ఈ ఆధునిక ప్రపంచంలో ఇంటిని కొనుగోలు చేయడం అనేది చాలా మందికి ఒక కల. ఉత్తమ ఆస్తి మరియు సరైన ఆర్థిక ప్రణాళికను ఫైనలైజ్ చేయడానికి అద్భుతమైన కృషితో, ఈ కలను నిజం చేసుకోవడానికి ప్రజలు హోమ్ లోన్ల కోసం అప్లై చేస్తారు.
ఒక ఇంటి కొనుగోలుదారు డౌన్ పేమెంట్ చేసిన తర్వాత సమాన నెలవారీ వాయిదాల (ఇఎంఐ)లో రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభిస్తారు. ఒక హోమ్ లోన్ ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితుల్లో వ్యక్తులకు ఎక్కువ నిధులు అవసరం కావచ్చు. అలాంటి పరిస్థితిలో అనేక ఆర్థిక సంస్థలు వారి ప్రస్తుత కస్టమర్లకు హోమ్ లోన్ టాప్-అప్‌ను అందిస్తాయి. తక్షణ నగదు అవసరాన్ని ఈ హోమ్ లోన్ టాప్-అప్ ద్వారా త్వరగా తీర్చుకోవచ్చు.
మీరు కూడా ఒక హోమ్ లోన్ దరఖాస్తుదారు అయితే మరియు మీకు కూడా అదనపు నిధులు అవసరమైతే, ఖచ్చితంగా తక్షణ హోమ్-లోన్ టాప్-అప్ కోసం ఎంచుకోవాలి.
హోమ్ లోన్ పై టాప్-అప్ లోన్ అంటే ఏమిటి?
హోమ్ లోన్ పై టాప్-అప్ అనేది మీ ప్రస్తుత హోమ్ లోన్‌కు అదనంగా అప్పుగా తీసుకున్న అదనపు మొత్తం. ఈ అదనపు డబ్బును ఇంటి మెరుగుదలలు, వ్యాపార విస్తరణ, ఊహించని వైద్య ఖర్చులు, ప్రయాణం, విద్య మొదలైన వాటి కోసం ఉపయోగించవచ్చు. మీరు ఈ అదనపు మొత్తాన్ని, మీ ఇఎంఐని కొద్దిగా పెంచడం ద్వారా తిరిగి చెల్లించవచ్చు.
అనేక ఆర్థిక సంస్థలు ఆకర్షణీయమైన హోమ్ లోన్ ఫీచర్లను అందిస్తాయి, వాటిలో టాప్-అప్ హౌసింగ్ లోన్‌ను ఎంచుకోవడం వల్ల మీరు అత్యంత ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్రయోజనాలలో కొన్ని ఈ కథనంలో మరింత వివరంగా ప్రస్తావించబడ్డాయి.
తక్షణ హోమ్ లోన్ టాప్-అప్ ప్రయోజనాలు
దీర్ఘకాలిక రీపేమెంట్ అవధి
మీరు ఒక హోమ్ లోన్ టాప్-అప్ ఎంచుకున్నప్పుడు, పర్సనల్ లేదా బిజినెస్ లోన్‌తో పోలిస్తే రీపేమెంట్ అవధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు 15 సంవత్సరాల అవధితో ఒక హోమ్ లోన్ కలిగి ఉంటే, మీరు తక్కువ లేదా అదే వ్యవధి కోసం హోమ్ లోన్ టాప్-అప్ గురించి అప్లై చేసుకోవచ్చు. దీర్ఘకాలిక రీపేమెంట్ అవధి ఇఎంఐలను తగ్గించడం ద్వారా ఖర్చుల భారాన్ని తగ్గించగలదు మరియు ఆర్థిక వ్యూహాన్ని వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడంలో మీకు సహాయపడుతుంది. అలాగే, టాప్-అప్ లోన్ గరిష్ఠంగా 15 సంవత్సరాల అవధితో ఇప్పటికే ఉన్న హోమ్ లోన్‌కు సమాంతరంగా అమలు చేయబడుతుంది.
తక్కువ వడ్డీ రేట్లు
హోమ్ లోన్లు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉండే "సెక్యూర్డ్ లోన్స్" కేటగిరీలోకి వస్తాయి. ఫలితంగా, మీరు తక్షణ హోమ్ లోన్ టాప్-అప్‌ను ఎంచుకుంటే, అదనపు మొత్తం పై అందించబడే వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ఇది మీ ప్రస్తుత హోమ్ లోన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.
వేగవంతమైన ప్రాసెసింగ్
హోమ్ లోన్ పై టాప్-అప్ లోన్‌కు సంబంధించిన అగ్ర ప్రయోజనాల్లో ఒకటి దాని వేగవంతమైన ప్రాసెసింగ్. అనేక ఆర్థిక సంస్థలు దరఖాస్తుదారులకు ప్రీ-అప్రూవ్డ్ టాప్-అప్ లోన్ కోసం అప్లై చేసేందుకు అనుమతిస్తాయి. టాప్-అప్ హౌసింగ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు, కనీస డాక్యుమెంటేషన్ మాత్రమే అవసరం అవుతుంది. సాధారణంగా, తక్షణ హోమ్ లోన్ టాప్-అప్ కేవలం కొన్ని రోజుల్లోపు పంపిణీ చేయబడుతుంది.
అధిక లోన్ మొత్తం
మీరు స్థిరమైన ఇఎంఐ చెల్లింపులు చేస్తూ, ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పుడు ఎక్కువ టాప్-అప్ లోన్ మొత్తాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయి. టాప్-అప్ లోన్‌ను పొడిగించడానికి ముందు ఆర్థిక సంస్థ క్రెడిట్ స్కోర్‌ను క్రాస్ చెక్ చేస్తుంది.
పన్ను ప్రయోజనాలు
ఒకవేళ టాప్-అప్ హోమ్ లోన్‌ను కొనుగోలు, నిర్మాణం, పునర్నిర్మాణం మరియు మరమ్మత్తు కోసం ఉపయోగిస్తే, ఆ సందర్భంలో సెక్షన్ 24B మరియు సెక్షన్ 80C పరిమితులకు అనుగుణంగా పన్ను మినహాయింపులు సాధ్యమవుతాయి. మరిన్ని వివరాల కోసం మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
తక్షణ హోమ్ లోన్ టాప్-అప్ కోసం అర్హత ప్రమాణాలు
మీరు ఒక నిర్ధిష్ట ఆర్థిక సంస్థకు చెందిన ప్రస్తుత కస్టమర్ అయితే మాత్రమే, మీరు హోమ్ లోన్ పై టాప్-అప్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కనీసం ఒక సంవత్సరం పాటు మీ ఇఎంఐని విజయవంతంగా తిరిగి చెల్లించకపోతే, ఆ సంస్థ మీకు హోమ్ లోన్ టాప్-అప్ ఇవ్వదు.
మీరు హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి హోమ్ లోన్ అర్హతను లెక్కించవచ్చు. అన్ని అవసరాలు నెరవేరిన తర్వాత, ఆర్థిక సంస్థ టాప్-అప్ లోన్ మొత్తాన్ని పంపిణీ చేస్తుంది.
తక్షణ హోమ్ లోన్ టాప్-అప్ కోసం అప్లై చేయడంలో దశలు
మీకు తెలిసినట్లుగా, తక్షణ హోమ్ లోన్ టాప్-అప్ కోసం అప్లై చేయడానికి ముందు మీరు ఇప్పటికే ఉన్న ఒక హోమ్ లోన్ కలిగిన అభ్యర్థి అయి ఉండాలి. అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో మీరు మీ ఆర్థిక సంస్థ నుండి టాప్-అప్ హౌసింగ్ లోన్ పొందవచ్చు.
పిఎన్‌బి హౌసింగ్ దాని ప్రస్తుత కస్టమర్లందరికీ అవసరం మరియు అర్హతను బట్టి తక్షణ హోమ్ లోన్ టాప్-అప్‌ను అందిస్తుంది. పిఎన్‌బి హౌసింగ్ అర్హత ప్రమాణాల ఆధారంగా ప్రస్తుత కస్టమర్లకు కనీస డాక్యుమెంటేషన్‌తో ఈ లోన్లను అందిస్తుంది. అదనంగా, పంపిణీ అవాంతరాలు-లేనిది.
ముగింపు
తక్షణ హోమ్ లోన్ టాప్-అప్ అనేది మీ ప్రస్తుత హోమ్ లోన్ పై మరిన్ని నిధులను అప్పుగా తీసుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఈ నిధులను వివిధ ఆర్థిక అవసరాల కోసం ఉపయోగించవచ్చు. ఈ లోన్ రీపేమెంట్ అనేది ఇఎంఐ మరియు అవధి కలయికతో ఉంటుంది.
ఏదైనా అదనపు మరియు తక్షణ ఆర్థిక అవసరాల కోసం పిఎన్‌బి హౌసింగ్ త్వరిత, సులభమైన మరియు అవాంతరాలు-లేని హోమ్ లోన్ టాప్-అప్‌ను అందిస్తుంది.