PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ గురించి మీరు ఏమి తెలుసుకోవాలి? 

give your alt text here

హోమ్ లోన్ అనేది మీ జీవితకాలంలో చేసే అత్యంత ముఖ్యమైన ఆర్థిక పెట్టుబడి మరియు ఇది భావోద్వేగ నిబద్ధతలలో కూడినది. అయితే, ముఖ్యంగా హోమ్ లోన్ కొన్ని ఆర్థిక చిక్కులతో వస్తుంది, హోమ్ లోన్ అప్లికేషన్ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా అవసరమవుతాయి. లోన్ ప్రయాణం కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉండడానికి దరఖాస్తుదారు అన్ని హోమ్ లోన్ డాక్యుమెంట్ల ప్రాముఖ్యతను, అందులోని విషయాలు మరియు వాటి పరిణామాలను గురించి బాగా తెలుసుకోవాలి.

హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ అంటే ఏమిటి?

హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ అన్ని హోమ్ లోన్ డాక్యుమెంట్లలో కెల్ల ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పేరు సూచిస్తున్నట్లుగా హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ అనేది రుణదాత పరస్పరం అంగీకరించిన నిబంధనలు మరియు షరతులపై మీ లోన్‌ను మంజూరు చేసేందుకు వారి అంగీకారాన్ని తెలిపే ఒక అధికారిక ప్రకటన.

కాబట్టి, మొత్తం హోమ్ లోన్ ప్రాసెస్‌లో హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ పాత్ర ఏమిటి? మీరు ఆ లెటర్ గురించి ఏమి తెలుసుకోవాలి? ఒకసారి చూద్దాం.

హౌసింగ్ లోన్ శాంక్షన్ లెటర్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు

1. హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ అనేది లోన్ అగ్రిమెంట్ కాదు

ఉదాహరణకు, మీరు పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ పొందినట్లయితే, మీకు లోన్ మొత్తం కేటాయించబడిందని అర్థం కాదు. లోన్ శాంక్షన్ లెటర్ అనేది మీ లోన్ అభ్యర్థన ఆమోదించబడిందని పేర్కొంటూ రుణదాత నుండి అందుకునే ఒక డాక్యుమెంట్. ఇది హోమ్ లోన్ మంజూరు ప్రక్రియ పూర్తయిన తర్వాత, లోన్ అగ్రిమెంట్ మీకు అందించడానికి ముందు జారీ చేయబడుతుంది. కాబట్టి, ఈ లెటర్ మీకు ఎలా సహాయపడుతుంది?

ఒక సంస్థలో చేరడానికి ముందు మీరు పొందే ఆఫర్ లెటర్‌గా దీనిని ఊహించుకోండి. హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ రుణదాత లోన్ అర్హతను నెరవేర్చడంలో మీకు ఒక రుజువుగా పనిచేస్తుంది మరియు మంజూరు చేసిన హోమ్ లోన్ మొత్తం, వడ్డీ రేటు, లోన్ రీపేమెంట్ అవధి, అంచనా వేయబడిన ఇఎంఐ మరియు మరిన్ని ముఖ్యమైన వివరాలు ఇందులో ఉంటాయి. మీరు హోమ్ లోన్ శాంక్షన్ లెటర్‌ను అందుకున్నప్పుడు, ఇది మీ లోన్ మొత్తం ఆమోదించబడిందని, కానీ, లోన్ పంపిణీ ఇంకా జరగాల్సి ఉందని తెలియజేస్తుంది.

2. ఇది అనేక వివరాలను కలిగి ఉంది, వాటిలో ఇవి ఉంటాయి

కాబట్టి, హోమ్ లోన్ శాంక్షన్ లెటర్‌లో ఏముంటుంది? సరళంగా చెప్పాలంటే, ఇందులో మీ రుణదాత మీకు అందించే లోన్ అగ్రిమెంట్ సంబంధిత అన్ని ముఖ్యమైన వివరాలు ఉంటాయి. హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ యొక్క ముఖ్యమైన భాగాల్లో ఇవి ఉంటాయి:

  • మంజూరు చేయబడిన పూర్తి హోమ్ లోన్ మొత్తం
  • లోన్ రీపేమెంట్ అవధి
  • హోమ్ లోన్ వడ్డీ రేటు అందించబడింది
  • లోన్ రీపేమెంట్ విధానం
  • లెటర్ చెల్లుబాటు
  • ఇఎంఐ వివరాలు, మొదలైనవి.
  • ఇతర ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు

మీరు లెటర్‌లో పేర్కొన్న ఇఎంఐని దీనితో డబుల్-చెక్ చేయవచ్చు:‌ హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్. ఒక హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ మీరు అడిగిన అన్ని నిబంధనలు మరియు షరతులను మీకు ఇవ్వలేదని గుర్తుంచుకోండి. అందువల్ల, మీరు లెటర్‌లోని నిబంధనలను అంగీకరించాలా, వాటిని తిరిగి చర్చించాలా లేదా మంచి హోమ్ లోన్ వడ్డీ రేట్లు కోసం వాటిని వదులుకోవాలా అనేది మీ ఇష్టం.

3. హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ పొందడానికి మీకు అనేక డాక్యుమెంట్లు అవసరం

లోన్ మంజూరు లెటర్‌ను అందజేయడానికి ముందు రుణదాతలు, మీ హోమ్ లోన్ అభ్యర్థన ప్రక్రియను పూర్తి చేయడానికి వివిధ హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ సాధనాలు మరియు పద్ధతులను ఉపయోగిస్తారు. అందువల్ల, మీ నుండి హోమ్ లోన్ డాక్యుమెంట్లు అవసరం లో ఇవి కూడా ఉంటాయి:

  • పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ మొదలైనటువంటి కెవైసి డాక్యుమెంట్లు.
  • గత 6-12 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు
  • జీతం పొందే దరఖాస్తుదారుల కోసం ఇటీవలి జీతం స్లిప్‌లు లేదా ఫారం 16
  • స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారుల కోసం గత మూడు సంవత్సరాల వ్యాపారం మరియు ఆదాయపు పన్ను రిటర్న్స్ రుజువు.

అవసరమైన డాక్యుమెంట్ల స్వభావం రుణదాత నుండి రుణదాతకు కొద్దిగా మారుతుందని గమనించగలరు. మీ లోన్ అప్లికేషన్‌ సబ్మిషన్, అవసరమైన డాక్యుమెంట్ల విజయవంతమైన ధృవీకరణ తర్వాత, రుణదాత మీకు ఆమోదం తెలపడానికి లోన్ శాంక్షన్ లెటర్‌ను అందజేస్తారు.

తప్పక చదవండి: మీ హోమ్ లోన్ వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి (4 సాధారణ చిట్కాలు)

4. హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ పొందడానికి 7-10 రోజులు పట్టవచ్చు

ఒక హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ ముఖ్యంగా ఒక విజయవంతమైన హోమ్ లోన్ అప్లికేషన్‌ను సూచిస్తుంది. మీకు తెలిసినట్లుగా, ఒక హోమ్ లోన్ అప్రూవల్ అనేక ధృవీకరణలు మరియు తనిఖీలకు లోబడి ఉంటుంది; స్వయం-ఉపాధిగల లేదా వ్యాపార యజమానులకు మొత్తం ప్రాసెస్ నాలుగు వారాల వరకు ఉండవచ్చు మరియు జీతం పొందే ఉద్యోగులకు 7-10 రోజులు మాత్రమే పడుతుంది. ఈ ప్రక్రియలో కెవైసి వివరాలు, ఆదాయం, క్రెడిట్ మరియు ఫైనాన్షియల్ హెల్త్ డాక్యుమెంట్లను ధృవీకరించడం ఉంటుంది. అదనంగా, రుణదాత మీ ఆస్తి యొక్క ప్రస్తుత మరియు ప్రశంసనీయ విలువను కూడా మూల్యాంకన చేస్తారు.

ఈ అంశాలన్నీ రుణదాతకు మీ లోన్ నిబంధనలను ఖరారు చేయడంలో సహాయపడతాయి మరియు వాటిని 3-4 వారాలలో మీతో శాంక్షన్ లెటర్ రూపంలో పంచుకోవడానికి సహాయపడతాయి. మీరు సంతృప్తి చెందినట్లయితే, మరిన్ని డాక్యుమెంట్లను అందించి ముందుకు సాగవచ్చు మరియు లోన్ పంపిణీ ప్రక్రియతో కొనసాగవచ్చు. చాలా మంది రుణదాతలు హోమ్ లోన్ దరఖాస్తుదారులకు డిజిటల్ లోన్ శాంక్షన్ లెటర్‌ను అందిస్తారు.

5. హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ ఆరు నెలల వరకు చెల్లుతుంది

నిబంధనలను అంగీకరించే ముందు మీరు హోమ్ లోన్ శాంక్షన్ లెటర్‌ ఎంత కాలం చెల్లుతుందోనని ఆలోచిస్తున్నట్లయితే, దానికి సమాధానం సాధారణంగా ఆరు నెలలు. చెల్లుబాటు తేదీ తరచుగా లెటర్‌లో పేర్కొనబడుతుంది. నిర్దేశించిన వ్యవధి గడువు ముగిసిన తర్వాత, మీరు అవే నిబంధనలపై రుణదాత నుండి హోమ్ లోన్ పొందలేరు. మీరు తిరిగి ప్రారంభం నుండి హోమ్ లోన్ కోసం అప్లై చేయాలి. అందువల్ల, ఈ తేదీని తెలుసుకోవడం, తదనుగుణంగా మీ మిగిలిన హోమ్ లోన్ ప్రక్రియను ప్లాన్ చేసుకోవడం అవసరం.

ముగింపు

ఇలాంటి ముఖ్యమైన వివరాలతో కూడిన హోమ్ లోన్ శాంక్షన్ లెటర్, అవాంతరాలు లేకుండా ఇంటిని కొనుగోలు చేయాలనే ఏ దరఖాస్తుదారుని కోసం అయినా చాలా ముఖ్యమైనది. అందువల్ల, అన్ని వివరాలను చాలా జాగ్రత్తగా చదవండి.

పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ ప్రక్రియ ప్రతి దశలో అత్యంత పారదర్శకంగా ఉంటుంది. మీరు ఒక దరఖాస్తుదారుగా, మీ శాంక్షన్ లెటర్ నిబంధనలు లేదా ఇతర సందేహాలను తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ మా ప్రతినిధులను సంప్రదించవచ్చు. మరింత తెలుసుకోవడానికి పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్‌ను సందర్శించండి.

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్