మీ ఆర్థిక వ్యవహారాల పట్ల మీరు బాధ్యతగా వ్యవహరించి సకాలంలో మీ చెల్లింపులు చేసినట్లయితే, సిబిల్ స్కోర్ కోసం ముఖ్యం అయిన మీ విశ్వసనీయత మెరుగుపడుతుంది మరియు మీ క్రెడిట్ యోగ్యత కూడా మెరుగుపడుతుంది.
రుణం పై ఇల్లు కొనుగోలు చేసిన ఎవరైనా దరఖాస్తు చేయడానికి ముందు మీ క్రెడిట్ స్కోరును లేదా మీ సిబిల్ స్కోరును తనిఖీ చేయవలసిందిగా సలహా ఇస్తారు. అతి ముఖ్యమైన ఈ సిబిల్ స్కోరు అనేది క్రెడిట్ (ఇండియా) లిమిటెడ్ లేదా సిబిల్ ద్వారా ఒక రుణ దరఖాస్తుదారు యొక్క క్రెడిట్ యోగ్యతను తెలుసుకునే ఒక రేటింగ్. క్రెడిట్ బ్యూరో అని కూడా ప్రముఖంగా పిలవబడే సిబిల్ భావి రుణగ్రహీత యొక్క గత క్రెడిట్ చరిత్ర (రుణాల రీపేమెంట్ మరియు క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపు) పై బ్యాంకులు మరియు ఇతర రుణదాతల నుండి సమాచారం సేకరించి వ్యక్తులకు మరియు వ్యాపార సంస్థలకు స్కోరును కేటాయిస్తుంది.
- మీరు రుణం కోసం దరఖాస్తు చేసినట్లయితే మరియు అది మంజూరు చేయబడకపోయి ఉంటే, మీ రుణం ఎందుకు మంజూరు చేయబడలేదు మరియు అది మళ్ళీ జరగకుండా ఎలా నిర్ధారించాలో ఈ కథనం మీకు వివరిస్తుంది.
- మీరు భవిష్యత్తులో ఒక హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటే, మీకు క్రెడిట్ యోగ్యత ఉంది అని నిర్ధారించడానికి గమనించవలసిన అంశాల గురించి ఇది మార్గనిర్దేశం చేస్తుంది.
రుణ దరఖాస్తు ఎప్పుడు తిరస్కరించబడుతుంది?
రుణ దరఖాస్తు తిరస్కరించబడటానికి వివిధ కారణాలు ఉండవచ్చు. వీటిని విస్తృతంగా ఈ క్రింది వాటిలోకి వర్గీకరించవచ్చు:
తక్కువ చెల్లింపు చరిత్ర — ఆలస్యపు చెల్లింపులు చేయడం లేదా ఇఎంఐ ల ఎగవేత అనేది ఆర్థిక ఇబ్బందులకు సంకేతం, ఇవి ప్రతికూలంగా చూడబడతాయి మరియు మీ సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి.
వివేచన లేని క్రెడిట్ ఉపయోగం — క్రెడిట్ యొక్క అధిక వినియోగం నేరుగా మీ స్కోర్‌ను ప్రభావితం చేయకపోయినప్పటికీ, మీ ప్రస్తుత బ్యాలెన్స్‌లో పెరుగుదల అనేది పెరిగిన రీపేమెంట్ భారం యొక్క స్పష్టమైన సూచన మరియు ఇది మీ స్కోర్‌ను తీవ్రంగా ప్రభావితం చేయగలదు.
అన్‍సెక్యూర్డ్ లోన్లలో అధిక వాటా - ఆటో మరియు/లేదా పర్సనల్ లోన్లు వంటి అన్‍సెక్యూర్డ్ లోన్లలో సాపేక్షంగా అధిక వాటా మీ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. సెక్యూర్డ్ (హోమ్ లోన్లు) మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల మిశ్రమం కలిగి ఉండటం ఉత్తమం.
కొత్తగా అనేక అకౌంట్లను తెరవడం — మీరు ఇటీవల అనేక క్రెడిట్ కార్డులు మరియు/లేదా పర్సనల్ లోన్ అకౌంట్ల కోసం అప్లై చేసినట్లయితే, మీ రుణదాత మీ తాజా దరఖాస్తు పట్ల కొంత ఆందోళనను కనబరుస్తారు. అనేక అకౌంట్లు అదనపు రుణ భారాన్ని సూచిస్తాయి మరియు ఖచ్చితంగా మీ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి, ఇది మీ దరఖాస్తు తిరస్కరించబడటానికి దారితీయవచ్చు.
ఒక అకౌంట్ మూసివేతలో అజాగ్రత్త – కొన్నిసార్లు ఒక అకౌంట్‌ను మూసివేసేటప్పుడు అకౌంట్ హోల్డర్ అన్ని ఫార్మాలిటీలు మరియు విధానాలను పూర్తి చేయరు లేదా గమనించకపోవడం వలన చిన్న బ్యాలెన్స్ పెండింగ్‌లో ఉంటుంది. అకౌంట్ హోల్డర్ యొక్క బాధ్యతలలో ఇప్పటికీ కనపడే ఈ అకౌంట్ క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
డిఫాల్టర్‌కు హామీ ఇవ్వడం – తరచుగా సద్భావంతో మనం ఒక స్నేహితునికి లేదా పరిచయస్తునికి పూచీదారుగా వ్యవహరిస్తాము. పూచీ ఇవ్వడం అనేది ఒక ఆర్థిక నిర్ణయంగా ఉండాలి కానీ ఒక భావోద్వేగపూర్తిమైన నిర్ణయం కాకూడదు, ఎందుకంటే రుణగ్రహీత ఎగవేసినప్పుడు మీ సిబిల్ స్కోరు పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది.
మీ క్రెడిట్ చరిత్రపై నెగటివ్ వ్యాఖ్యలు – మునుపటి రుణాలకు సంబంధించి, మీ సిబిల్ నివేదిక పై 'రిటెన్ ఆఫ్' లేదా 'సెటిల్ చేయబడింది' వంటి వ్యాఖ్యలు రుణదాతలకు చెడు సంకేతాలను ఇస్తాయి.
మీ సిబిల్ స్కోర్‌ను మీరు ఎలా మెరుగుపరచుకోవచ్చు?
సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచడం కష్టం కాదు ; మీరు చేయవలసిందల్లా ఈ క్రింది అంశాల గురించి జాగ్రత్త పడడం.
చెల్లింపు చేయండి – మీకు ఇష్టమైనప్పుడు లేదా మీ అకౌంట్‌లో తగిన బ్యాలెన్స్ ఉన్నప్పుడు కానీ సకాలంలో చెల్లింపులు చేయండి. ఆలస్యపు చెల్లింపులు చేయడం సరికాదు మరియు మీ రుణదాతలు వాటిని తీవ్రంగా పరిగణిస్తారు.
తక్కువ ఫైనాన్షియల్ లివరేజ్ — మీ అప్పులు మరియు క్రెడిట్ అవసరాలను కనీస స్థాయిలో ఉంచుకోండి. రుణం తీసుకోవాలి అనే ఆలోచనను అదుపులో ఉంచుకోండి. మీకు నిజంగా ఆ రుణం అవసరమా లేదా అవసరమైన మొత్తం ఇతర వనరుల నుండి సేకరించవచ్చా అనే విషయాల గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు నిజంగా అవసరం అయినప్పుడు మాత్రమే రుణాన్ని తీసుకోండి.
మిశ్రమ అప్పులు — వివిధ లోన్ల (ఇంటి, వ్యక్తిగత, ఆటో మొదలైనవి) యొక్క ఆరోగ్యకరమైన మిశ్రమాన్ని నిర్వహించండి. హోమ్ లోన్ మొత్తం ఎక్కువగా ఉండడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే, సమతుల్యత అనుచితంగా ఉండకుండా నిర్ధారించుకోండి.
దానిని సరైనదిగా ఉంచండి – తప్పు కమ్యూనికేషన్ లేదా పర్యవేక్షణ కారణంగా, మీ వ్యక్తిగత అకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్ రికార్డులలో తప్పులు ఉన్నట్లయితే, రుణదాతతో వెంటనే సంప్రదించండి మరియు వాటిని సరిచేయండి; మీ తప్పు లేకుండా, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
జాయింట్ అకౌంట్ చెల్లింపులపై డిఫాల్ట్‌లను అనుమతించకండి మరియు వారి చెల్లింపులపై డిఫాల్ట్ చేయగల ఎవరికీ హామీ ఇవ్వకండి - అటువంటి చర్యలు మీ స్వంత అకౌంట్‌లపై నాన్-పేమెంట్‌గా మీ సిబిల్ స్కోర్‌కు నష్టం జరగవచ్చు.
మీ హోమ్ లోన్ మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచగలదా?
దీనికి సమాధానం ఆశ్చర్యంగా రావచ్చు ; కానీ అవును, ఒక హోమ్ లోన్ మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచవచ్చు. ఏదైనా సెక్యూర్డ్ లోన్ (హోమ్ లోన్లు) మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది మరియు ఒక అన్‍సెక్యూర్డ్ లోన్ (ఆటో లోన్, పర్సనల్ లోన్ మొదలైనవి) మీ స్కోర్‌ను తగ్గిస్తాయి. దీని వెనుక లాజిక్ చాలా సులభం ; సెక్యూర్డ్ లోన్లు సాధారణంగా విలువైన ఆస్తిని సృష్టించడం వైపు వెళ్తాయి, అయితే ఒక అన్‍సెక్యూర్డ్ లోన్ విలువ తగ్గే ఆస్తి చెల్లింపు వైపు వెళుతుంది.
కాబట్టి, మీరు ఒక హోమ్ లోన్‌ను పొందడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు న్యాయమైన మరియు పారదర్శకమైన రుణదాతను ఎంచుకోవడం ముఖ్యం. తక్కువ సిబిల్ స్కోర్ కారణంగా మీ హోమ్ లోన్ తిరస్కరించబడితే, మీకు తెలియజేయడానికి రుణదాత దాని బాధ్యతను అంచనా వేయాలి.