PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రకాలు మరియు ఉత్తమ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎలా ఎంచుకోవాలి?

give your alt text here

ఫిక్స్‌డ్ డిపాజిట్లు రిస్క్-విముఖత లేని పెట్టుబడిదారులకు ఉత్తమంగా సరిపోయే పెట్టుబడి రూపం. ఇది వారి డబ్బును ఒక నిర్ణీత వ్యవధి కోసం ఒక నిర్ణీత వడ్డీ రేటుకు పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ పదం సూచిస్తున్నట్లుగా ముందుగానే ఫిక్స్ చేయబడతాయి. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి, ఆ నిర్ధిష్ట వడ్డీ శాతం అనేది ఆర్థిక సంస్థ అభీష్టానుసారంగా ఉంటుంది.

ఒకసారి డిపాజిటర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ అర్హత ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత, ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత, వారి డబ్బు నిర్ధిష్ట అవధి కోసం లాక్ చేయబడుతుంది.

ఏదైనా కారణం వల్ల డిపాజిటర్లు లాక్-ఇన్ వ్యవధి ముగిసేలోపు ఎఫ్‌డిని విత్‌డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు, ప్రీమెచ్యూర్ విత్‌డ్రాల్ కోసం జరిమానా వసూలు చేయబడుతుంది మరియు వారు కొంత వడ్డీని కోల్పోతారు. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి హెచ్ఎఫ్‌సి వద్ద లాక్-ఇన్ వ్యవధి 3 నెలలు మాత్రమే.

వివిధ రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఆర్థిక సంస్థలు వివిధ రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని సాధారణమైనవి ఇలా ఉన్నాయి:

1. స్టాండర్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

దాదాపుగా ప్రతి ఆర్థిక సంస్థ తన కస్టమర్లకు ఈ రకం ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను అందిస్తుంది. డిపాజిటర్లు స్టాండర్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని ఎంచుకున్నప్పుడు, వారి డబ్బు నిర్ణీత కాలానికి పెట్టుబడి పెట్టబడుతుంది మరియు డిపాజిట్ కాలవ్యవధిపై ఆధారపడి స్థిరంగా ఉండే ఎఫ్‌డి వడ్డీ రేటును పొందుతారు.

సాధారణ ఫీచర్లలో ఇవి ఉంటాయి:

  • ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు స్థిరమైన అవధి. హెచ్ఎఫ్‌సి ఎఫ్‌డి కోసం అవధి 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది.
  • మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల మార్పుకు గురికాని ముందుగా-నిర్ణయించిన వడ్డీ రేటు
  • సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్‌తో పోలిస్తే అధిక ఎఫ్‌డి వడ్డీ రేటు.

2. పన్ను-ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ (బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డిలకు మాత్రమే వర్తిస్తుంది)

ఒక పన్ను-పొదుపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ కోసం డిపాజిటర్లు వారి డబ్బును కనీసం ఐదు సంవత్సరాలపాటు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. పన్ను-పొదుపు ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టిన మొత్తం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది. ఈ ఎఫ్‌డి పై సంపాదించిన వడ్డీ పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది.

సాధారణ ఫీచర్లు ఇలా ఉంటాయి:

  • ఐదు సంవత్సరాల కనీస లాక్-ఇన్ వ్యవధి
  • ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు
  • ఏకమొత్తంలో డిపాజిట్లు మాత్రమే చేయవచ్చు

తప్పక చదవండి: ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎలా తెరవాలి?

3. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఈ ఎఫ్‌డిలను 'ప్రత్యేకమైనవి' అని పిలుస్తారు, ఎందుకంటే ఇవి ప్రత్యేక అవధుల కోసం అందుబాటులో ఉంటాయి. ఈ వ్యవధి 290 లేదా 390 లాంటి ఏదైనా వ్యవధి కోసం కావచ్చు (సాధారణంగా బ్యాంకులలో అందించబడుతుంది). ప్రత్యేక ఎఫ్‌డిలపై అధిక వడ్డీ రేట్లు అందించబడుతున్నందున, అవి ప్రముఖ పెట్టుబడి ఎంపికగా నిలుస్తాయి. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి:

  • ఒక నిర్దిష్ట అవధి కోసం పెట్టుబడి.
  • అవధి ముగిసే వరకు నగదును విత్‍డ్రా చేయలేరు
  • స్టాండర్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి

4. క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఎంచుకున్న అవధి ప్రకారం ఈ ఎఫ్‌డిలపై వడ్డీ సమ్మేళనం చేయబడుతుంది. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి మొత్తానికి ఈ వడ్డీ జోడించబడుతుంది.

5. నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్

క్యుములేటివ్ ఎఫ్‌డిల మాదిరిగా కాకుండా, ఇక్కడ వడ్డీ క్రమ వ్యవధిలో చెల్లించబడుతుంది.

కొన్ని ఫీచర్లు ఇలా ఉన్నాయి:

  • ఎఫ్‌డిని తెరిచే సమయంలో నిర్ణయించిన ఫ్రీక్వెన్సీ ప్రకారమే వడ్డీ చెల్లించబడుతుంది - ఇది వార్షికంగా, నెలవారీగా, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లేదా ప్రతి త్రైమాసికంలో చెల్లించబడుతుంది.
  • ఈ రకమైన పెట్టుబడి పెన్షనర్లకు లేదా క్రమం తప్పకుండా నిధుల ప్రవాహాన్ని పొందాలనుకునే వారికి మరింత అనుకూలంగా ఉంటుంది.

6. సీనియర్ సిటిజన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్

పేరు సూచిస్తున్నట్లుగా, ఈ ఎఫ్‌డి ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే వర్తిస్తుంది.

సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫీచర్లు ఇలా ఉన్నాయి:

  • సీనియర్ సిటిజన్ల కోసం వడ్డీ రేటు స్టాండర్డ్ ఎఫ్‌డి వడ్డీ రేట్ల కంటే సుమారు 0.25% నుండి 0.75% ఎక్కువగా ఉంటుంది. పిఎన్‌బి హౌసింగ్ సీనియర్ సిటిజన్ల కోసం 0.25% అదనపు ఆర్‌ఒఐ అందిస్తుంది.
  • సౌకర్యవంతమైన అవధులు

ఉత్తమ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని ఎలా ఎంచుకోవాలి?

అత్యంత అనుకూలమైన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని ఎంచుకోవడానికి, డిపాజిటర్లు తప్పనిసరిగా కొన్ని అంశాలను అంచనా వేయాలి:

1. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి

ఎఫ్‌డి వడ్డీ రేట్లు అవధిని బట్టి మారుతూ ఉంటాయి ; ఎక్కువ అవధి కోసం వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక ఎఫ్‌డిలు మెరుగైనవి, కానీ డిపాజిట్ చేసిన డబ్బు ఎక్కువ కాలం పాటు లాక్ అయి ఉంటే, పెట్టుబడిదారుని ద్రవ్యత దెబ్బతింటుంది. అందువల్ల, ఒక డిపాజిటర్ ఆర్థిక పరిస్థితి మరియు లక్ష్యాల ఆధారంగా అవధి ఫ్లెక్సిబిలిటీని అందించే ఎఫ్‌డిని ఎంచుకోవడం మంచిది.

2. ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ నిబంధనలు

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకోవడానికి ముందు ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ నిబంధనలు మరియు జరిమానాలను మూల్యాంకన చేయడం మంచిది. వ్యక్తులు వారి ఎఫ్‌డిని లిక్విడేట్ చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి మరియు ఎక్కువ ధరకు కాదు.

తప్పక చదవండి: టర్మ్ డిపాజిట్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

3. వడ్డీ రేటు

ఎఫ్‌డిలను తెరవడానికి ప్రధాన కారణం వాటిపై వడ్డీని సంపాదించడమే. పోటీ ఎఫ్‌డి వడ్డీ రేట్లను అందించే ఆర్థిక సంస్థను ఎంచుకోండి.

4. అదనపు ప్రయోజనాలు

కేవలం వడ్డీ రేటుతో మాత్రమే వెళ్లకూడదు ; కొన్ని అదనపు ప్రయోజనాల కోసం చూడండి. వీటిలో ఆటో-రెన్యూవల్ ఎంపికలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పై లోన్ సౌకర్యం, అధిక లిక్విడిటీ కోసం ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం మరియు అలాంటి ఇతర ఫీచర్లు ఉంటాయి.

మార్కెట్లో పలు రకాల పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు ఇష్టమైన ఎంపికగా ఉంటాయి. ఎందుకంటే ఎఫ్‌డిల యొక్క సురక్షితమైన మరియు భద్రమైన స్వభావం స్థిర రాబడి, స్థిరమైన వృద్ధికి హామీ ఇస్తుంది. ఎంచుకోవడానికి వివిధ రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో డిపాజిటర్లు, వారి డబ్బుకు తగిన దానిని ఎంచుకోవచ్చు.

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్