PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

హోమ్ లోన్ కోసం ఉత్తమ క్రెడిట్ స్కోర్ ఏమిటి?

give your alt text here

కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు అనేది మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేని ఒక విశ్వసనీయమైన పెట్టుబడి ఎంపిక. అగ్రశ్రేణి వాణిజ్య ప్రాంతాల్లో సమయం గడిచే కొద్దీ ఆస్తి విలువ పెరుగుతుంది, అలాగే అద్దె కూడా పెరుగుతుంది. కావున, చాలా మంది పెట్టుబడిదారులు దీనిని ఒక దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తారు, అద్దె ఆదాయం వీరికి నగదు ప్రవాహానికి వీలుకల్పిస్తుంది మరియు వీరు ఈ ఆస్తిని విక్రయించినప్పుడు అధిక విలువగల మొత్తాన్ని పొందవచ్చు. కమర్షియల్ ప్రాపర్టీ లోన్ వడ్డీ రేట్లు గతంలో కంటే తక్కువగా ఉండటం మరియు లాభదాయకమైన నిర్ణయం తీసుకోవడానికి 2022 అత్యంత అనుకూలమైన సమయం కావడం వలన - వాణిజ్య ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి దీనిని సరైన సమయంగా పరిగణించవచ్చు.

5 ప్రధాన కారణాలను తెలుసుకుందాం:

ఆకర్షణీయమైన కమర్షియల్ ప్రాపర్టీ లోన్ వడ్డీ రేట్లు మరియు సడలించబడిన అర్హతను మొదలుకొని ఈక్విటీ నిర్మాణం, అవకాశాలు మరియు భద్రత వరకు అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. దీపావళి రోజున కమర్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడం మీకు కలిసొస్తుంది అనడానికి ఆరు బలమైన కారణాలు ఉన్నాయి:

1. దీపావళి ఎంతో శుభప్రదమైన పండుగ

భారతదేశంలో అత్యంత శుభసూచక సమయాలలో దీపావళి ఒకటి మరియు అలాగే, ప్రజలు దీపావళి మరియు ధంతేరస్ నాడు మరింత శ్రేయస్సు మరియు అదృష్టం పొందాలని పెద్ద స్థాయిలో కొనుగోళ్లు చేస్తారు. మరియు ఈ సమయంలో వాణిజ్య ఆస్తి కంటే మెరుగైన పెట్టుబడి ఏమిటి? పిఎన్‌బి హౌసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ లోన్ వారి సవరించబడిన అర్హత మరియు తక్కువ వడ్డీ రేట్లతో వాణిజ్య ఆస్తిని కొనండి. దీర్ఘకాలిక పెట్టుబడి హామీ ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం మరియు లాభాలను సంపాదించడం ద్వారా మీరు ఈ దీపావళిని లాభదాయకమైనదిగా చేయవచ్చు.

2. ఆకర్షణీయమైన రుణ నిబంధనలు

కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేయడం మీ ప్రస్తుత ఆర్థిక సామర్థ్యానికి మించి ఉంటే: పిఎన్‌బి హౌసింగ్ మీకు మద్దతునిస్తుంది, పిఎన్‌బి హౌసింగ్, ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 70% వరకు నిధులను కమర్షియల్ ప్రాపర్టీ రుణ మొత్తంగా మీకు అందిస్తుంది. 8.75% నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో కమర్షియల్ ప్రాపర్టీ రుణాలను తిరిగి చెల్లించడం చాలా సులభం.

3. దీపావళి డిస్కౌంట్లను పొందండి

భారతీయులందరూ ఎంతో ఆశగా ఎదురుచూసే పండుగ దీపావళి. రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సహా వ్యాపారస్తులు అందరూ, దీపావళి మరియు ధన త్రయోదశి రోజున భారీ డిస్కౌంట్లు, ఉచిత బహుమతులతో వారి తాజా ఆస్తి ఆఫర్లను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతారు. ఈ అద్భుతమైన దీపావళి ఆఫర్లతో మీరు కమర్షియల్ ఆస్తిని కొనుగోలు చేస్తే ఉచిత ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, బంగారు నాణేలు, పన్ను మరియు సుంకం మినహాయింపులను పొందవచ్చు: దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోండి!

4. సౌకర్యవంతమైన కొనుగోలు మరియు త్వరిత లోన్ అప్రూవల్

ఆన్‌లైన్‌లో అత్యుత్తమ శ్రేణి కమర్షియల్ ప్రాపర్టీలను కనుగొనడం చాలా సులభం. మీ బడ్జెట్‌కు తగినవిధంగా సరిపోయే ఒక కమర్షియల్ ప్రాపర్టీని శోధించడానికి మీరు ఆన్‌లైన్ ప్రాపర్టీ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు. ఏదైనా ఒక దానిని ఖరారు చేసే ముందు భౌతికంగా ఆస్తిని సందర్శించడం వివేకం అనిపించుకుంటుంది. మీరు ఆస్తిపై అంతిమ నిర్ణయం తీసుకోవడంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే, పిఎన్‌బి హౌసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ లోన్ మీ కోసం అవాంతరాలు లేకుండా రుణాన్ని అందిస్తుంది. అనుకూలీకరించిన అర్హత ప్రమాణాలు మరియు వేగవంతమైన పంపిణీతో, మీరు మీ వాణిజ్య ఆస్తిని కేవలం రెండు రోజుల్లో స్వంతం చేసుకోవచ్చు.

5. ఈక్విటీ నిర్మాణం

నివాస ఆస్తులతో పోలిస్తే సాధారణంగా వాణిజ్య ఆస్తులు అధిక రాబడులను అందిస్తాయి. ఇవి ఇతర ఆస్తి పెట్టుబడుల కంటే ఎక్కువ ఈక్విటీని నిర్మించడంలో మీకు సహాయపడతాయి. అంతేకాకుండా, భారతదేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి కారణంగా, వాణిజ్య ఆస్తుల కోసం డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది

ముగింపు

వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేయడం అనేది ఈ దీపావళికి ఒక గొప్ప విలువైన పెట్టుబడిగా ఉండవచ్చు. పిఎన్‌బి హౌసింగ్ అవాంతరాలు లేని దరఖాస్తు ప్రక్రియ మరియు శీఘ్ర పంపిణీ ద్వారా క్రెడిట్‌ను అందించే బాధ్యతను తీసుకుంటుంది. మీరు చేయవలసిందల్లా పిఎన్‌బి హౌసింగ్ వెబ్‌సైట్‌లో మీ అభ్యర్థనను సమర్పించడం మరియు ఒక ప్రతినిధి మిమ్మల్ని సంప్రదించే వరకు వేచి ఉండటం.

చివరగా, ఈ దీపావళి సందర్భంగా కమర్షియల్ ప్రాపర్టీని బుక్ చేయండి, రాబోయే సంవత్సరాల్లో ప్రతిఫలాన్ని పొందండి!

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్