ఇల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవిత ఆశయం. ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి అనేకసార్లు రుణదాత నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకుంటారు, ఈ ప్రత్యేక రకమైన రుణాన్ని హోమ్ లోన్ అంటారు.
హోమ్ లోన్ ప్రాసెస్‌లో భాగంగా ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ-శాంక్షన్ ఇన్‌స్పెక్షన్, చట్టపరమైన కార్యకలాపాలు మొదలైనటువంటి పనులను నిర్వర్తిస్తాయి, దీని కోసం వారు ఒక నిర్దిష్ట ఫీజును వసూలు చేస్తారు. దీనినే సాధారణంగా హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు అని పిలుస్తారు.
హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు అంటే ఏమిటి?
దరఖాస్తు ఫీజును హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు అని కూడా పిలుస్తారు, లోన్ ప్రాసెసింగ్‌లో భాగంగా ఆర్థిక సంస్థలు వసూలు చేస ఛార్జీలలో ఇది ఒకటి. అనేక సంస్థలు దీనిని ఒకేసారి వసూలు చేస్తున్నప్పటికీ, వాటిలో కొన్ని సంస్థలు ప్రాసెసింగ్ ఫీజును 2 భాగాల్లో అనగా లాగిన్ సమయంలో ఒకసారి, పంపిణీ సమయంలో మరోసారి వసూలు చేస్తున్నాయి. తెలివైన నిర్ణయం తీసుకోవడానికి దరఖాస్తుదారు తాను ఎంచుకున్న రుణదాత వసూలు చేసే హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలను గురించి వివరంగా తెలుసుకోవాలి.
హౌసింగ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు ఎంత?
హౌసింగ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది పూర్తి రుణ మొత్తంలో ఒక శాతంగా ఉంటుంది. హోమ్ లోన్‌ను ఎంచుకోవాలనుకునే వారు తప్పనిసరిగా రుణ సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
అయితే, ఈ మొత్తం వివిధ ఆర్థిక సంస్థల మధ్య భిన్నంగా ఉన్నప్పటికీ, పిఎన్‌బి హౌసింగ్ హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు* ఒక హోమ్ లోన్ కోసం 1%గా ఉంటుంది. కొందరు రుణదాతలు జీరో ప్రాసెసింగ్ ఫీజును కూడా అందిస్తారు. జీతం తీసుకునే కస్టమర్ల కోసం కొన్ని ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. మీరు ప్రస్తుత ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్లను గురించి మీ రుణదాతతో చెక్ చేయవచ్చు.
తప్పక చదవండి: హోమ్ లోన్ కోసం ఉత్తమ క్రెడిట్ స్కోర్ ఏమిటి?
ఒక హోమ్ లోన్ పై వర్తించే ఇతర ఛార్జీల జాబితా
ఒక ఆర్థిక సంస్థ హోమ్ లోన్‌ను మంజూరు చేసినప్పుడు, అది హోమ్ లోన్ కోసం ప్రాసెసింగ్ ఛార్జీలలో చేర్చబడని అనేక ఇతర ఛార్జీలు కూడా తీసుకుంటుంది. ఈ ఛార్జీలు సాధారణంగా ప్రతి ఆర్థిక సంస్థకు బిన్నంగా ఉంటాయి, అలాగే వేర్వేరు పేర్లతో పిలువబడతాయి.
ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు దరఖాస్తుదారు, ఈ కింది ఫీజులు మరియు ఛార్జీలను తెలుసుకోవడం చాలా ముఖ్యం:
ఆస్తి కొరకు ఇన్సూరెన్స్
ఎల్లప్పుడూ ఆస్తి కొరకు ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించబడుతుంది, ఎందుకంటే ఇది ఏదైనా దురదృష్టకర సంఘటనల నుండి మీ ఆస్తిని రక్షిస్తుంది. రుణదాతలు సాధారణంగా ఈ ఛార్జీలను ఇఎంఐలతో పాటు తీసుకుంటారు.
ఆలస్యమైన చెల్లింపు
ఒక రుణగ్రహీత నెలవారీ ఇఎంఐ మిస్ చేసినప్పుడు జరిమానా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. కొందరు రుణదాతల వద్ద ఈ ఛార్జీలు 2% వరకు ఉండవచ్చు. అయితే, పదేపదే చేసే ఆలస్య చెల్లింపులు దరఖాస్తుదారు సిబిల్ స్కోర్‌ను ప్రతికూలంగా చూపిస్తాయి, తద్వారా భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలకు అడ్డంకిని కలిగిస్తాయి.
ప్రీపేమెంట్ ఛార్జీలు
రుణగ్రహీత దాని మెచ్యూరిటీకి ముందే రుణాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, అప్పుడు రుణదాత ముందస్తు చెల్లింపు పై జరిమానా విధించవచ్చు. ఈ ఛార్జీలనే ప్రీ-క్లోజర్ లేదా ఫోర్క్లోజర్ ఛార్జీలు అని కూడా అంటారు.
తప్పక చదవండి: 45 ఏళ్ల తర్వాత హోమ్ లోన్ కోసం అప్లై చేసేందుకు చిట్కాలు
ముగింపు
పిఎన్‌బి హౌసింగ్ ఉద్యోగులకు సంవత్సరానికి 8.75%* మరియు స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారులకు 8.80%* నుండి ప్రారంభమయ్యే అతి తక్కువ వడ్డీ రేట్లకు హోమ్ లోన్లు అందిస్తుంది. హోమ్ లోన్ పై ఆఫర్ చేసే వడ్డీ రేటు కూడా దరఖాస్తుదారు సిబిల్ స్కోర్ మరియు రుణ మొత్తం, మీ ప్రస్తుత అప్పులు, రుణ వ్యవధి మొదలైన ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణం కోసం పొందే వ్యవధి అనేది వ్యక్తి అర్హత మరియు తీసుకునే రుణ మొత్తం పై ఆధారపడి ఉంటుంది.
పిఎన్‌బి హౌసింగ్ వద్ద మీరు ఒక అంకితభావం గల రిలేషన్‌షిప్ మేనేజర్, అనేక రీపేమెంట్ ఆప్షన్లు మరియు కస్టమైజ్డ్ అర్హత ప్రోగ్రామ్‌ల మద్దతుతో పాటు తక్కువ హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజును ఆస్వాదించవచ్చు.
గమనిక:- పైన పేర్కొన్న ఫీజులు/ఛార్జీలు మరియు రేట్లు కంపెనీ అభీష్టానుసారం మార్పుకు లోబడి ఉంటాయి.