మీ స్వంత ఇంటిని కలిగి ఉండటం అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా, చాలామంది ఔత్సాహిక గృహ యజమానులు తమ ఇంటికి ఫైనాన్స్ చేయడానికి హోమ్ లోన్లు తీసుకుంటారు. పిఎన్‌బి హౌసింగ్ వంటి సంస్థలు అర్హత కలిగిన రుణగ్రహీతలకు వేగవంతమైన మరియు అవాంతరాలు-లేని హోమ్ లోన్లను అందిస్తాయి. మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి కొంత ఆర్థిక సహాయం కోసం చూస్తున్నట్లయితే, మీ హోమ్ లోన్ యొక్క ఆమోదం కోసం మీ వైపు పరిష్కరించుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి.
మీ హోమ్ లోన్ కోసం తక్షణ ఆమోదం పొందడానికి ఈ 4 ప్రధాన చిట్కాలను అనుసరించండి
1. మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోండి
రుణగ్రహీత క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ హోమ్ లోన్ పొందడంలో దరఖాస్తుదారుని అర్హతను నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశం. ఈ స్కోర్ 300-900 వరకు ఉంటుంది, ఒకవేళ మీకు 700 లేదా అంతకంటే ఎక్కువగా మంచి సిబిల్ స్కోర్ ఉంటే, ఆర్థిక సంస్థలు మిమ్మల్ని ఒక విశ్వసనీయమైన రుణగ్రహీతగా పరిగణిస్తాయి. మీ దరఖాస్తును వెంటనే ఆమోదిస్తాయి. మీ దరఖాస్తులో కొంత లోపం ఉన్నప్పటికీ, మీరు ఉత్తమ క్రెడిట్ స్కోర్‌తో మంచి వడ్డీ రేట్లకు హోమ్ లోన్ పొందవచ్చు. అలాగే, సిబిల్ స్కోర్ 900 కి దగ్గరగా ఉంటే, మీరు వేగంగా అప్రూవల్ పొందుతారు.
2. ఎలాంటి బాకీ రుణాలు ఉండవద్దు
ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు, దయచేసి మీరు మీ పెండింగ్‌లో ఉన్న రుణం మరియు క్రెడిట్ కార్డ్ బకాయిలను క్లియర్ చేశారని నిర్ధారించుకోండి. ఇది మీ క్రెడిట్ యోగ్యతకు నిదర్శనం కావున, ఇది మీ దరఖాస్తు అర్హత కోసం గొప్పగా సహాయపడుతుంది: మీకు త్వరిత ఆమోదం కోసం వీలుకల్పిస్తుంది.
3. ఒక కో-అప్లికెంట్‌తో అప్లై చేయండి
మీరు తక్కువ క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉంటే లేదా కనీస అర్హత ప్రమాణాలను నెరవేర్చక పోయినప్పటికీ, మీరు మీ విశ్వసనీయతను మెరుగుపరచుకోవచ్చు. అలాగే, మీ రుణ ఆమోదాన్ని వేగవంతం చేసుకోవచ్చు. స్థిరమైన ఆదాయం కలిగిన మీ కుటుంబ సభ్యుడు మీకు బదులుగా రుణాన్ని చెల్లించేందుకు హామీ ఇవ్వగలిగితే, ఖచ్చితంగా అది మీ హోమ్ లోన్ అర్హతను మెరుగుపరుస్తుంది మరియు శీఘ్ర ఆమోదంతో మీరు మెరుగైన రుణ నిబంధనలను పొందుతారు.
తప్పక చదవండి: భారతదేశంలో వివిధ రకాల హోమ్ లోన్లు ఏవి?
4. మీ హోమ్ లోన్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి
ఒక బాధ్యతాయుతమైన రుణగ్రహీతగా మీరు ఇతర నిబంధనలు మరియు షరతులతో పాటు మీ రుణం అవధి, వడ్డీ రేటు, ప్రీపేమెంట్ ఆప్షన్లు మరియు ప్రాసెసింగ్ సమయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దయచేసి ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి మీరు దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పరిశీలించండి, అయితే, దరఖాస్తు ఫారంతో పాటు మీరు రీపేమెంట్ అవధిని కూడా తెలుసుకోండి.
ముగింపు
పిఎన్‌బి హౌసింగ్ కేవలం కొన్ని సులభమైన దశలలో ఆన్‌లైన్ హోమ్ లోన్లను ఆఫర్ చేస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపండి మరియు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి. అలాగే, మీరు అన్ని అర్హత ప్రమాణాలను నెరవేర్చండి, సంబంధిత వివరాలను అందించండి. మీకు ఇప్పటికీ మీ ఇఎంఐలు మరియు అర్హత గురించి ఖచ్చితంగా తెలియకపోతే, తెలుసుకోవడానికి మా ఆన్‌లైన్ హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి.
మా డోర్‌స్టెప్ సర్వీస్ సదుపాయం మరియు అనుభవజ్ఞులైన మేనేజర్ సహాయంతో మీరు పేపర్ వర్క్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు గురించి పూర్తిగా తెలియదా?? తదుపరి మద్దతు కోసం ఈరోజే పిఎన్‌బి హౌసింగ్ ప్రతినిధులను సంప్రదించండి.