ఈ రోజుల్లో హోమ్ లోన్ ప్రదాతలకు ఎలాంటి కొరత లేదు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మరియు ఎన్‌బిఎఫ్‌సిలు వారి హోమ్ లోన్ సేవలను నిరంతరం అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి, ఇది వినియోగదారులను ఎంపికలో తరచుగా గందరగోళానికి గురి చేస్తుంది. అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నందున, కేవలం వడ్డీ రేటు ఆధారంగా హోమ్ లోన్ ప్రదాతలను ఎంచుకోవాల్సి వస్తుంది. వడ్డీ రేటు ఆధారంగా ఎంచుకోవడం వల్ల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి: ఇది ప్రొవైడర్ల మధ్య పోల్చదగినది, ఇది కస్టమర్లకు ఆర్థిక సంస్థలను సమానంగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది మరియు ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుంది; వడ్డీ రేటు మీరు చివరికి ఎంత డబ్బు తిరిగి చెల్లించాలో నిర్ణయిస్తుంది.
కానీ, అతి తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్ ప్రొవైడర్‌ను ఎంచుకోవడం అనేది వివేకవంతమైన నిర్ణయం కాకపోవచ్చు. హోమ్ లోన్లు సాధారణంగా గొప్ప ఆర్థిక నిబద్ధతలతో వస్తాయి, లక్షలాది రూపాయలు ఉంటాయి, సంవత్సరాలకు సంవత్సరాలు కొనసాగుతాయి. అందువల్ల, కస్టమర్లు హోమ్ లోన్ భాగస్వామిని నిర్ణయించేటప్పుడు ఇతర అంశాలను పరిశీలించడం మంచిది.
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు:
1. లోన్ కాలం:
లోన్ అవధి లేదా మీరు రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి అనేది ప్రతి ఆర్థిక సంస్థకు మారుతుంది. తక్కువ వ్యవధి అంటే తక్కువ మొత్తం ఖర్చు, కానీ, అధిక నెలవారీ ఇఎంఐలు కూడా. సాధారణంగా దీర్ఘకాలిక అవధిని అందించే ఒక ఆర్థిక సంస్థను ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే, ఇది మీ ఇతర అవసరాల కోసం అధిక డిస్పోజల్ ఆదాయంతో మీకు నెలవారీ భారాన్ని తగ్గిస్తుంది.
తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం రీపేమెంట్ వ్యవధి ఎంత?
2. ఫిక్స్‌డ్ రేటు లేదా ఫ్లోటింగ్ రేటు:
హోమ్ లోన్లు సాధారణంగా పంపిణీ చేయడానికి ముందు నిర్ణయించిన ఫిక్స్‌డ్ రేటును కలిగి ఉండవచ్చు లేదా వడ్డీ రేట్లకు అనుగుణంగా మారే ఫ్లోటింగ్ రేటును కలిగి ఉండవచ్చు. రుణాన్ని తీసుకునేటప్పుడు తక్కువగా కనిపించే ఫ్లోటింగ్ రేటు, రుణాన్ని పూర్తిగా చెల్లించే సమయానికి మరింత ఖరీదైనదిగా మారడం సాధ్యమే. కస్టమర్లు ఫిక్స్‌డ్ రేటు లోన్ లేదా ఫ్లోటింగ్ రేటు లోన్ ఈ రెండింటిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు వడ్డీ రేటు మార్పులను అధ్యయనం చేయడం మంచిది.
3. అర్హత మరియు రుణ మొత్తం:
వేర్వేరు హోమ్ లోన్ ప్రొవైడర్ల మధ్యన గరిష్ఠ అర్హత మొత్తంలో మార్పులు ఉండవచ్చు. మీ ఆర్థిక అవసరాలను తీర్చే రుణాన్ని ఎంచుకోవడం మంచిది. నిజానికి ఇది వివిధ సంస్థల నుండి రుణం తీసుకోవడానికి ముందుగా ఎక్కువ డబ్బును సేకరించేందుకు, అలాగే, తక్కువ ధర గల రుణాన్ని ఎంచుకోవడానికి సహాయపడగలదు. మీ భార్య, తల్లిదండ్రులు లేదా కుమారుడు లాంటి వాళ్లను సహ-దరఖాస్తుదారుగా కలుపుకొని మీ అర్హతను గణనీయంగా పెంచుకోవచ్చు.
4. ప్రీపేమెంట్ పాలసీలు:
నియంత్రణ సంస్థ ఈ పాలసీలను విస్తృతంగా నియంత్రిస్తుంది. కొందరు హోమ్ లోన్ ప్రదాతలు, రుణగ్రహీతలను వారి రుణ మొత్తాలను ముందస్తుగా చెల్లించేందుకు అనుమతించరు లేదా రుణగ్రహీతలు వారి రుణాలను గడువు తేదీకి ముందే చెల్లించాలని ఎంచుకుంటే జరిమానా విధిస్తారు. ఇది రుణగ్రహీతలకు రుణ కాలపరిమితిలో ఊహించని నగదు ప్రవాహాన్ని ఎదుర్కోవాల్సి వస్తే నష్టాన్ని కలిగిస్తుంది. వారు తమ రుణాలను ముందస్తుగా చెల్లించలేరు, అలాగే, రుణ మొత్తం వ్యవధి కోసం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొందరు రుణదాతలు రుణగ్రహీతలను వారి రుణాలను తిరిగి చెల్లించేందుకు వీలు కల్పిస్తారు, ఉదాహరణకు, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి సంస్థలు రుణగ్రహీతలకు కొన్ని షరతులకు లోబడి, వారి రుణాలను ముందస్తుగా చెల్లించేందుకు వీలు కల్పిస్తాయి.
5. కస్టమర్ ఫ్రెండ్లీ ఫీచర్లు:
ఇప్పుడు వేర్వేరు ఫీచర్లతో రుణాలను అందించే కంపెనీల మధ్యన గొప్ప వైవిధ్యం ఉంది. కొన్ని ఆర్థిక సంస్థలు మొబైల్ యాప్‌లు మరియు సమర్థవంతులైన కస్టమర్ ప్రతినిధులను కలిగి ఉంటాయి ; ఇతరులు దశాబ్దాలుగా మారని రుణ ప్రక్రియలను కలిగి ఉన్నారు. సమకాలీన సేవా ప్రదాతలు ఇంటి సౌకర్యంలో సేవలను అందిస్తారు, కస్టమర్లకు అనేక మార్గాలలో భౌతికంగా మరియు డిజిటల్ విధానంలో సంప్రదింపు వెసులుబాటును, లోన్ అకౌంట్ సమాచారం, ఐటి సర్టిఫికెట్లు మరియు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను కేవలం ఒక క్లిక్ పై అందిస్తారు. హోమ్ లోన్ ప్రొవైడర్‌తో మీ సంబంధం సంవత్సరాల పాటు కొనసాగుతుంది, కావున, ఇలాంటి ఫీచర్లపై వివిధ కంపెనీలు ఎలా రేట్ చేస్తాయో తెలుసుకోవడం ఉత్తమం.
6. ప్రోడక్ట్ ఫీచర్స్:
జీతం పొందే కస్టమర్లపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే ఆర్థిక సంస్థలు కూడా ఉన్నాయి, ఎందుకంటే అవి తక్కువ రిస్క్ పరిధిలో ఉంటాయి. అయితే, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి సంస్థలు ఉన్నాయి, ఇవి జీతం పొందేవారికి మరియు స్వయం-ఉపాధిగల వారికి వేర్వేరు ఫీచర్లతో ప్రోడక్టులను అందిస్తాయి. వారు స్వయం-ఉపాధిగల వ్యక్తుల నిజమైన ఆదాయాన్ని అంచనా వేసేలా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసారు, తదనుగుణంగా వారి అంచనాను కొనసాగిస్తారు. దీంతో పాటు, కస్టమర్ రుణ మొత్తానికి పూర్తి అర్హతను పొందకపోతే, ఆర్థిక సంస్థలు మీ ప్రస్తుత లోన్ల పై టాప్-అప్ సదుపాయాన్ని అందిస్తాయి.
తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం అవసరమైన కనీస డౌన్ పేమెంట్ ఎంత?
7. పాన్-ఇండియా నెట్‌వర్క్:
పాన్-ఇండియా నెట్‌వర్క్ గల సంస్థను ఎంచుకోవడానికి ఇది మరొక కారణం. ఒక హోమ్ లోన్ తిరిగి చెల్లించడానికి 30 సంవత్సరాల సమయం పట్టవచ్చు మరియు ఈ కాలంలో రుణగ్రహీతలు నగరాలను మార్చే అవకాశం ఉంది. భారతదేశ వ్యాప్తపు ఉనికిని కలిగి ఉన్న ఒక ఆర్థిక సంస్థను ఎంచుకోవడం వల్ల జీవితంలో మీరు ఎక్కడికి వెళ్లినా, మీ రుణ సంస్థను మీరు సులభంగా సంప్రదించవచ్చు. అలాగే, మీరు మీ లోన్ అకౌంట్ కోసం ఇంటర్ బ్రాంచ్ యాక్సెస్ ఉందో లేదో తెలుసుకోవడానికి మీ ఆర్థిక భాగస్వామి వద్ద చెక్ చేయాలి, అంటే, మీకు మీ హోమ్ బ్రాంచ్‌ను మార్చడానికి అనుమతి ఉందా లేదా ఎలాంటి ఆంక్షలు లేకుండా మరొక లొకేషన్ నుండి మీ అకౌంటును నిర్వహించవచ్చో లేదో తెలుసుకోండి.
8. నమ్మకం మరియు విశ్వసనీయత:
మరియు హోమ్ లోన్ అనేది ఒక దీర్ఘకాలిక సంబంధం, సాధారణంగా ఒక రుణాన్ని తిరిగి చెల్లించడానికి 30 సంవత్సరాలు పట్టవచ్చు. కావున, మీరు నమ్మదగిన ఒక కంపెనీ మరియు విశ్వసనీయమైన బ్రాండ్‌ను ఎంచుకోవడం ఉత్తమం. దీనివల్ల మీరు రుణాన్ని చెల్లించిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా మీ ఇంటి డాక్యుమెంట్లను తిరిగి పొందవచ్చు, అలాగే, హోమ్ లోన్ వడ్డీ రేట్లు మరియు చెల్లింపులకు సంబంధించిన మీ వ్యవహారాలు కూడా న్యాయమైనవిగా ఉంటాయి. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ 30 ఏళ్లుగా హోమ్ లోన్లు అందిస్తోంది. 2016 లో ఈ కంపెనీ బిఎస్ఇ, ఎన్ఎస్ఇలలో లిస్ట్ అయింది. మీరు ఇక్కడ వారి హోమ్ లోన్స్ గురించి మరింత తెలుసుకోవచ్చు.