హోమ్ లోన్ మీ స్వంత ఇంటి కలను నిజం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. సాధారణంగా హోమ్ లోన్ నిర్ధిష్ట ఆర్థిక నిబద్దతతో వస్తుంది, మీరు లోన్ అవధి అంతటా ఇఎంఐ (సమాన నెలవారీ వాయిదాల)ల రూపంలో రుణాన్ని చెల్లించాలి. నెలవారీ ఇఎంఐ నిబద్ధతలు మరియు లోన్ అవధి మధ్య మీరు చక్కటి సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యం.
ముందుగా, ఇఎంఐ అంటే ఏమిటి?
సాధారణంగా ఇఎంఐ అనేది మీ రుణ బాధ్యతలను తీర్చడానికి మీరు రుణదాతకు చేసే నెలవారీ చెల్లింపుల శ్రేణిని సూచిస్తుంది. వడ్డీ రేట్లలో పెద్దగా మార్పు లేదా అసలు మొత్తంలో మీరు కొంత భాగాన్ని ముందస్తుగా చెల్లించకపోతే, ఈ మొత్తం రుణ వ్యవధి అంతటా దాదాపు స్థిరంగా ఉంటుంది. ఇఎంఐ అనేది రుణ మొత్తంలోని అసలు మరియు దానిపై వడ్డీ కలయికతో వస్తుంది. లోన్ ప్రారంభ సంవత్సరాలలో వడ్డీ ఇఎంఐలో ప్రధాన భాగంగా ఉంటుంది. అయితే, ప్రతి ఇఎంఐ చెల్లింపుతో అసలు మొత్తం తగ్గుతూ ఉంటుంది కాబట్టి, ఈ నిష్పత్తి క్రమంగా కాలానుగుణంగా వెనక్కి తగ్గుతుంది.
రుణ ప్రారంభ సంవత్సరాలలో ఇఎంఐ కూర్పు
రుణాల చివరి సంవత్సరాలలో ఇఎంఐ కూర్పు
తప్పక చదవండి: లోన్ రీపేమెంట్ షెడ్యూల్ అంటే ఏమిటి మరియు అది ఎలా లెక్కించబడుతుంది?
లోన్ రీపేమెంట్ అవధి ఇఎంఐని ఎలా ప్రభావితం చేస్తుంది?
లోన్ రీపేమెంట్ అవధి మరియు మీ ఇఎంఐ మొత్తం, ఈ రెండూ విలోమానుపాతంలో ఉంటాయి. అంటే, పొందిన రుణ మొత్తం మరియు వడ్డీ రేటు వద్ద లోన్ రీపే చేయడానికి మీరు ఎంత ఎక్కువ సమయం తీసుకుంటారో, మీరు చెల్లించే ఇఎంఐ కూడా అంత తక్కువగా ఉంటుంది. అలాగే, విలోమానుపాతంలో ఉంటుంది.
ఉదాహరణకు, 30 సంవత్సరాల అవధిలో చెల్లించవలసిన రూ. 50 లక్షల హోమ్ లోన్ అంటే మీరు 9.95% వడ్డీ రేటుకు రూ. 43,694 నెలవారీ ఇఎంఐ చెల్లించవలసి ఉంటుంది . అయితే, మీరు అవధిని 20 సంవత్సరాలకు తగ్గించినట్లయితే, అంటే రుణం రీపేమెంట్ తక్కువ కాలపరిమితిలో విస్తరించబడుతుంది, మీ నెలవారీ ఇఎంఐ రూ. 48,086 కు పెరుగుతుంది :
లోన్ అవధి | ఇఎంఐ ₹@ 9.95% వడ్డీ రేటు |
---|---|
5 సంవత్సరాలు | 1,06,112 |
10 సంవత్సరాలు | 69,937 |
15 సంవత్సరాలు | 53,577 |
20 సంవత్సరాలు | 48,086 |
25 సంవత్సరాలు | 45,259 |
30 సంవత్సరాలు | 43,694 |
రీపేమెంట్ అవధి మరియు ఇఎంఐ భారం మధ్య మీరు మధ్య ఒక సమతుల్యతను ఎలా పాటిస్తారు అనేది ప్రశ్న
ఇఎంఐ భారం మరియు వడ్డీ ఖర్చుల మధ్య సమతుల్యత కోసం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు
- మీ వయస్సు: పదవీ విరమణకు ముందే మీరు మీ రుణాన్ని తిరిగి చెల్లించాలని రుణదాత కోరుకుంటారు. కాబట్టి, మీరు 20 ఏళ్ల ముగింపు లేదా 30 ఏళ్ల ప్రారంభంలో ఉన్నట్లయితే, మీ వయస్సు సుదీర్ఘమైన లోన్ అవధి పొందడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.
- ఆదాయం మరియు మిగులు: మీ ప్రస్తుత ఖర్చులు, బాధ్యతలు లెక్కించిన తర్వాత మీకు అనుకూలమైన నెలవారీ ఇఎంఐని ఎంచుకోండి. ఈ లెక్కించిన హోమ్ లోన్ ఇఎంఐ ఆధారంగా మీరు సౌకర్యవంతంగా చెల్లించవచ్చు, ఒక అవధిని ఎంచుకోవచ్చు.
- మీ జీవిత దశ: మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే మరియు మీ నెలవారీ ఖర్చులు పెరుగుతాయని ఊహించినట్లయితే, మీరు పొందగల సుదీర్ఘమైన అవధిని, తక్కువ ఇఎంఐని ఎంచుకోవడం మంచిది. మీ వద్ద మిగులు మొత్తం ఉన్నప్పుడల్లా మీరు లోన్‌ను ప్రీపే చేయవచ్చు, ఈ విధంగా మీ లోన్ రీపేమెంట్ బాధ్యతను తగ్గించుకోవచ్చు. అలాగే, మీ పదవీ విరమణ సమీపిస్తున్నట్లయితే, ఆ సమయానికి మీ లోన్ పూర్తిగా తిరిగి చెల్లించబడేలా మీ ఇఎంఐ మరియు అవధిని సర్దుబాటు చేసుకోవాలి.
- ముందస్తు చెల్లింపు నిబంధన: పరిగణలోకి తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ప్రీపేమెంట్. మీ రుణదాత అదనపు ఖర్చు లేకుండా పలుమార్లు ప్రీపేమెంట్‌ను అనుమతిస్తే, మీరు నిస్సందేహంగా దీర్ఘకాలిక అవధిని ఎంచుకోవచ్చు, మీ హోమ్ లోన్ అవధి ప్రారంభ దశలలో ఇఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే, మీ వద్ద మిగులు నిధులు ఉంటాయో అప్పుడు మీరు రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు, ఆ చెల్లింపు మీ అసలు మొత్తంలో సర్దుబాటు చేయబడుతుంది మరియు అది వేగంగా తగ్గుతుంది, తద్వారా మీ నెలవారీ ఇఎంఐ లేదా రుణ అవధి తగ్గుతుంది.
తప్పక చదవండి: మీ హోమ్ లోన్ వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి (4 సాధారణ చిట్కాలు)
ముగింపు
ఒకవేళ మీరు సుదీర్ఘమైన రుణ వ్యవధిని పొందగల యుక్త వయస్సును కలిగి ఉంటే, మీరు దాని కోసం వెళ్ళండి, ఫలితంగా తక్కువ ఇఎంఐలను చెల్లించండి. ప్రీపేమెంట్ నిబంధన చాలా మంచి ఎంపిక, ఇది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎన్నిసార్లు అయినా ప్రీపే చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మీకు తక్కువ ఇఎంఐ చెల్లించే వెసులుబాటు మాత్రమే కాకుండా, మీ వద్ద అదనంగా ఉన్నప్పుడు మీ బాధ్యతను తగ్గించుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.