కొత్త పెట్టుబడిదారులు ఎక్కువగా టర్మ్ డిపాజిట్లపై ఆసక్తి చూపుతున్నారు, వీటినే మనం ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని పిలుస్తాము, ఇది ఒక సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. టర్మ్ డిపాజిట్‌ను తెరవడం చాలా సులభమే అయినప్పటికీ, మీరు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.
ఈ బ్లాగ్‌లో మనం టర్మ్ డిపాజిట్ అంటే ఏమిటి, దాని రకాలు, ఫీచర్లు మొదలైనటువంటి అన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
టర్మ్ డిపాజిట్ అంటే ఏమిటి?
ఒక టర్మ్ డిపాజిట్‌ను ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) అని పిలుస్తారు. ఎన్‌బిఎఫ్‌సిలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) మరియు బ్యాంకులు ఈ డిపాజిట్‌ను ఆఫర్ చేస్తాయి. టర్మ్ డిపాజిట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధి కొరకు నిర్ణీత వడ్డీ రేటుతో ఒక ఆర్థిక సంస్థ లేదా బ్యాంకులో ఏకమొత్తంలో డిపాజిట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ వ్యవధి సాధారణంగా 1 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది మార్కెట్లో అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఎంపికల్లో ఒకటి. అంతేకాకుండా, టర్మ్ డిపాజిట్ మీకు అదనపు సామర్థ్యాలను అందిస్తుంది, అవి
- చివరగా లాక్ చేసిన వడ్డీ రేటును బట్టి, మీరు నిర్ణీత వ్యవధి కోసం డిపాజిట్ చేసిన నగదు మొత్తంపై వడ్డీని పొందవచ్చు.
- ఒకసారి లాక్ ఇన్ చేసిన తర్వాత, వడ్డీ రేటు లేదా మార్కెట్ రేట్లు వడ్డీ రేటును ప్రభావితం చేయవు.
- మీ టర్మ్ డిపాజిట్ మెచ్యూరిటీ పొందినప్పుడు గాని లేదా కాలానుగుణంగా వడ్డీ పొందే అవకాశం మీకు ఉంటుంది.
- పన్ను ఆదా కోసం ఎంచుకున్న టర్మ్ డిపాజిట్ సాధారణంగా 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో వస్తుంది. ఈ వ్యవధిలో ఆ మొత్తాన్ని విత్‍డ్రా చేయడం సాధ్యం కాదు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాత్రమే టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వీకరించేందుకు అనుమతి కలిగి ఉంటాయి.
- పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లాంటి ఎన్‌బిఎఫ్‌సిలు, టాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్లను అంగీకరించవు. పిఎన్‌బి హౌసింగ్‌లో టర్మ్ డిపాజిట్ 3 నెలల లాక్ ఇన్ వ్యవధితో వస్తుంది.
టర్మ్ డిపాజిట్ల ఫీచర్లు
టర్మ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఫీచర్లు ఉన్నాయి. అవి:. వాటిలో ఇవి ఉంటాయి:
- మీరు ఒక టర్మ్ డిపాజిట్ చేయడానికి ముందు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.
- ఎఫ్‌డి వడ్డీ రేట్లు ఎప్పుడూ మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా ప్రభావితం కావు. ఒక నిర్ణీత వ్యవధి కోసం ఎఫ్‌డి లాక్ చేయబడుతుంది. ఈ లోపు మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే, జరిమానా విధించబడుతుంది.
- డిపాజిటర్ నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని అందుకోవచ్చు. నాన్-క్యుములేటివ్ టర్మ్ డిపాజిట్ల విషయంలో మీరు అంగీకరించిన ఫ్రీక్వెన్సీ వ్యవధులలో వడ్డీ క్రమం తప్పకుండా చెల్లించబడుతుంది.
- పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా ఉండే టర్మ్ డిపాజిట్లు పరిమిత లిక్విడిటీని కలిగి ఉంటాయి.
- టర్మ్ డిపాజిట్ అకౌంట్లో పెట్టుబడి పెట్టే మొత్తానికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం కేవలం కనీస డాక్యుమెంట్లు మాత్రమే అవసరం.
తప్పక చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఏమిటి?
టర్మ్ డిపాజిట్లు ఎన్ని రకాలు?
మార్కెట్లో అనేక రకాల టర్మ్ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని పోల్చడం ద్వారా మీరు మీ కోసం సరిపోయే ఒకదానిని ఎంచుకోవచ్చు. దిగువ ఇవ్వబడిన జాబితా, టర్మ్ డిపాజిట్ల యొక్క రెండు ప్రధాన రూపాలను వివరిస్తుంది:
1. క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్:
- వడ్డీ మెచ్యూరిటీ సమయంలో మాత్రమే పొందవచ్చు
- కాలానుగుణ వడ్డీ వినియోగదారులకు అందుబాటులో లేదు
- క్యుములేటివ్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి
- క్యుములేటివ్ టర్మ్ డిపాజిట్ వ్యవధి 1 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
2. నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్:
- అంగీకరించిన నిర్ధిష్ట కాలానికి వడ్డీ రేటు క్రమం తప్పకుండా చెల్లించబడుతుంది
- నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వ్యవధి 1 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
- స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది
అంతేకాకుండా, ఇలాంటి ఇతర రకాల టర్మ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి:
1. కంపెనీ డిపాజిట్లు:
- కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆర్థిక సంస్థలు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సిలు)లు వీటిని అందిస్తాయి.
- పెట్టుబడిదారులు స్థిరమైన వడ్డీ రేటు వద్ద, నిర్ణీత కాలానికి కంపెనీలలో డిపాజిట్ చేస్తారు.
2. సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్లు:
- 60 ఏళ్లు పైబడిన వారికి ఇతర టర్మ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేటును అందిస్తుంది.
- నాన్-క్యుములేటివ్ రకం టర్మ్ డిపాజిట్ కూడా అందుబాటులో ఉంది, ఇది నెలవారీ/త్రైమాసిక/వార్షికంగా వడ్డీ రేటును చెల్లిస్తుంది.
3. ఎన్ఆర్ఐ టర్మ్ డిపాజిట్లు:
- ఎన్ఆర్ఒ అకౌంట్లు కలిగిన ఉన్న ఎన్ఆర్ఐ, పిఐఒ మరియు ఒసిఐఎస్‌లు వీటికి అర్హులు
- సాధారణ సేవింగ్స్ అకౌంట్లతో పోలిస్తే, ఈ అకౌంట్ అధిక ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తుంది.
- ఫిక్స్‌డ్-టర్మ్ ఒప్పందం
- ఎన్‌ఆర్ఒ బ్యాంక్ అకౌంట్ నుండి ఆర్‌టిజిఎస్ లేదా ఎన్ఇఎఫ్‌టి అనేది ఒక సౌకర్యవంతమైన చెల్లింపు విధానం.
- ఎన్ఆర్ఐ పిఎన్‌బి హౌసింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 36 నెలల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు
4. టాక్స్-సేవింగ్ టర్మ్ డిపాజిట్లు:
- ఆర్‌బిఐ నియంత్రించే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాత్రమే టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వీకరించేందుకు అనుమతించబడతాయి.
- ఒకేసారి ఏకమొత్తంలో డిపాజిట్ చేయడం
- ఈ డిపాజిట్లు 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి, ఆ సమయంలో విత్‌డ్రాల్ లేదా రుణాల కోసం అనుమతి ఉండదు.
- డిపాజిటర్లు, టాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్లలో ₹1.5 లక్ష వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
- పిఎన్‌బి హౌసింగ్ లాంటి ఎన్‌బిఎఫ్‌సి/హెచ్ఎఫ్‌సిలు టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల సదుపాయాన్ని అందించవు.
తప్పక చదవండి: ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎలా తెరవాలి?
మీరు ఒక ఉత్తమ టర్మ్ డిపాజిట్‌ను ఎలా ఎంచుకుంటారు?
ఒక ఉత్తమ టర్మ్ డిపాజిట్‌ను ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
- అత్యధిక వడ్డీ రేటును అందించే ఒకదానిని ఎంచుకోండి
- ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆఫర్ చేసే బ్యాంక్ లేదా ఎన్‌బిఎఫ్‌సి విశ్వసనీయతను చెక్ చేయండి
- ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ నిబంధనల కోసం చెక్ చేయండి
- ఒక ఆర్థిక సంస్థ అందించే అత్యంత అనుకూలమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ రకాన్ని చూడండి
పిఎన్‌బి హౌసింగ్ వద్ద మేము డిపాజిటర్లందరికీ అధిక భద్రతా హామీని ఇస్తాము, ఎఫ్ఎఎ+/ప్రతికూల రేటింగ్‌ను అందించిన క్రిసిల్‌కు మరియు ఎఎ/స్థిరమైన రెంటింగ్ ఇచ్చినందుకు కేర్ సంస్థకు మా ధన్యవాదాలు.
టర్మ్ డిపాజిట్ ప్రయోజనాలు
- ప్రతి ఆర్థిక సంవత్సరానికి ₹5000 వరకు వడ్డీ ఆదాయంపై టిడిఎస్ లేదు
- 3 నెలల వ్యవధి పూర్తయిన తర్వాత డిపాజిట్‌లో 75% వరకు రుణ సౌకర్యం.
- 3-నెలల లాక్-ఇన్ పీరియడ్ తర్వాత టర్మ్ డిపాజిట్‌ను ప్రీమెచ్యూర్ విధానంలో ఉపసంహరించుకోవచ్చు
- ఎన్‌హెచ్‌బి మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ సౌకర్యం
- 120 నెలల క్యుములేటివ్ టర్మ్ డిపాజిట్ల కోసం గరిష్ఠంగా 7.25%* వడ్డీ రేటు మరియు మెచ్యూరిటీ డిపాజిట్లకు 10.14% తాత్కాలిక వడ్డీ