PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

జాయింట్ హోమ్ లోన్లు అంటే ఏమిటి? రుణ ఆమోదం కోసం కావలసిన అర్హత మరియు అవసరమైన డాక్యుమెంట్లు

give your alt text here

సారాంశం: అన్యాయమైన బిల్డర్ల దుష్ప్రవర్తన నుండి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడం మరియు రియల్ ఎస్టేట్ అమ్మకాల నుండి ఉత్పన్నమయ్యే వివాదాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం 2017 లో మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ("మహా రెరా లేదా అథారిటీ")ని ఏర్పాటు చేసింది. నివాస మరియు వాణిజ్య పరమైన ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ మరియు అమ్మకం, వివాదాల సత్వర పరిష్కారం, ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షించడం మరియు ప్రమోటర్‌లపై విధించే బాధ్యతలకు అవసరమైన సమ్మతిని నిర్ధారించడం లాంటి వాటితో సహా కానీ, వీటికే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ అమ్మకపు లావాదేవీలను నియంత్రించే నియమాలను రూపొందించడం దీని వెనుకనున్న ఉద్దేశం.

రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం, 2016 నోటిఫికేషన్ ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం 2017లో మహారేరాను స్థాపించింది. ప్రజల/ గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడం మరియు నియంత్రించడం అనేది దీని ప్రాథమిక లక్ష్యం. రియల్ ఎస్టేట్ లావాదేవీల ప్రతి దశలో పూర్తి పారదర్శకత ఉండేలా చూడటం ద్వారా కొనుగోలుదారులకు ఈ సంస్థ ప్రయోజనం చేకూరుస్తుంది మరియు వారి సంబంధిత వాణిజ్య/ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను రిజిస్టర్ చేయడం, వివరణాత్మక సమాచారం అందించడం ద్వారా ప్రమోటర్లు/ బిల్డర్లకు కూడా సహాయపడుతుంది, తద్వారా కొనుగోలుదారుల నమ్మకాన్ని సంతృప్తి పరుస్తుంది, అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది.

మహారాష్ట్రలో హోమ్ లోన్ పొందడానికి ముందు మహారేరా గురించి సమాచారం సేకరించడం చాలా ముఖ్యం . మహారేరా పాత్రను అర్థం చేసుకోవడం దానిలో ఉన్న సంక్లిష్టతను మరియు దాని పనితీరు గురించి సాధారణ ప్రజలలో అవగాహన లేకపోవడం వల్ల ఇది ఒక సవాలుగా మారింది. మొదటి సారి చూసినప్పుడు చాలా మంది ప్రజలు ఈ చట్టాన్ని గురించి గందరగోళానికి మరియు అయోమయానికి గురవుతారు. కావున, పైన పేర్కొన్న సమస్యల చుట్టూ ఉన్న అస్పష్టతను పరిష్కరించడానికి, ఈ కథనం తరువాతి పేరాలలో అదే విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ చట్టాన్ని గురించి తెలుసుకోవడం వల్ల భావి కొనుగోలుదారులు వారు సరైన ఆస్తి/ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడుతున్నారో లేదో తెలుసుకోవడానికి సహాయపడటమే కాకుండా, బిల్డర్లతో వారి వివాదాలను పరిష్కరించుకోవడానికి ఏకరీతి పరిష్కార యంత్రాంగాన్ని కూడా అందిస్తుంది.

చట్టం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఇతర వివరాలపై దృష్టి కేంద్రీకరించే త్వరిత మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలో రేరా చట్టం అంటే ఏమిటి?

రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్), 2016 ("రేరా యాక్ట్" లేదా "చట్టం") ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. ఈ చట్టం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలను నిర్వహించడానికి నియమాలను నిర్వచిస్తుంది మరియు వినియోగదారులు/ ఇంటి కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో ప్రాజెక్టులు మరియు ఏజెంట్ల రిజిస్ట్రేషన్‌‌కు సంబంధించిన కార్యకలాపాలు ఉన్నాయి, కేటాయింపు దారుల ఫిర్యాదులను పరిష్కరించడం, ప్రోమోటర్ లపై విధించిన బాధ్యతలను కఠినంగా పాటించడం మరియు చట్టం ప్రకారం వివరించిన విధంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన ఆమోదాలు మరియు క్లియరెన్స్‌లను అందించడం లాంటివి ఉంటాయి. ఈ చట్టం స్ఫూర్తిని అమలు చేస్తూ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం మహారాష్ట్ర అని గమనించడం సముచితం.

రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఆస్తి లావాదేవీల గురించి, అనగా కొనుగోలుదారుల యాజమాన్యంలో మార్పుతో సహా, రేరాతో నమోదు చేసుకున్న అన్ని ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబందించిన సమాచారాన్ని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు అందించడమే మహారేరా యొక్క ప్రాథమిక లక్ష్యం. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలలో విశ్వాసాన్ని కలిగించడం మరియు పూర్తి ప్రక్రియలో పారదర్శకతను నిర్వహించడమే దీని ఉద్దేశ్యం. అంతేకాకుండా, మహారేరా రిజిస్ట్రేషన్ చేయని ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిషేధిస్తుంది. కొనుగోలుదారులు, విక్రేతలు, బ్రోకర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మొదలైన రియల్ ఎస్టేట్ ఒప్పందంలో పాల్గొన్న అన్ని పార్టీలకు ఈ చట్టం ప్రయోజనం చేకూరుస్తుంది.

తప్పక చదవండి: రేరా చట్టం: స్థిరాస్తి నియంత్రణ అధికారం కోసం అత్యుత్తమ గైడ్

మహారేరా రిజిస్ట్రేషన్ ప్రక్రియ

మహారాష్ట్రలో ఏదైనా ఆస్తి/ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును కొనుగోలు చేయడానికి లేదా వ్యవహరించడానికి ముందు మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురించి తెలుసుకోవాలి:

  • https://maharerait.mahaonline.gov.in/‌లో మహారేరా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • ‘కొత్త రిజిస్ట్రేషన్‘ పై క్లిక్ చేయండి.
  • ప్రమోటర్, ఫిర్యాదుదారు మరియు రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుండి మూడు ఎంపికలలో ఒక దానిని ఎంచుకోండి.
  • అవసరమైన వివరాలను నమోదు చేసి పాన్ కార్డు, సంప్రదింపు మరియు చిరునామా సమాచారం, గత ప్రాజెక్ట్ వివరాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ మొదలైన వాటితో సహా అవసరమైన డాక్యుమెంట్లను అందజేయండి.
  • ఇతర రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీలను పూర్తి చేయండి.

మహారేరా ప్రయోజనాలు

మహారేరా రియల్ ఎస్టేట్ లావాదేవీలలో పాల్గొన్న అన్ని పార్టీలకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో కొన్ని ఇక్కడ సంగ్రహించబడ్డాయి:

  • అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో పారదర్శకతను నిర్ధారిస్తుంది, అంటే, రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించే వాటిలో కూడా.
  • ట్రాన్సాక్షన్‌లో పాల్గొనే అన్ని పార్టీల ప్రమేయం ఉంటుంది మరియు అటువంటి పార్టీల హక్కులను రక్షిస్తుంది.
  • కార్యాచరణ మరియు ఆర్థిక క్రమశిక్షణను నిర్వహించడానికి కూడా నియమాలను రూపొందిస్తుంది
  • విక్రేతలు కొనుగోలుదారు యొక్క అవసరాలకు కట్టుబడి ఉంటారని మరియు ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో ఫిర్యాదులను పరిష్కరించే విధంగా నిర్ధారిస్తుంది.
  • రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్ట్ వివరాలు, రిజిస్ట్రేషన్ సమాచారం మరియు స్థితి మరియు మరింత సమాచారాన్ని సకాలంలో యాక్సెస్ అందిస్తుంది.
  • స్వాధీనం, మోసపూరిత కార్యకలాపాలు మరియు తప్పుడు ధరల నుండి కొనుగోలుదారులను రక్షిస్తుంది.
  • మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించడానికి కొనుగోలుదారులు మరియు విక్రేతలకు ఒక వేదికను అందిస్తుంది.

మహారాష్ట్రలోని RERA చట్టం యొక్క నియమాలు మరియు నిబంధనలు

రేరా యొక్క నిబంధనలు మరియు నియమాలు విస్తృతంగా ఉన్నప్పటికీ, ముఖ్యమైన అంశాల యొక్క సమగ్ర సారాంశం ఈ కింద ఇవ్వబడింది:

  • మహారేరా వద్ద రిజిస్టర్ చేయబడవలసిన ప్రతి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్ట్ కోసం ఇది తప్పనిసరి.
  • రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమ ప్రస్తుత ప్రాజెక్టుల గురించి క్రమం తప్పకుండా ఒక బాధ్యతగా అప్‌డేట్లను సమర్పించాలి మరియు అది అథారిటీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతిబింబిస్తుంది.
  • అదనపు ఛార్జీలు మరియు జరిమానాలను నివారించడానికి సంబంధిత నిబంధనలను పొందుపరిచే విధంగా నిర్ధారించే అమ్మకాల ఒప్పందాల కోసం ప్రామాణిక ఫార్మాట్.
  • ఆస్తిని విక్రయించిన ఐదు సంవత్సరాలలోపు డెవలపర్లు ఏవైనా లోపాలను సరిచేయాలి.
  • ఏదైనా సూపర్-బిల్ట్ ప్రాంతం కాకుండా ప్రాజెక్ట్ వివరాలలో పేర్కొన్న కార్పెట్ ప్రాంతం కోసం మాత్రమే ఇంటి కొనుగోలుదారులు చెల్లించాలి.
  • ప్రమోటర్లు క్లియర్ చేయబడిన అన్ని ప్రాజెక్ట్ శీర్షికలను వెల్లడించాలి.
  • డెవలపర్లు సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమైతే మరియు స్వాధీనం చేయకపోతే, చెల్లించిన మొత్తం పై వడ్డీని అందుకోవడానికి మరియు పూర్తి మొత్తాన్ని రిఫండ్ పొందడానికి ఇంటి కొనుగోలుదారులు అర్హత కలిగి ఉంటారు .
  • ప్రస్తుత ప్రాజెక్ట్ యొక్క ప్లాన్‌ను మార్చడానికి ముందు, ప్రమోటర్లు ప్రతి సభ్యుని నుండి అనుమతి తీసుకోవడం అవసరం.
  • మహారేరా చట్టం యొక్క అధ్యాయం II లో ఉన్న నిబంధన ప్రకారం ఏజెంట్లు తమను తాము రిజిస్టర్ చేసుకోవాలి.
  • నియమిత అధికారులు 120 రోజుల్లోపు ఇంటి కొనుగోలుదారులు లేవదీసిన ఏవైనా ఫిర్యాదులను పరిష్కరించాలి.

మహారేరా లక్ష్యాలు

రియల్ ఎస్టేట్ రంగంలో ఈ కింది సమస్యలను పరిష్కరించడమే మహారేరా ప్రధాన లక్ష్యం:

  • ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో గణనీయమైన ఆలస్యం.
  • గృహ కొనుగోలుదారులకు తప్పుడు సమాచారం అందించడం.
  • ఇతర ప్రాజెక్టులకు నిధులను తరలించడం.
  • ప్రీ-బుకింగ్లను ఆకర్షించడానికి తప్పుదోవ పట్టించే ఆఫర్లు.
  • విక్రయ ఒప్పందంలో స్వాధీన తేదీ లేకపోవడం.
  • కొనుగోలుదారుల సమ్మతి లేకుండా ప్రాజెక్ట్ ప్లాన్‌ను మార్చడం.

తప్పక చదవండి: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ee - గురించిన పూర్తి వివరాలు

ముగింపు

మహారాష్ట్రలో ఆస్తుల అమ్మకం కొనుగోలు వ్యవహారాలను జరిపేటప్పుడు, మహారేరా పాత్ర గురించిన అవగాహన చాలా అవసరం. కొనుగోలుదారులను మోసాల నుండి రక్షించడానికి, విక్రేతలకు ఆర్థిక భద్రత కోసం భరోసా ఇవ్వడానికి, సకాలంలో ఆస్తి నిర్మాణాన్ని నిర్ధారించడానికి రేరా చట్టం అమలులోకి వచ్చింది. పైన పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి 2017లో మహారేరాను స్థాపించడం జరిగింది. మహారేరా రియల్ ఎస్టేట్ లావాదేవీలను నియంత్రించడం మాత్రమే కాకుండా, ఇంటి కొనుగోలుదారులకు ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాన్ని కూడా అందిస్తుంది మరియు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను క్రమానుగతంగా సమీక్షిస్తుంది.

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్