మీకు ఆనందం మరియు ప్రశాంతతను అందించే స్వర్గ ధామమే మీ ఇల్లు. నిజమే, మనలో చాలా మంది వారి ఇంటిని స్వర్గధామంగా భావిస్తారు, ఎక్కడ ఉన్నా కూడా ఇంటిని గురించి ఆలోచిస్తుంటారు.
మన జీవితకాలంలో మనం పెట్టుబడి పెట్టే ముఖ్యమైన ఆస్తుల్లో ఇల్లు ప్రధానమైనది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్నందున, ఇంటి కొనుగోలు అనేది విలువైన పెట్టుబడిగా మారింది. మనలో చాలా మందికి ఇలాంటి ఒక సంఘటన ఎదురై ఉండవచ్చు, ఒక ఆర్థిక సంస్థ నుండి వారి కలల ఇంటికి సరిపడా నిధులకు ప్రాప్యత లభించకపోవచ్చు.
మరి పెద్ద మొత్తంలో హోమ్ లోన్ పొందడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? దీనికి పరిష్కారం చాలా సులభం. మీరు సహ-దరఖాస్తుదారుతో కలిసి జాయింట్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. అలాగే, మీ ఆదాయాలను కలపడం ద్వారా ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు మీ మొత్తం ఆదాయంలో పెరుగుదలతో పాటు మీ రీపేమెంట్ సామర్థ్యం కూడా పెరుగుతుంది.
కానీ గుర్తుంచుకోండి, హోమ్ లోన్ కోసం సహ-యజమానులు అందరూ సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి, అందరు సహ-దరఖాస్తుదారులు సహ-యజమానులుగా ఉండవలసిన అవసరం లేదు. మంచి లావాదేవీ కోసం మీ సహ-దరఖాస్తుదారు ఉత్తమ క్రెడిట్ స్కోరును కలిగి ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఇద్దరిలో ఒక దరఖాస్తుదారుని స్కోర్ తక్కువగా ఉన్నా అది ఉమ్మడి క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఏదైనా దురదృష్టకర సంఘటన లేదా దరఖాస్తుదారు ఆకస్మిక మరణం సందర్భంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి, ఎల్లప్పుడూ సహ-దరఖాస్తుదారు ప్రత్యేక ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సలహా ఇవ్వబడుతుంది.
ఇప్పుడు ప్రతి ఒక్కరికీ, హోమ్ లోన్ల కోసం ఎవరు సహ-దరఖాస్తుదారుగా అర్హులు అనే ప్రశ్న తలెత్తవచ్చు. భారతీయుల విషయంలో ఒక వివాహిత జంట, తండ్రి మరియు కొడుకు (బహుళ వారసుల విషయంలో కొడుకు ప్రాథమిక యజమాని) లేదా తండ్రి మరియు అవివాహిత కుమార్తె (కూతురు ప్రాథమిక యజమాని), సోదరులు (సహ-యాజమాన్య ఆస్తి విషయంలో) మరియు వ్యాపారవేత్త/మహిళ అతని/ఆమె కంపెనీతో పాటు సహ-దరఖాస్తుదారులు కావచ్చు.
ఒక జాయింట్ హోమ్ లోన్‌లో ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి:
జాయింట్ హోమ్ లోన్ వల్ల 6 ప్రధాన ప్రయోజనాలు, తప్పక తెలుసుకోవాల్సినవి
లోన్ అర్హతలో పెరుగుదల:
ఆదాయం ఆధారంగా దరఖాస్తుదారు/ల రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేసిన తర్వాత, రుణం మంజూరు చేయబడుతుంది. సహ-దరఖాస్తుదారు ఆదాయాన్ని జోడించడం ద్వారా ఒక వ్యక్తి ఎక్కువ రుణ మొత్తాన్ని పొందవచ్చు.
దీని గురించి తెలుసుకోండి: మీ హోమ్ లోన్ అర్హతను ఎలా మెరుగుపరచాలి
ఒక పెద్ద ఇంటిని సొంతం చేసుకోండి:
అర్హత పెరిగిన కొద్దీ, మీ కలల ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు మీకు మరింత చేరువవుతాయి.
బాధ్యతను పంచుకోవడం:
మీరు మీ హోమ్ లోన్ కోసం ఒక సహా-దరఖాస్తుదారును జోడించినప్పుడు, మీ హోమ్ లోన్ రీపేమెంట్ బాధ్యతను కూడా మీరు పంచుకుంటారు. ఇది యాజమాన్యం భాగస్వామ్య భావనను పెంపొందించడంలో సహాయపడుతుంది మరియు ఆ వ్యక్తిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
పన్ను ప్రయోజనాలు:
మీ సహ-దరఖాస్తుదారు మరియు మీరు సెక్షన్ 80C కింద హోమ్ లోన్ యొక్క అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడంపై ఒక్కొక్కరికి ₹1.5 లక్షల వరకు మరియు ఆదాయపు పన్ను నిబంధనలలోని సెక్షన్ 24 ప్రకారం ఒక్కొక్కరికి ₹2 లక్షల వరకు ఆదాయపు పన్ను రాయితీకి అర్హులు. పన్ను ప్రయోజనం హోమ్ లోన్ వడ్డీ మరియు అసలు మొత్తం రీపేమెంట్ రెండింటిపైన మినహాయింపు ఆస్తి నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే క్లెయిమ్ చేయబడుతుందని గమనించడం ముఖ్యం. మరింత వివరణాత్మక సమాచారం మరియు ప్రయోజనాల కోసం మీ పన్ను కన్సల్టెంట్ లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.
యాజమాన్యం బదిలీ:
పైన పేర్కొన్న ప్రయోజనాలు కాకుండా, జాయింట్ హోమ్ లోన్‌కు దారితీసే జాయింట్ ప్రాపర్టీ యాజమాన్యం ఏదైనా ఊహించని సంఘటనలో ఇతర దరఖాస్తుదారు (సహ-యజమాని కూడా) పేరుతో యాజమాన్యాన్ని బదిలీ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది.
మహిళా సహ-దరఖాస్తుదారుతో స్టాంప్ డ్యూటీ ఛార్జీలలో ప్రయోజనం:
మీ సహ-దరఖాస్తుదారు మహిళలు అయితే కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ ఛార్జీలలో తగ్గింపును అందిస్తాయని చాలామందికి తెలియకపోవచ్చు. ఉదాహరణకు, ఢిల్లీలో, దరఖాస్తుదారు మహిళ అయితే, స్టాంప్ డ్యూటీ 4%, వివాహిత జంటలకు 5% మరియు ఒంటరి పురుషులకు 6% విధించబడుతుంది.
తప్పక చదవండి: మీ గృహ లోన్ అర్హతను చెక్ చేయండి
షాజీ వర్గీస్‌చే, బిజినెస్ హెడ్ మరియు జనరల్ మేనేజర్, పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్