PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎలా తెరవాలి?

give your alt text here

బ్యాంకులో మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ ఉపయోగించి ఒక ఎఫ్‌డి అకౌంటును తెరిచే విధానం గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ, ఒక కొత్త కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరిచే విషయానికి వస్తే, ఈ ప్రక్రియ వేరుగా ఉంటుంది. మీరు మీ అకౌంటును నిర్వహించే బ్యాంకు బ్రాంచీలో ఎఫ్‌డి సర్టిఫికెట్ పొందడానికి కేవలం దరఖాస్తు ఫారం నింపి, ఒక చెక్కును సమర్పించాలి. అయితే, పిఎన్‌బి హౌసింగ్ లాంటి హెచ్ఎఫ్‌సి వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరిచే విధానం ఇండివిడ్యువల్ మరియు నాన్-ఇండివిడ్యువల్ ఎఫ్‌డి రెండింటికీ కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

వ్యక్తిగత ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

  • ఇటీవలి కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • పాన్ కార్డు యొక్క స్వీయ-ధృవీకరించబడిన కాపీ
  • ఓటర్-ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు లాంటి చిరునామా రుజువు యొక్క స్వీయ-ధృవీకరించబడిన కాపీ.

నాన్-ఇండివిడ్యువల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

వ్యక్తులు-కానీ వాటిలో ట్రస్టులు, క్లబ్‌లు, అసోసియేషన్లు, పబ్లిక్/ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, కో-ఆపరేటివ్ సొసైటీలు, కో-ఆపరేటివ్ బ్యాంకులు మరియు భాగస్వామ్య సంస్థలు ఉంటాయి. ఒక సంస్థ కొత్త ఎఫ్‌డి ఖాతా తెరవడానికి, అన్ని అధీకృత వ్యక్తుల నమూనా సంతకాలతో పాటు సంస్థాపన మరియు రిజిస్ట్రేషన్ యొక్క చట్టపరమైన పత్రాలను సమర్పించాలి. ఎఫ్‌డి అకౌంట్ కోసం అవసరమైన ఇతర డాక్యుమెంట్లు:

  • సంస్థ యొక్క పాన్ కార్డ్ కాపీ
  • సంస్థ చిరునామా రుజువు యొక్క కాపీ
  • ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డు మరియు అధీకృత వ్యక్తుల చిరునామా రుజువు

ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ తెరిచే విధానం కోసం

మీకు సమీపంలో ఒక పిఎన్‌బి హౌసింగ్ బ్రాంచ్ ఉంటే, దరఖాస్తు ఫారం సేకరించేందుకు బ్రాంచ్‌ను సందర్శించండి. లేదా, కంపెనీ ప్రతినిధి ద్వారా మీ ఇంటి సౌకర్యంలో సహాయం పొందడానికి మీ పేరు, కాంటాక్ట్ నంబర్, ఇమెయిల్ ఐడి, నగరం మరియు ఎఫ్‌డి మొత్తం లాంటి మీ వివరాలను పంచుకునే ఒక ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపవచ్చు

తప్పక చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఏమిటి?

పిఎన్‌బి హౌసింగ్‌ వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరవడానికి దశలవారీ విధానం

దశ 1

అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారంను సరిగ్గా పూరించండి. ఎఫ్‌డి దరఖాస్తు ఫారం నింపేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి:

  • దరఖాస్తుదారుని పేరు, చిరునామా, పాన్ మరియు బ్యాంకు వివరాలతో సహా ఎలాంటి లోపం లేకుండా మీ ప్రాథమిక వివరాలను సరిగ్గా పూరించండి
  • ఫిక్స్‌డ్ డిపాజిట్ అవధి నెలల్లో
  • చెల్లింపు వివరాలు (చెక్కు, డ్రాఫ్ట్, ఆర్‌టిజిఎస్/ఎన్‌ఇఎఫ్‌టి, యుటిఆర్ నం.)
  • డిపాజిట్ ఆప్షన్, కుములేటివ్ లేదా నాన్-కుములేటివ్ (నెలవారీ/త్రైమాసిక/అర్ధ-వార్షిక/వార్షికంగా)
  • రీపేమెంట్ సూచన (మొదటి దరఖాస్తుదారు, మొదటి దరఖాస్తుదారు లేదా సర్వైవర్)
  • పన్ను సూచన
  • ఎఫ్‌డి సర్టిఫికెట్ పంపించే విధానం (పోస్ట్/కొరియర్/హ్యాండ్/బ్రోకర్ ద్వారా)
  • రెండవ పేజీలో రీపేమెంట్ కోసం బ్యాంకు వివరాలను మరియు నామినీ వివరాలను సరిగ్గా పూరించండి
  • మీ ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోను అతికించండి, దానిపై సంతకం చేయండి
  • మరియు చివరగా, దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చోట సంతకం చేయండి

దశ 2

మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్న దరఖాస్తుదారుల అన్ని కెవైసి డాక్యుమెంట్ల (పాన్ కార్డ్, ఆధార్, ఓటర్ ఐడి) స్వీయ-ధృవీకరించబడిన కాపీలను అందుబాటులో ఉంచుకోండి.

దశ 3

ఇప్పుడు సమీపంలోని పిఎన్‌బి హౌసింగ్ బ్రాంచ్‌లో సరిగ్గా నింపిన అప్లికేషన్ ఫారం, కెవైసి డాక్యుమెంట్లు మరియు చెక్కు/ డ్రాఫ్ట్‌ను సమర్పించండి. మీరు డోర్-స్టెప్ సహాయాన్ని ఎంచుకుంటే, కంపెనీ ప్రతినిధికి డాక్యుమెంట్లను సమర్పించవచ్చు.

దశ 4

దరఖాస్తు ఫారం మరియు కెవైసి డాక్యుమెంట్ల ధృవీకరణ తర్వాత, మీ ఎఫ్‌డి బుక్ అవుతుంది, సర్టిఫికెట్ మీరు ఇచ్చిన చిరునామాకు పంపబడుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్‌ఎంఎస్ నిర్ధారణ కూడా పంపబడుతుంది.

తప్పక చదవండి: యువత మరియు సీనియర్ సిటిజన్ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రయోజనాలు

పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఫీచర్లు

  • అధిక భద్రతా ప్రమాణం (క్రిసిల్ ఎఫ్‌ఎఎఎ+/స్థిరమైన)
  • ఒక ఆర్థిక సంవత్సరానికి ₹5,000 వరకు వడ్డీ ఆదాయంపై టిడిఎస్ లేదు
  • డిపాజిట్ పై రుణ సౌకర్యం
  • తప్పనిసరి 3 నెలల లాక్-ఇన్ వ్యవధి తర్వాత ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్
అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్