మీరు ఒక లోన్ పొందినప్పుడు, నిర్దిష్ట సమయంలోగా దానిని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. మీకు తెలిసినట్లుగా, అసలు మరియు వడ్డీ అనేది నిర్ణీత వ్యవధి కోసం నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించబడుతుంది. ఇక్కడ, కస్టమర్లు వారి ఇన్‌స్టాల్‌మెంట్ షెడ్యూల్‌ను స్పష్టంగా వివరించే కొన్ని రకాల చార్టులను కలిగి ఉండటం అవసరమే కదా?
అవును, తప్పకుండా అవసరమే. ఇక్కడే లోన్ రీపేమెంట్ షెడ్యూల్ విధానం పనిచేస్తుంది. సరళంగా చెప్పాలంటే, రీపేమెంట్ షెడ్యూల్ అనేది ఒక చార్ట్ లేదా గ్రాఫ్. ఇది మీరు సాధారణ వాయిదాల్లో హోమ్ లోన్‌ను ఎలా తిరిగి చెల్లిస్తారనే వివరాలను తెలియజేస్తుంది. ఈ వాయిదాలను సాధారణంగా ఇఎంఐలుగా సూచిస్తారు, వీటిలో బకాయి ఉన్న అసలు మొత్తం మరియు వడ్డీ భాగం ఉంటుంది.
ప్రత్యామ్నాయంగా, ఈ షెడ్యూల్‌ను ఎమార్టైజేషన్ చార్ట్ లేదా టేబుల్ అని కూడా పిలుస్తారు.
రుణ విమోచన పట్టిక అంటే ఏమిటి?
హోమ్ లోన్ చెల్లింపు షెడ్యూల్ అనేది రుణ విమోచన పట్టిక లేదా రుణ విమోచన షెడ్యూల్‌లో వివరించబడింది, దీనిని రుణదాత, రుణగ్రహీతతో పంచుకుంటారు. రుణ విమోచనం అనేది లోన్ కాలపరిమితిలో అసలు మరియ వడ్డీని నెలవారీగా విభజించడం. ఈ పట్టికను రూపొందించడానికి సాధారణంగా లోన్ అమార్టైజేషన్ క్యాలిక్యులేటర్ ఉపయోగించబడుతుంది. లోన్ వ్యవధి మరియు వడ్డీ రేటుపై ఆధారపడి రుణగ్రహీత నెలవారీ ఇఎంఐలను అసలు మరియు వడ్డీ చెల్లింపులను ఎలా తీరుస్తుందో చూడవచ్చు.
సాధారణంగా, మీ లోన్ రీపేమెంట్ షెడ్యూల్‌లో ఈ కింది సమాచారం ఉంటుంది:
- వాయిదా క్రమ సంఖ్య
- ప్రతి ఇఎంఐ చెల్లింపు గడువు తేదీని కలిగి ఉంటుంది, ఇది రీపేమెంట్ షెడ్యూల్‌ను తగ్గిస్తుంది
- హోమ్ లోన్ గురించి ప్రాథమిక సమాచారం
- ప్రారంభ అసలు మొత్తం, ఇది ప్రతి నెల ప్రారంభంలో వసూలు చేయదగిన వడ్డీ మొత్తాన్ని సూచిస్తుంది
- ముగింపు అసలు మొత్తం, ఇది ఇఎంఐ చెల్లించిన తర్వాత మిగిలిన అసలు మొత్తాన్ని సూచిస్తుంది
- వడ్డీ రేటు భాగం
హోమ్ లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ఎందుకు ముఖ్యమైనది?
అవును, ఒక హోమ్ లోన్ రీపేమెంట్ షెడ్యూల్‌ను కలిగి ఉండటం అనేది రుణదాతతో పాటు రుణగ్రహీత ఇద్దరూ మునుపటి మరియు రాబోయే వాయిదాలను ట్రాక్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. అదనంగా, ఇది అవధిలో ఏ సమయంలోనైనా బాకీ ఉన్న బ్యాలెన్స్ లేదా వడ్డీ గురించి స్పష్టమైన వివరాలను కూడా ఇస్తుంది.
ఆసక్తికరంగా, మీరు ఒక రుణ విమోచన షెడ్యూల్‌ను తెలుసుకోవడానికి హోమ్ లోన్ పొందాల్సిన అవసరం లేదు. పిఎన్‌బి హౌసింగ్ లాంటి కొందరు రుణదాతలు మాత్రమే హోమ్ లోన్ పొందే ప్రారంభ దశల్లో, అనగా హోమ్ లోన్ ఇఎంఐని లెక్కించే సమయంలో షెడ్యూల్‌ను చెక్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తారు. దీంతో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది: హోమ్ లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ఎలా లెక్కించబడుతుంది?? దాని గురించి తెలుసుకుందాం.
తప్పక చదవండి: మీ హోమ్ లోన్ అర్హతను ఎలా మెరుగుపరచుకోవాలి?
హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో లోన్ రీపేమెంట్ షెడ్యూల్‌ను ఎలా లెక్కించాలి
పిఎన్‌బి హౌసింగ్ లాంటి రుణదాతల నుండి హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్, ఇఎంఐ లెక్కింపులను చాలా సులభతరం చేస్తుంది మరియు దరఖాస్తుదారులకు సులభంగా హోమ్ లోన్ రీపేమెంట్ షెడ్యూల్ తెలుసుకునేందుకు అనుమతిస్తుంది. ఈ ఇఎంఐ క్యాలిక్యులేటర్ టూల్ సహాయంతో రీపేమెంట్ షెడ్యూల్ అంచనా వేయబడుతుంది. అంతేకాకుండా, ఒక నిర్దిష్ట రుణ మొత్తం, రుణం అవధి మరియు వడ్డీ రేటు వివరాలతో సాధ్యమైన ఇఎంఐని లెక్కించడం అనేది కాలానుగుణ పద్ధతిలో మీరు దానిని ఎలా తిరిగి చెల్లించాలో అనే విషయాన్ని తెలియజేస్తుంది.
అందువల్ల, ఒక హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మీ ఇఎంఐలు, పూర్తి హౌస్ లోన్ చెల్లింపు మరియు వడ్డీ చెల్లింపు షెడ్యూల్‌ను ఒకేసారి అంచనా వేసే ఒక సమర్థవంతమైన మరియు సరళమైన ఆన్‌లైన్ సాధనం.
ఒక హౌస్ లోన్ కోసం ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?? ఇది నమోదు చేసిన అసలు మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు ఆధారంగా ఇఎంఐని, అలాగే దాని రీపేమెంట్ షెడ్యూల్ లెక్కించేందుకు ఒక ఫార్ములాను ఉపయోగిస్తుంది:
E = [P x R x (1+R)N ]/[(1+R)N-1], అయితే:
p = అసలు రుణ మొత్తం
r = నెలవారీ వడ్డీ రేటు అంటే, 12 ద్వారా విభజించబడిన వడ్డీ శాతం
t = మొత్తం హోమ్ లోన్ వ్యవధి నెలల్లో
e = హోమ్ లోన్ ఇఎంఐ
కానీ, ఇంటితో లెక్కలు ఆగవు. ఈ ఫార్ములా మనకు నెలవారీ ఇఎంఐని అందిస్తుంది. కానీ, ఒక లోన్ అమార్టైజేషన్ షెడ్యూల్ అనేది ఇఎంఐలో ఏ భాగం అసలు మొత్తానికి వెళ్తుంది మరియు ఏది వడ్డీ రూపంలోకి వెళ్తుంది అనేది వివరిస్తుంది. దీనిని లెక్కించడానికి, ఈ కింది సూత్రాన్ని ఉపయోగించవచ్చు:
అసలు చెల్లింపు = ఇఎంఐ – [బాకీ ఉన్న హోమ్ లోన్ బ్యాలెన్స్ x నెలవారీ వడ్డీ రేటు]
ఉదాహరణకు, 50 లక్షల రుణ మొత్తం, 30-సంవత్సరాల అవధి, 6% వడ్డీ రేటు మరియు 29,978 ఇఎంఐని పరిశీలిద్దాం. పైన పేర్కొన్న ఫార్ములాను ఉపయోగించి, మనం మొదటి ఇఎంఐ చెల్లింపు వివరాలను తెలుసుకోవచ్చు.
1 నెల కోసం అసలు చెల్లింపు = 29,978 – (5000000 x 6%/12) = 4,978
అదేవిధంగా, 1 నెల కోసం వడ్డీ భాగం 29,978 – 4,978 అంటే, 25,000 అయి ఉంటుంది.
ఇదే తరహాలో, మీరు పైన పేర్కొన్న ఫార్ములాను ఉపయోగించి మిగిలిన నెలల కోసం అసలు చెల్లింపు మరియు వడ్డీ భాగాలను లెక్కించవచ్చు. మీరు గమనించినట్లయితే, ఇది మీకు ఒక రకమైన పట్టికను చూపిస్తుంది. ఇందులో మీ ఇఎంఐ యొక్క అసలు భాగం పెరుగుతూనే ఉంటుంది మరియు వడ్డీ భాగం తగ్గుతూనే ఉంటుంది.
పిఎన్‌బి హౌసింగ్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అదే లెక్కింపు సూత్రాలను ఉపయోగించి మీ అమార్టైజేషన్ షెడ్యూల్‌లో సంవత్సరం వారీగా వివరాలను అందిస్తుంది.
ముగింపు
ఇప్పుడు మీకు హోమ్ లోన్ రీపేమెంట్ షెడ్యూల్ గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఏది మీకు మెరుగైన రుణ విమోచనను అందిస్తుందోనని మీరు ఆలోచిస్తుండవచ్చు - తక్కువ అవధి లేదా ఎక్కువ అవధి?
సహజంగా లోన్ అవధి ఎంత తక్కువగా ఉంటే, మీ రుణ విమోచన షెడ్యూల్ అంత తక్కువగా ఉంటుంది. ఈ విధంగా, మీరు హోమ్ లోన్‌లో వడ్డీ భాగాన్ని ఆదా చేసుకోగలుగుతారు. అయితే, మీరు చెల్లించే ఇఎంఐ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే, సుదీర్ఘ రుణ విమోచన షెడ్యూల్ అంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ భాగం అని అర్థం.
అయితే, మీ నెలవారీ ఇఎంఐ మరింత సరసమైనదిగా ఉంటుంది. మీరు లోన్ అవధి సమయంలో లోన్ ప్రీపే చేయడాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇది అవధి లేదా మీ ఇఎంఐలను తగ్గిస్తుంది మరియు లోన్ మొత్తం ఖర్చును కూడా తగ్గిస్తుంది. కాబట్టి, మీరు మీ ఆర్థిక ప్రణాళికను బట్టి ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు.
లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ఎలా పనిచేస్తుంది లేదా మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, పిఎన్‌బి హౌసింగ్ వద్ద మా కస్టమర్ సపోర్ట్ బృందాన్ని సంప్రదించేందుకు సంకోచించకండి!