ఇంటిని కొనుగోలు చేయడం అనేది మీరు మీ జీవితకాలంలో తీసుకునే అత్యంత ముఖ్యమైన మరియు ప్రముఖ నిర్ణయాలలో ఒకటి. పరిశోధన, అప్లికేషన్, డాక్యుమెంట్లు మరియు మీరు ఎంచుకున్న రుణదాత నుండి మీ హోమ్ లోన్ గురించిన అన్ని విషయాలు పరిపూర్ణంగా ఉండాలి. తర్వాత ఏవైనా ఆశ్చర్యాలను నివారించడానికి, మొత్తం హోమ్ లోన్ ప్రాసెస్ గురించి తగిన పరిశోధన మరియు జ్ఞానం ఉత్తమ మార్గాలు.
మీరు ఇప్పటికీ పరిశోధన దశలో ఉన్నట్లయితే మరియు హోమ్ లోన్ పంపిణీ ప్రక్రియ గురించి విస్తృతమైన సమాచారం తెలుసుకోవాలని అనుకుంటే ఈ పోస్ట్‌ను వెంటనే బుక్‌మార్క్ చేయండి.
ఒక హోమ్ లోన్ పంపిణీ అనేది ఒక దశలవారీ ప్రక్రియ మరియు దరఖాస్తు ఆరంభం నుండి అనేక దశలను కలిగి ఉంటుంది. సాంకేతికంగా, ఇది మీ హోమ్ లోన్ ప్రక్రియలో చివరి దశ మరియు ఇందులో మీ రుణదాత చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రుణ మొత్తాన్ని మీకు అందజేస్తారు. లోన్ అప్లికేషన్ విజయవంతంగా స్క్రీన్ చేయబడి ఆమోదించబడిన తర్వాత హోమ్ లోన్ పంపిణీ జరుగుతుంది. ఆస్తి, డాక్యుమెంట్లు మరియు డౌన్ పేమెంట్ యొక్క క్షుణ్ణమైన సాంకేతిక మూల్యాంకన తర్వాత మాత్రమే మీ రుణదాత ఆ మొత్తాన్ని పంపిణీ చేస్తారు అని గుర్తుంచుకోండి.
అలాగే, రుణ పంపిణీలో అనేక దశలు ఉంటాయి. అందువల్ల, హోమ్ లోన్ పంపిణీ ప్రక్రియ గురించి వివరాలను తెలుసుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో ఇబ్బందులను నివారించవచ్చు. మంచి ఆలోచన కదా!
మొదట, మీ హోమ్ లోన్ పంపిణీ దశలు ప్రారంభించడానికి ముందు జరిగే ప్రక్రియల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
హోమ్ లోన్ పంపిణీ చేయడానికి ముందు ఉండే దశలు
రుణ పంపిణీకి ముందు రెండు ప్రక్రియలు ఉన్నాయి - దరఖాస్తు మరియు మంజూరు.
- దరఖాస్తు: హోమ్ లోన్ అప్లికేషన్ దశ అనేది మీరు రుణదాత యొక్క హోమ్ లోన్ దరఖాస్తు ఫారం నింపి అవసరమైన కెవైసి మరియు హోమ్ లోన్ డాక్యుమెంట్లతో పాటు దానిని సబ్మిట్ చేసే ప్రారంభ దశ. మీరు వారి బ్రాండ్ ప్రఖ్యాతి, వడ్డీ రేట్లు, రీపేమెంట్ నిబంధనలు, కస్టమర్ సర్వీస్ మరియు ఇతర అంశాలను పోల్చిన తర్వాత రుణదాతను జాగ్రత్తగా మరియు తెలివిగా ఎంచుకోవాలి. ఎంచుకున్న రుణదాత ఆధారంగా మీ హోమ్ లోన్ దరఖాస్తు కోసం అవసరమైన హోమ్ లోన్ డాక్యుమెంట్లు మారుతుంటాయి. అయితే, ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రామాణిక డాక్యుమెంట్లు కెవైసి డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆదాయపు పన్ను రిటర్న్స్, ఆదాయ రుజువు డాక్యుమెంట్లు, ఆస్తి డాక్యుమెంట్లు, సేల్ అగ్రిమెంట్, క్రెడిట్ స్కోర్ మరియు మరిన్ని. ఈ డాక్యుమెంట్ల సంపూర్ణత మరియు సరైనత మీ హోమ్ లోన్ దరఖాస్తు విజయవంతం అవ్వడానికి చాలా ముఖ్యం.
- మంజూరు: తరువాత, మీ హోమ్ లోన్ అప్లికేషన్ స్క్రీన్ చేయబడే, మూల్యాంకన చేయబడే మరియు మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి తనిఖీ చేయబడే ప్రక్రియ ఉంటుంది. మీ ఆదాయం, క్రెడిట్ యోగ్యత, ఆస్తి మరియు మరెన్నో ఆధారంగా మీకు ఒక హోమ్ లోన్ మంజూరు చేసే యోగ్యతను మీ రుణదాత నిర్ణయిస్తారు. దీనిలో మీ ఆస్తి, తిరిగి చెల్లించే సామర్థ్యం మొదలైన వాటి సునిశితమైన, నిపుణుల చేత చేయబడే చట్టపరమైన మరియు సాంకేతికత మూల్యాంకన ఉంటాయి.
డిజిటైజేషన్ వలన రుణం ఆన్‌బోర్డింగ్, ధృవీకరణ, అంచనా మొదలైన వాటితో సహా ఇందులో అనేక ప్రక్రియలు అవాంతరాలు లేకుండా వేగంగా మరియు సులభంగా మారాయి. మీ రుణదాత సంతృప్తి చెందిన తర్వాత, మీరు విశ్రాంతి తీసుకోవచ్చు మరియు మీ రుణం ఆమోదం కోసం వేచి ఉండవచ్చు. తరువాత, మీరు రుణ మొత్తాన్ని అందుకునే తుది దశకి వెళ్తాము: హోమ్ లోన్ పంపిణీ ప్రక్రియ.
దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
తప్పక చదవండి: ఒక హోమ్ లోన్ రుణదాతను ఎలా ఎంచుకోవాలి
హోమ్ లోన్ పంపిణీ - ప్రక్రియ
సాధారణంగా హోమ్ లోన్ పంపిణీ ప్రక్రియలో మూడు విస్తృత దశలు ఉన్నాయి.
-
- పంపిణీ కోసం అభ్యర్థన
రుణ పంపిణీ కోసం కస్టమర్లు ఆర్థిక సంస్థకు ఒక అభ్యర్థనను చేయాలి. అదే సమయంలో, సేల్ అగ్రిమెంట్, ఆస్తి కోసం యాజమాన్య గొలుసు మొదలైనటువంటి డాక్యుమెంట్లను ఆస్తి రకాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవాలి. 2 ముఖ్యమైన సందర్భాలు ఉండవచ్చు:
డెవలపర్ నుండి నేరుగా అలాట్‌మెంట్: ఇక్కడ డాక్యుమెంటేషన్‌లో అలాట్‌మెంట్ లెటర్, చెల్లింపు రసీదు, డిమాండ్ లెటర్, పోస్ట్-డేటెడ్ చెక్కులు మొదలైనవి ఉంటాయి.- డెవలపర్ నుండి నేరుగా అలాట్‌మెంట్: ఇక్కడ డాక్యుమెంటేషన్‌లో అలాట్‌మెంట్ లెటర్, చెల్లింపు రసీదు, డిమాండ్ లెటర్, పోస్ట్-డేటెడ్ చెక్కులు మొదలైనవి ఉంటాయి.
- రెడీ/రీసేల్ ఆస్తి: అది ఒక సిద్ధంగా ఉన్న ఆస్తి లేదా రీసేల్ ఆస్తి అయితే, మీకు అన్ని ఆస్తి డాక్యుమెంట్లతో పాటు విక్రయ ఒప్పందం అవసరం.
రుణ పంపిణీ కోసం అవసరమైన డాక్యుమెంట్ల గురించి మరింత తెలుసుకోవడానికి మా ప్రతినిధిని సంప్రదించండి.
- లోన్ పంపిణీ మొత్తం ప్రాసెసింగ్
మీరు డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, ఆర్థిక సంస్థ ఆస్తి యొక్క చట్టపరమైన మరియు సాంకేతిక మూల్యాంకనను నిర్వహిస్తుంది. మూల్యాంకన, అవసరమైన డాక్యుమెంట్ల ధృవీకరణ, హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు డిపాజిట్ మరియు అన్ని పార్టీల ద్వారా అవసరమైన సంతకాలు ఆధారంగా తుది రుణం మొత్తం ప్రాసెస్ చేయబడుతుంది మరియు పంపిణీ చేయబడుతుంది. - లోన్ తుది పంపిణీ
తుది పంపిణీ దశలో రుణదాత మీకు మంజూరు చేయబడిన రుణ మొత్తాన్ని విడుదల చేస్తారు. అయితే, అది మొత్తం పంపిణీ లేదా పాక్షిక పంపిణీ అయి ఉండవచ్చని గుర్తుంచుకోండి. అది మీ ఆస్తి నిర్మాణం యొక్క వాస్తవ దశపై ఆధారపడి ఉంటుంది. ఒక వేల మొత్తం పంపిణీ అయితే, మీ ఇఎంఐ చెల్లింపులు దానిని అందుకున్న తదుపరి నెల నుండి ప్రారంభమవుతాయి. అయితే, పాక్షిక పంపిణీ సందర్భంలో మీరు పూర్తి మొత్తాన్ని అందుకునే వరకు మీరు 'ప్రీ-ఇఎంఐ' వడ్డీని చెల్లించవలసి రావచ్చు.
- పంపిణీ కోసం అభ్యర్థన
అదనపు రీడ్: ఫిక్స్‌డ్ వర్సెస్ ఫ్లోటింగ్ వడ్డీ రేటు - మీకు ఉత్తమంగా ఏది సరిపోతుంది
ముగింపు
సరైన మార్గనిర్దేశంలో మార్గదర్శకాల ఆధారంగా అమలు చేసినట్లయితే, హోమ్ లోన్ దరఖాస్తు మరియు పంపిణీ ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఉంటుంది. ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు, మరియు తదుపరి దశల గురించి తగిన పరిశోధన మరియు విషయ సేకరణలో కిటుకు దాగి ఉంది. ఏస్ - ఒక వినూత్న డిజిటల్ కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించమని మా విలువైన కస్టమర్లను మేము ప్రోత్సహిస్తాము. ఈ స్మార్ట్ పరిష్కారం కస్టమర్లకు పిఎన్‌బి హౌసింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవడానికి వీలు కల్పిస్తుంది, ఇక్కడ మీరు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా రుణం అప్లికేషన్ ఫారం డిజిటల్‌గా సబ్మిట్ చేయవచ్చు మరియు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చు.
ఈ వ్యాసం హోమ్ లోన్ పంపిణీ ప్రక్రియ మరియు దాని ముఖ్యమైన విషయాల గురించి స్పష్టంగా మరియు వివరణాత్మక అవగాహన పొందడానికి మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాము. మీరు రుణదాతను ఎంచుకున్న తరువాత దరఖాస్తు ప్రక్రియలో పారదర్శకత భారీ వ్యత్యాసాన్ని చూపుతుంది.
హోమ్ లోన్ పంపిణీ ప్రక్రియ మరియు దాని వివిధ దశలకు సంబంధించి మీ అన్ని సందేహాలు నివృత్తి అయ్యాయి అని మేము భావిస్తున్నాము. అయితే, దశలు ప్రతి రుణదాతకు భిన్నంగా ఉండవచ్చు అని గుర్తుంచుకోండి. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్తో, మొత్తం ప్రక్రియ సాధ్యమైనంత పారదర్శకంగా మరియు ఆందోళన లేకుండా ఉండేలాగా మేము నిర్ధారిస్తాము. మా కస్టమర్-ఫ్రెండ్లీ ఫీచర్లు మరియు ఇంటి వద్ద సేవలు అనేవి మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా మీ స్వంత ఇంటి కలకు దగ్గర అయ్యేందుకు మీకు సహాయపడతాయి.