మీ పొదుపును పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే, చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంచుకుంటారు. దశాబ్దాలుగా ఇది అందరు మెచ్చే ఒక పెట్టుబడి ఎంపికగా కొనసాగుతోంది, అలాగే ఒక మంచి పెట్టుబడి మార్గంగా కూడా పరిగణించబడుతుంది.
అయితే, దీనిని ఒక ఎవర్‌గ్రీన్ పెట్టుబడి ఎంపికగా చేసే అన్ని ఫీచర్లను వివరంగా తెలుసుకుందాం.
- ఎఫ్‌డి హామీ ఇవ్వబడిన రాబడి రేటును ఇస్తుంది: ఒకసారి ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో నిధులు పెట్టుబడిగా పెట్టిన తర్వాత, మెచ్యూరిటీ సమయంలో పేర్కొన్న రాబడి రేటును పొందేలా డిపాజిటర్‌కు హామీ ఇవ్వబడుతుంది. ఆర్థిక సంస్థలు ఎఫ్‌డి క్యాలిక్యులేటర్‌ను కూడా అందిస్తాయి, ఇది అవధి ముగింపులో పెట్టుబడి విలువను నిర్ధారించేందుకు సహాయపడుతుంది.
- సీనియర్ సిటిజన్స్ విషయంలో ఎఫ్‌డి ఎక్కువ రాబడులను అందిస్తుంది: సీనియర్ సిటిజన్ల కోసం ఆర్థిక సంస్థలు అధిక ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తాయి, ఇది వాస్తవానికి సాధారణ ఎఫ్‌డి రేట్ల కంటే 0.25-0.50% వరకు ఎక్కువగా ఉంటాయి. ఇది సీనియర్ సిటిజన్లు వారి జీవితకాలం పొదుపులను పోగు చేసుకోవడానికి, క్రమమైన ఆదాయాన్ని సంపాదించడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకునేలా చేస్తుంది.
- ఎఫ్‌డి అకౌంట్ల వ్యవధి సౌకర్యవంతమైనది: ఎఫ్‌డి వ్యవధి సాధారణంగా 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది, ఇది ఎఫ్‌డి అకౌంట్ అవధిని నిర్ణయించుకోవడంలో డిపాజిటర్లకు తగినంత వెసులుబాటు కల్పిస్తుంది. అంతేకాకుండా, డిపాజిటర్ అదే వ్యవధి కొరకు లేదా మెచ్యూరిటీ సమయంలో అవసరాన్ని బట్టి ఎఫ్‌డి వ్యవధిని పొడిగించవచ్చు. చాలా వరకు డిపాజిటర్లు ఏమేరకు అవధిలో ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుందో ఆ అవధిని ఎంచుకుంటారు.
- ఎఫ్‌డి మీకు సులభమైన లిక్విడేషన్‌ను ఆఫర్ చేస్తుంది: మెచ్యూరిటీకి ముందుగానే మీకు నిధులు అవసరమైతే, అప్పుడు కేవలం నామమాత్రపు జరిమానాను ఆర్థిక సంస్థలకు చెల్లించి మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లను సులభంగా లిక్విడేట్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్థిక సంస్థలు డిపాజిట్ సౌకర్యాలపై కూడా రుణాలను అందజేస్తాయి.
తప్పక చదవండి: ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎలా తెరవాలి?
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ ఎఫ్‌డి ప్రయోజనాలు
పిఎన్‌బి హౌసింగ్ అనేది హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో తనదైన ముద్ర వేసింది, ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద డిపాజిట్లు స్వీకరించే హెచ్ఎఫ్‌సి. ఇది పరిశ్రమలోనే వివిధ వ్యవధుల కోసం తన డిపాజిటర్లకు పోటీకరమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అందిస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) అకౌంట్ ప్రయోజనాలు:
- అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలు: ఫిక్స్‌డ్ డిపాజిట్లు క్రిసిల్ ఎఫ్ఎఎఎ+/స్థిరంగా రేట్ చేయబడతాయి, ఇది అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలు మరియు సకాలంలో వడ్డీ, అసలు రీపేమెంట్‌ను సూచిస్తుంది.
- అధిక వడ్డీ రేటు: ఇది వేర్వేరు అవధుల కొరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అందిస్తుంది.
- సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలు: ఇది అన్ని వ్యవధులలో డిపాజిట్లపై 0.25% అధిక వడ్డీ రేటును అందిస్తుంది.
- రుణ సౌకర్యం: పిఎన్‌బి హౌసింగ్ మొత్తం ప్రిన్సిపల్ డిపాజిట్‌లో 75% వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై లోన్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తుంది
- వడ్డీ ఆదాయంపై టిడిఎస్ విధించదు: ఒక ఆర్థిక సంవత్సరానికి ₹5,000 వరకు వడ్డీ ఆదాయంపై ఎలాంటి టిడిఎస్ మినహాయించబడదు
- ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్: 3 నెలల తప్పనిసరి లాక్-ఇన్ వ్యవధి పూర్తయిన తర్వాత డిపాజిట్ల ముందస్తు ఉపసంహరణ అనుమతించబడుతుంది