండటం స్కోర్‌ను దెబ్బతీయవచ్చు. అదేవిధంగా, ఆ వ్యక్తి ఇటీవల అనేక రుణాలను పొందినట్లయితే, వారి రుణ భారం పెరుగుతుంది, దీని వలన వారి క్రెడిట్ రేటింగ్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది మరియు భవిష్యత్తు రుణాల గురించి రుణదాతలను హెచ్చరిస్తుంది.
- క్రెడిట్ వినియోగం – క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే, హోల్డర్ అంత అప్పు చేసినట్లు, అది సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.
ప్రతి నెలా ఈ పారామితులు అన్నింటినీ అంచనా వేయడం ద్వారా, సిబిల్ ప్రతి వ్యక్తికి ఒక అప్‌డేట్ చేయబడిన స్కోర్‌ను సృష్టిస్తుంది. ఈ విధంగా, ఒక వ్యక్తి తరువాత రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత వారి తాజా సిబిల్ స్కోరును అంచనా వేస్తారు మరియు వారి ఆర్థిక విశ్వసనీయత కోసం దరఖాస్తు ప్రక్రియలో నివేదిస్తారు. వారు రుణం కోసం అవసరమైన ప్రమాణాలను నెరవేర్చినట్లయితే, అది త్వరగా మంజూరు చేయబడుతుంది. లేకపోతే, దరఖాస్తు తిరస్కరించబడుతుంది లేదా వడ్డీ రేటు పెరుగుతుంది.
సిబిల్ స్కోర్ యొక్క ప్రాముఖ్యత - అది ఎందుకు ముఖ్యం?
- సిబిల్ స్కోర్ ఒక వ్యక్తి యొక్క క్రెడిట్‌యోగ్యతకు రుజువుగా ఉంటుంది మరియు రుణ దరఖాస్తు ప్రక్రియలో ముఖ్యమైన అర్హత ప్రమాణంగా నిలుస్తుంది.
- సిబిల్ స్కోరు మెరుగ్గా ఉంటే దరఖాస్తుదారునికి ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక సిబిల్ స్కోరు ఉంటే సాధ్యమైన ఉత్తమ రుణ నిబంధనలను పొందవచ్చు.
- తక్కువ సిబిల్ స్కోర్ భవిష్యత్తులో ఏదైనా రుణం పొందే అవకాశాలను తగ్గించవచ్చు.
ఉత్తమ సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాము. కానీ ఉత్తమ సిబిల్ స్కోర్ ఏమిటి?
ఒక నిర్దిష్ట రుణం కోసం ఆవశ్యకతలను నెరవేర్చడానికి తగిన సిబిల్ స్కోరు ప్రతి రుణదాతకు మారుతుంది. ఒక హోమ్ లోన్ కోసం 700 లేదా 750 కంటే ఎక్కువ ఉన్న సిబిల్ స్కోర్ సరిపోతుంది. అయితే, సిబిల్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే, దరఖాస్తుదారు అంత ఉత్తమమైన హోమ్ లోన్ నిబంధనలను పొందుతారు - తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేట్లు సహా. సాధారణంగా, రుణదాతలు అందరి వద్ద వివిధ సిబిల్ స్కోర్ శ్రేణుల కోసం వివిధ స్థాయిలలో వడ్డీ రెట్లు ఉంటాయి.
చివరగా, ఉత్తమ హోమ్ లోన్ ఆఫర్లను పొందడానికి, సున్నా అర్హత సమస్యలను ఎదుర్కోవడానికి మరియు వేగవంతమైన రుణ దరఖాస్తు ఆమోదం మరియు రుణ మంజూరును పొందడానికి, 800 కంటే ఎక్కువ సిబిల్ స్కోరును కలిగి ఉండడం ముఖ్యం.
తప్పనిసరిగా చదవాలి: మీ సిబిల్ స్కోరును 500 నుండి 750 వరకు ఎలా మెరుగుపరచాలి?
ముగింపు
మంచి సిబిల్ స్కోరును నిర్వహించడం చాలా ముఖ్యం. దానిని ఎలా చేయాలో ఇక్కడ ఇవ్వబడింది:
- చెల్లింపులు మరియు ఇఎంఐల ను ఎన్నడూ ఎగవేయకూడదు.
- క్రెడిట్ బ్యాలెన్స్ మరియు అప్పులను తక్కువగా ఉంచుకోండి.
- మంచి క్రెడిట్ కలయికను కలిగి ఉండండి.
- రుణాల కోసం దరఖాస్తు చేయవద్దు లేదా అత్యధికంగా క్రెడిట్ పొందవద్దు.
- ఎల్లప్పుడూ స్కోరును క్రమం తప్పకుండా తనిఖీ చేయండి మరియు నిర్వహించండి.
- తిరస్కరణలను నివారించడానికి దరఖాస్తు చేయడానికి ముందు మొదట సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచండి.
పిఎన్‌బి హౌసింగ్ వద్ద, ఎటువంటి అవాంతరాలు లేకుండా ఒక హోమ్ లోన్‌ను పొందేందుకు ప్రతి ఒక్కరికీ సహాయపడటానికి మేము క్రెడిట్ స్కోర్ ప్రమాణాలను సడలించాము. వివిధ సిబిల్ స్కోర్ పరిధుల కోసం హోమ్ లోన్ వడ్డీ రేటు అర్హతను అంచనా వేయడానికి ఈ లింక్‌ను చూడండి.