PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

ఇంటిని కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం ఏది?

give your alt text here

మనం తరచుగా మనకు తప్పక అవసరమైన ఏదైనా కొనడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తుంటాము. అయితే, కొన్నిసార్లు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే సరైన సమయం కొరకు చాలా కాలం వేచి ఉంటాము, ఆ క్రమంలో ఏదైనా అవకాశాన్ని మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీ కోసం ఒక ఇంటిని కొనుగోలు చేయడం లేదా పెట్టుబడి పెట్టడానికి, మీ ప్రస్తుత మరియు భవిష్యత్తులో ఉండే మీ ఆర్థిక పరిస్థితి, మీ ప్రస్తుత బాధ్యతలు, మీ అర్హతలు, మీ ప్రస్తుత నెలవారీ అద్దె మొదలైన వాటికి అనుగుణంగా ఒక సరైన మరియు అనుకూలమైన ప్లాన్ చేసుకోవాలి.

చాలా సందర్భాల్లో ఒక వ్యక్తికి పెట్టుబడి అనగానే హోమ్ లోన్ తప్పనిసరిగా ఉంటుంది. కృతజ్ఞతగా, హోమ్ లోన్ సంస్థలు ఇప్పుడు వారు 5 లేదా 10 సంవత్సరాల క్రితం వినియోగించిన దాని కంటే ఎక్కువ శాతం హోమ్ లోన్ ఖర్చుకు నిధులుగా కేటాయిస్తున్నారు. అధిక డిస్పోజబుల్ ఆదాయం మరియు దేశంలో నెలకొన్న మెరుగైన ఉపాధి అవకాశాల దృష్ట్యా, ఇల్లు కొనుగోలుదారులు ఇప్పుడు చాలా చిన్న వయస్సులో వారి కలల ఇంటి కోసం పెట్టుబడి పెట్టగలుగుతున్నారు. నిధుల నిబంధనలు ఇప్పుడు ఇంటి విలువలో 80-90% పరిధి వరకు అందించబడుతున్నాయి మరియు ఇది ఒక వ్యక్తి ఒక ఇంటిని కొనుగోలు చేసేందుకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది, ఇది మా హోమ్ లోన్ కొనుగోలుదారులకు మేము తెలియజేయాలనుకునే మొదటి విషయం.

తప్పక చదవండి: మీ హోమ్ లోన్ వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి (4 సాధారణ చిట్కాలు)

ఇల్లు కొనడానికి మీరు భారీ సంపదను కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదు:

మీరు ఇల్లు కొనడానికి పొదుపు చేస్తుంటే, మీ తార్కికంలో ఒక ప్రాథమిక లోపాన్ని గురించి తెలుసుకున్నారా?? వాస్తవానికి మీరు ఒక ఇంటిని కొనుగోలు చేసే సమయానికి, దాదాపు రెండు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరగవచ్చు, కాబట్టి వేచి ఉండటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. రుణ సంస్థలు ఇప్పుడు ఇంటి ఖర్చులో 90%* వరకు నిధులు సమకూరుస్తున్నాయి, కాబట్టి తెలివిగా వాటిని సద్వినియోగం చేసుకోండి, ఇప్పుడే ఇంటిని కొనుగోలు చేయండి.

మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడే మీ కలల ఇంటిని కొనండి:

మీ డిస్పోజబుల్ ఆదాయం తక్కువగా ఉండవచ్చు కానీ, మీరు మీ సొంతింటి కోసం ఎంత త్వరగా పెట్టుబడి పెడితే, అంత వేగంగా దానిని తిరిగి చెల్లించగలరు. మీరు ఒక ఇల్లును సొంతం చేసుకొని, కొంత కాలం వరకు రుణాన్ని చెల్లించిన తరువాత ఇతర వాటిలో పెట్టుబడి గురించి ఆలోచించవచ్చు. ఎక్కువగా ఆలస్యం చేస్తే మీ ప్రాధాన్యతలు మారవచ్చు, అప్పుడు ఇల్లు కొనుగోలు చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. అలాగే, యుక్త వయస్సులోనే మీకు సుదీర్ఘమైన అవధిని ఎంచుకొని నెలకు తక్కువ ఇఎంఐ భారాన్ని కలిగి ఉండే అవకాశాన్ని పొందవచ్చు. మీరు హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ సహాయంతో వివిధ కాలవ్యవధుల కోసం ఇఎంఐలో వ్యత్యాసాన్ని లెక్కించవచ్చు

మీ బడ్జెట్‌కు సరిపోయే ఒక ఇంటిని కొనుగోలు చేయండి:

మీరు ఒక సమయంలో ఒక అడుగు వేయండి. బడ్జెట్ సమస్య ఉంటే అప్పుడు మీ కలల ఇంటి కోసం కొన్ని దశలలో మీ ఆలోచన అమలు చేయండి. మీరు ఇష్టపడే ఇల్లు మీ బడ్జెట్‌‌లో ఉండకపోవచ్చు. మీకు నచ్చిన అలాంటి ఇంటిని కొనుగోలు చేసేందుకు మీ వద్ద వనరులు లేనప్పుడు, మొదట మీ ఆర్థిక స్థోమతకు సరిపోయే ఒక ఇంటిని కొనడం మంచిది. మీ అర్హత పెరిగే కొద్దీ మీరు పెద్ద ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీరు ఇల్లు కొనుగోలు కోసం ఎంత రుణం పొందవచ్చో తెలుసుకోవడానికి హౌస్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం డౌన్ పేమెంట్ అంటే ఏమిటి?

నిర్మాణంలో ఉన్న ఇళ్లలో పెట్టుబడి పెట్టండి:

అనేక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆమోదించబడిన నిర్మాణంలో ఉన్న ఆస్తుల కోసం హోమ్ లోన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా నిర్మాణంలో ఉన్న ఆస్తులు తక్కువ ఖర్చుతో వస్తాయి మరియు అలాంటి ఆస్తులు మీకు నిధులను సమకూర్చుకోవడానికి సమయాన్ని కూడా ఇస్తాయి. ఎందుకంటే, మీరు ప్రతి వరుస స్లాబ్ పూర్తయిన తరువాత, అడపాదడపా భాగాలుగా చెల్లింపు చేస్తుంటారు.

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్