నిధుల కొరత ఏర్పడితే లేదా మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే, మీరు దేనిని ఎంచుకుంటారు?? ఒకటి తాకట్టు లోన్, దీనినే తనఖా రుణంగా కూడా పిలుస్తారు. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక సులభమైన మరియు అత్యంత ప్రముఖమైన ఆర్థిక పరిష్కారాలలో ఒకటి.
సాధారణంగా, తనఖా రుణాలు త్వరగా ఆమోదించబడతాయి మరియు తక్కువ వడ్డీ రేటుతో వస్తాయి.
తనఖా రుణం అంటే ఏమిటి?
తనఖా లోన్ అనేది ఒక సెక్యూర్డ్ లోన్, మీరు మీ నివాస మరియు వాణిజ్య ఆస్తిని పూచీకత్తుగా ఉంచి దీనిని పొందవచ్చు. సులభమైన నెలవారీ వాయిదాల్లో రుణాన్ని చెల్లించవచ్చు. రుణదాతలు సాధారణంగా, రుణగ్రహీతకు అనుకూలంగా స్పష్టమైన యాజమాన్య శీర్షికలతో రెడీగా ఉండే ఇండ్లు మరియు వాణిజ్య స్థలాలను ఇష్టపడతారు. అయితే, రీపేమెంట్ అవధి 20 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
రుణదాత, తనఖా లోన్‌ను ఎలా ఖర్చు చేయవచ్చనే దానిపై ఎలాంటి పరిమితులను విధించలేదు. అందుకే రుణగ్రహీతలు ఇంటి రెనోవేషన్, వ్యాపార విస్తరణ, వైద్య అత్యవసర పరిస్థితులు, పిల్లల ఉన్నత విద్య మొదలైనటువంటి వివిధ ఆర్థిక అవసరాల కోసం ఈ రుణాలను కోరుకుంటారు.
తనఖా రుణం యొక్క ప్రయోజనాలు
తనఖా లోన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, చాలా మంది రుణగ్రహీతలు దీనిని ఎంచుకుంటారు. ఈ రకమైన రుణం పొందడం వల్ల కలిగే కొన్ని అగ్ర ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి:
- మీరు తాకట్టు పెట్టే ఆస్తికి మీరే చట్టపరమైన యజమానిగా ఉంటారు.
- తనఖా రుణం అనేది ఒక సెక్యూర్డ్ రుణం మరియు మరింత వేగంగా ఆమోదించబడుతుంది.
- పర్సనల్ లోన్ల కన్నా తనఖా లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.
తప్పక చదవండి: ఆస్తి పై రుణం అంటే ఏమిటి?
తనఖా లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్
ఏదైనా రుణం కోసం మీరు సాధారణ డాక్యుమెంట్లను అందించాలి, ఇందులో గుర్తింపు రుజువు, వయస్సు రుజువు, నివాస రుజువు మరియు ఆదాయ రుజువు ఉంటాయి. మీరు తనఖా లోన్ కోసం తాకట్టు పెట్టాలనుకుంటున్న ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అవసరమవుతాయి.
తనఖా లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:
- ఐడెంటిటీ ప్రూఫ్: ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్
- నివాస రుజువు: డ్రైవింగ్ లైసెన్స్, యుటిలిటీ బిల్లులు
- ఆదాయ రుజువు: జీతం స్లిప్పులు, ఐటిఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు
- ఆస్తి రుజువు: ఆస్తి యాజమాన్య డాక్యుమెంట్లు, సేల్స్ డీడ్
తనఖా లోన్ కోసం అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 ముఖ్యమైన అంశాలు
1. లోన్ కాలం
లోన్ అవధి మొదటి అంశం. తనఖా లోన్లు సెక్యూర్డ్ లోన్లు కాబట్టి, రుణదాతలు సాధారణంగా 20 సంవత్సరాల వరకు ఎక్కువ రీపేమెంట్ వ్యవధిని అందించవచ్చు, ఇది దరఖాస్తుదారు వయస్సు, ఆదాయం మరియు ఇతర అర్హత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.
2. లోన్ మొత్తం
తదుపరి అంశం లోన్ అమౌంట్. రుణ ప్రదాతలు భౌతికపరమైన ఆస్తి భద్రతను కలిగి ఉన్నందున, ఆస్తి విలువను బట్టి పెద్ద రుణ మొత్తాన్ని అందించవచ్చు. అయితే, దీనికి ముందు రుణదాత తగిన పరిశీలన నిర్వహిస్తారు మరియు ఆస్తి విలువను అంచనా వేస్తారు. అంతే కాకుండా, రుణం పంపిణీ చేయడానికి ముందు దరఖాస్తుదారు వయస్సు, ఆదాయం, గత చెల్లింపు చరిత్ర మరియు క్రెడిట్ రేటింగ్ స్కోర్ పరిగణనలోకి తీసుకోబడతాయి.
3. వడ్డీ రేటు
మూడవ ముఖ్యమైన అంశం వడ్డీ రేటు. ఇంతకుముందే చెప్పినట్లుగా, తనఖా లోన్ వడ్డీ రేట్లు అన్‍సెక్యూర్డ్ లోన్ల కంటే తక్కువగా ఉంటాయి. రుణం ఎంత ఎక్కువగా సురక్షితం చేయబడితే వడ్డీ రేట్లు అంత తక్కువగా ఉంటాయి మరియు విలోమానుపాతంలో ఉంటాయి. డబ్బు నష్టం తక్కువగా ఉండే చోట, రుణదాతలు తక్కువ వడ్డీ రేట్లను అందించగలరు.
4. ఎలాంటి ప్రీపేమెంట్ జరిమానా లేదు
వ్యక్తిగత సామర్థ్యంతో తనఖా లోన్ పొందినప్పుడు, చాలా మంది రుణదాతలు ప్రీ-పేమెంట్ జరిమానా వసూలు చేయరు.
5. ప్రాసెసింగ్ సమయం
ఐదవది రుణాన్ని ప్రాసెస్ చేయడంలో తీసుకున్న సమయానికి సంబంధించినది. పర్సనల్ లోన్ల మాదిరిగా కాకుండా ఇది కొన్ని రోజుల వ్యవధిలో ప్రాసెస్ చేయబడుతుంది, ఎందుకంటే, రుణదాతలు ఆస్తి మరియు దాని డాక్యుమెంట్ల సరైన పరిశీలనను నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున, తనఖా లోన్ కోసం సమయం పడుతుంది. ఆస్తి యొక్క ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయించడానికి, ఆస్తి విలువను మూల్యాంకనం చేయబడుతుంది. ఈ పరిశీలనలు అన్నీ కూడా లోన్ ప్రాసెసింగ్ సమయాన్ని ఆదా చేస్తాయి.
తప్పక చదవండి: ఆస్తిపై రుణాన్ని ఎలా పొందాలి?
6. అర్హత
గరిష్ట రుణ మొత్తాన్ని అందించడానికి అనుకూలీకరించిన అర్హత ప్రోగ్రామ్‌లను అందించే రుణదాత కోసం వెతకడం ఆరవ ప్రధాన అంశం. అలాంటి రుణదాత లోన్ పంపిణీ తర్వాత నాణ్యమైన సేవలను అందించే స్థితిలో ఉండాలి. ఎందుకంటే, ఈ సంబంధం 20 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఈ సేవలలో డిజిటల్ విధానాల్లో కూడా ఉండాలి, ఇది కస్టమర్లకు సౌలభ్యం, వేగం మరియు అవాంతరాలు లేని అనుభవాన్ని నిర్ధారిస్తుంది.
7. రుణ మొత్తం కోసం ఇన్సూరెన్స్ కవర్
చివరగా, ఏదైనా ఊహించని లేదా దురదృష్టకర సంఘటనల నుండి రుణగ్రహీత మరియు అతని/ఆమె కుటుంబాన్ని రక్షించేందుకు, వారి భద్రతను నిర్ధారించడానికి రుణదాత ఒక రైడర్‌గా రుణ మొత్తానికి ఇన్సూరెన్స్ కవర్ ద్వారా అదనపు భద్రతను కల్పించాలి.
సాధారణంగా, ఆస్తిపై లోన్ ప్రయోజనాల్లో తక్కువ వడ్డీ రేట్లు, అధిక రుణ మొత్తం, ఎక్కువ సౌలభ్యం, రీపేమెంట్ కోసం సుదీర్ఘ అవధి, ఇన్సూరెన్స్ కవర్ మరియు పంపిణీ తర్వాత అద్భుతమైన సేవలు అందించబడతాయి.
ముగింపు
చివరగా, తనఖా లోన్ అంటే ఏమిటి అనే దానిపై స్పష్టత పొందడానికి ఈ ఆర్టికల్ మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము. దరఖాస్తుదారు అవసరమైన డాక్యుమెంట్లను అందజేస్తే, తనఖా లోన్ తక్షణమే ఆమోదించబడుతుంది. ఎలాంటి ఆర్థిక అవసరాలనైనా తీర్చుకోవడానికి ఈ రుణ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు.