హోమ్ లోన్ వడ్డీ రేట్లు - 2024 లో ప్రస్తుత హౌసింగ్ లోన్ రేట్లను తనిఖీ చేయండి
ఎన్‌ఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్‌ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్‌డేట్:
-
english
శోధించండి ఆన్లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్‌డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
మీ ఆస్తి విలువలో
90% వరకు హోమ్ లోన్ పొందండి
హోమ్ లోన్
వడ్డీ రేటు
మీ హోమ్ లోన్ వడ్డీ రేట్లు చాలా వరకు తక్కువగా మరియు సరసమైనవిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కావుననే, మేము జీతం పొందే లేదా స్వయం ఉపాధిగల దరఖాస్తుదారులందరికీ ఆకర్షణీయమైన హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లు అందిస్తున్నాము.
*గమనిక: పిఎన్‌బి హౌసింగ్ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లకు హోమ్ లోన్లను అందిస్తుంది.
మీ క్రెడిట్ స్కోర్‌కు లోబడి ఆఫర్‌పై హోమ్ లోన్ రేట్లు.
క్రెడిట్ స్కోర్ | జీతం పొందే వారికి | జీతం పొందని వారికి |
---|---|---|
>=825 | 8.5% నుండి 9% | 8.8% నుండి 9.3% |
>800 to 825 | 8.8% నుండి 9.3% | 8.95% నుండి 9.45% |
>775 నుండి 799 | 9.1% నుండి 9.6% | 9.65% నుండి 10.15% |
>750 నుండి <=775 | 9.25% నుండి 9.75% | 9.8% నుండి 10.3% |
> 725 నుండి < =750 | 9.55% నుండి 10.05% | 10.25% నుండి 10.75% |
> 700 నుండి <= 725 | 9.85% నుండి 10.35% | 10.55% నుండి 11.05% |
>650 నుండి <=700 | 10.25% నుండి 10.75% | 10.75% నుండి 11.25% |
650 వరకు | 10.25% నుండి 10.75% | 10.75% నుండి 11.25% |
ఎన్‌టిసి సిబిల్ >=170 | 10.25% నుండి 10.75% | 10.65% నుండి 11.15% |
ఎన్‌టిసి సిబిల్ <170 | 10.15% నుండి 10.65% | 10.55% నుండి 11.05% |
హోమ్ లోన్ కోసం ఫిక్స్‌డ్ రేటు – 14.75%
*పిఎన్‌బి హౌసింగ్ యొక్క స్వంత అభీష్టానుసారం వడ్డీ రేటు మారవచ్చు.
**ఎన్‌టిసి: కొత్తగా క్రెడిట్ పొందేవారు
అధిక హోమ్ లోన్ మొత్తం అవసరమైన దరఖాస్తుదారులు. మరిన్ని వివరాల కోసం క్రింది పట్టికను తనిఖీ చేయండి మరియు మీ హోం లోన్ పత్రాలు
సిద్ధంగా ఉంచుకోండి!
క్రెడిట్ స్కోర్ | జీతం పొందే వారికి | జీతం పొందని వారికి |
---|---|---|
>=825 | 8.5% నుండి 9% | 8.8% నుండి 9.3% |
>800 to 825 | 8.8% నుండి 9.3% | 8.95% నుండి 9.45% |
>775 నుండి 799 | 9.2% నుండి 9.7% | 9.8% నుండి 10.3% |
>750 నుండి =775 | 9.35% నుండి 9.85% | 10.15% నుండి 10.65% |
>725 to =750 | 9.7% నుండి 10.2% | 10.3% నుండి 10.8% వరకు |
>700 to = 725 | 10.05% నుండి 10.55% | 10.75% నుండి 11.25% |
>650 to = 700 | 10.45% నుండి 10.95% | 10.95% నుండి 11.45% |
650 వరకు | 10.45% నుండి 10.95% | 10.95% నుండి 11.45% |
ఎన్‌టిసి సిబిల్ >=170 | 10.45% నుండి 10.95% | 10.85% నుండి 11.35% |
ఎన్‌టిసి సిబిల్ <170 | 10.35% నుండి 10.85% | 10.75% నుండి 11.25% |
భారతదేశంలో ఆదాయం, రుణ మొత్తం, ఉపాధి రకం, సిబిల్ స్కోర్ మొదలైనటువంటి అనేక అంశాలు హౌసింగ్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేస్తాయి, కస్టమర్లు తక్కువ వడ్డీ రేటు కోసం వారి అర్హతను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.
భారతదేశంలో సాధ్యమైనంత ఉత్తమ హోమ్ లోన్ వడ్డీ రేట్లను మీరు ఎలా పొందవచ్చు అనే దానిపై ఇక్కడ కొన్ని ప్రయోజనకరమైన చిట్కాలు ఉన్నాయి:
మీ డౌన్ పేమెంట్ మరియు కాలపరిమితిని పెంచండి: సాధారణంగా, అధిక రుణ మొత్తాలతో పోలిస్తే ₹35 లక్షల వరకు హోమ్ లోన్ మొత్తం తక్కువ వడ్డీ రేటుకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల, మీ రుణ మొత్తాన్ని తగ్గించడానికి డౌన్ పేమెంట్ రూపంలో సాధ్యమైనంత వరకు చెల్లించేందుకు ప్రయత్నించండి. అదనంగా, మీ ఇఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి 15-20 సంవత్సరాల కంటే ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకోండి.
సరైన వడ్డీ రేటును ఎంచుకోండి: స్థిరమైన వడ్డీ రేటు మీకు నిర్ణీత కాలానికి స్థిర ఇఎంఐ ఖర్చును అందిస్తుండగా, మార్కెట్ వడ్డీ రేట్లలో ఏదైనా హెచ్చుతగ్గుల కారణంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటు అనేది మీ లోన్ వ్యవధిని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. సాధారణంగా, మునుపటి కంటే తదుపరిది కొంత మేరకు ఎక్కువగా ఉంటుంది. కానీ, స్థిరమైన వడ్డీతో వచ్చే హోమ్ లోన్లు మార్కెట్లో చాలా అరుదుగా అందుబాటులో ఉన్నవి. అయితే, వడ్డీ రేట్లను అర్థం చేసుకోవడానికి మీరు మీ రుణదాతతో చెక్ చేసుకోవాలి.
ఆదాయం మరియు ఉపాధి స్థితికి సంబంధించిన అంశం: హోమ్ లోన్ దరఖాస్తుదారు స్థిరమైన, తగినంత ఆదాయాన్ని కలిగి ఉండాలి మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను పొందేందుకు పిఎస్‌యు లేదా ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవారై ఉండాలి
మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచండి: మీరు 750+ క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉంటే, రుణదాతలు మీ హోమ్ లోన్ అర్హతను మరింత అనుకూలంగా చూస్తారని చెప్పనవసరం లేదు. కావున, తక్కువ వడ్డీ హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ క్రెడిట్ యోగ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి.
మహిళా దరఖాస్తుదారుని పరిగణించండి: చాలా మంది రుణదాతలు మహిళా హోమ్ లోన్ దరఖాస్తుదారులకు వడ్డీ రేటులో కొంత రాయితీని అందజేస్తారని మీకు తెలుసా? మీరు ఒక మహిళను ప్రాథమిక దరఖాస్తుదారుగా చేయడం వలన, తక్కువ హౌసింగ్ లోన్ వడ్డీ రేటు పొందే అవకాశాలు ఉన్నాయో లేదో మీ రుణదాతతో చెక్ చేసుకోండి.
హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను ఎంచుకోండి: హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం అనేది, ఇప్పటికే ఒక హోమ్ లోన్‌ను కలిగి ఉన్న ఎవరైనా వారి మిగిలిన మొత్తాన్ని మరింత అనుకూలమైన నిబంధనలను అందించే మరొక రుణదాతకు బదిలీ చేసేందుకు అనుమతిస్తుంది. లోన్ అవధి మధ్యలో తక్కువ హోమ్ లోన్ వడ్డీని పొందేందుకు ఇది ఒక గొప్ప మార్గం.
ప్రోమోలు మరియు ఆఫర్ల కోసం చూడండి: ఏదైనా పండుగ సీజన్ ఆఫర్లు, రుణదాతల టై-అప్‌లు లేదా ప్రత్యేక ప్రోమోలు అందుబాటులో ఉన్నప్పుడు దీనిని ఎంచుకోండి- హోమ్ లోన్. చాలా వరకు ఈ ఆఫర్లు మీకు మార్కెట్లో కన్నా కొంచెం మెరుగైన హోమ్ లోన్ వడ్డీ రేటును అందిస్తాయి.
ప్రతి ఒక్కరూ వీలైనంత తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్ పొందాలనుకుంటారు. మా హోమ్ లోన్ క్యాలిక్యులేటర్‌లో మీరు అర్హత పొందిన వడ్డీ రేటును నమోదు చేయడం ద్వారా, మీరు మొత్తానికి ఎంత హోమ్ లోన్ వడ్డీని చెల్లించాలి అనే దానిపై ఒక ఖచ్చితమైన మరియు తక్షణ అంచనాను పొందవచ్చు. కానీ, ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది, కొన్నిసార్లు ఇది హోమ్ లోన్‌ను మీకు మరింత సరసంగా చేస్తుంది!
హోమ్ లోన్ పై అనుకూలమైన వడ్డీ రేటును గురించి ఆలోచిస్తున్నప్పుడు, మీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే ఈ 8 అంశాలను గుర్తుంచుకోండి:
ఆదాయం: సహజంగా, మీ నెలవారీ ఆదాయం మొత్తం మరియు స్వభావం రుణదాతకు మీ లోన్ తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని వివరంగా తెలుపుతుంది. అది ఎంత రెగ్యులర్‌గా, స్థిరంగా మరియు ఎక్కువగా ఉంటే, మీకు ఒక హోమ్ లోన్ పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులు అంత తక్కువగా ఉంటాయి. పర్యవసానంగా, మీ వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది!
రుణ మొత్తం: అయితే, మీరు ఎంత మొత్తంలో రుణాన్ని ఎంచుకుంటున్నారనే దానిపై అన్ని హోమ్ లోన్ లెక్కింపులు చేయబడతాయి. హోమ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌లో అది గమనించవచ్చు! సాధారణంగా, అధిక రుణ మొత్తాలు అధిక వడ్డీ రేటును ఆకర్షిస్తాయి.
వడ్డీ రేటు రకం: మీరు స్థిరమైన వడ్డీ రేటు మరియు ఫ్లోటింగ్ వడ్డీ రేటు, ఈ రెండింటి మధ్యలో ఎంచుకోవడం ద్వారా మీకు అనుకూలమైన హోమ్ లోన్ వడ్డీ రేటును పొందవచ్చు. మొదటిది తరచూ ఎక్కువగా ఉంటుంది, అలాగే, రెండవది హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది.
క్రెడిట్ స్కోర్: లోన్ ప్రాసెసింగ్ సమయంలో అవసరమయ్యే అతి ముఖ్యమైన హోమ్ లోన్ డాక్యుమెంట్లలో మీ క్రెడిట్ రిపోర్ట్ ఒకటి. మంచి క్రెడిట్ చరిత్ర మరియు స్కోర్‌ను కలిగి ఉండటం అంటే, సాధారణంగా 750+ సిబిల్ స్కోర్ అనేది తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు పొందేందుకు మీకు అర్హత కల్పిస్తుంది.
ఉద్యోగం రకం: మీ ఆదాయం కూడా రుణ మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక అంశం అని మేము పేర్కొన్నాము, గుర్తుందా? అలాగే, మీ ఆదాయ రకం, అనగా మీ ఉపాధి రకం కూడా ఒక ప్రధాన అంశం. నియమం ప్రకారం, ప్రతి రుణదాత జీతం పొందే మరియు స్వయం ఉపాధిగల దరఖాస్తుదారుల కోసం ప్రత్యేక వడ్డీ రేటు స్లాబ్‌లను ఆఫర్ చేస్తారు. వాటిని సరిపోల్చినప్పుడు, జీతం పొందే దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.
హోమ్ లోన్ రకం: మీరు తీసుకోవాలనుకుంటున్న హోమ్ లోన్ రకాన్ని బట్టి కూడా వడ్డీ రేట్లు మారవచ్చు. సాధారణ హోమ్ లోన్లతో పోలిస్తే ప్లాట్ లోన్లు, ల్యాండ్ లోన్లు లేదా టాప్-అప్ లోన్లు లాంటి ప్రత్యేకమైన హోమ్ లోన్లు అధిక వడ్డీ రేటును ఆకర్షిస్తాయి.
01 సెప్టెంబర్'2024 నాడు మరియు తర్వాత రుణం పొందిన కస్టమర్ల కోసం (లోన్ పంపిణీ చేయబడింది) పిఎన్‌బిఆర్ఆర్ఆర్ 13.25%
25 సెప్టెంబర్ 2020 నాడు మరియు తర్వాత కొత్త కస్టమర్లకు (పంపిణీ చేయబడిన లోన్) పిఎన్‌బిహెచ్ఎఫ్ఆర్ సిరీస్ 5 బేస్ రేటు 2020 ఈ క్రింది విధంగా ఉంటుంది:
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - జీతం పొందేవారు/ స్వయం-ఉపాధిగల వృత్తి నిపుణులు: సంవత్సరానికి 12.90%.
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - వ్యాపారవేత్త /స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్: సంవత్సరానికి 13.50%.
తేదీన మరియు ఆ తర్వాత పొందిన కొత్త కస్టమర్ల (లోన్ పంపిణీ చేయబడిన) కోసం పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ సిరీస్ 4 మార్చ్ 16, 2020 ఈ కింది విధంగా ఉంది:
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - జీతం పొందేవారు/ స్వయం-ఉపాధిగల వృత్తి నిపుణులు: సంవత్సరానికి 11.30%.
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - వ్యాపారవేత్త /స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్: సంవత్సరానికి 11.35%.
01 జూన్, 2019 నాడు మరియు ఆ తర్వాత (రుణ పంపిణీ) పొందిన కొత్త కస్టమర్ల కోసం పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ సిరీస్ 3 ఈ కింది విధంగా ఉంటుంది:
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - జీతం పొందేవారు/ స్వయం-ఉపాధిగల వృత్తి నిపుణులు: సంవత్సరానికి 11.65%.
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - వ్యాపారవేత్త /స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్: సంవత్సరానికి 11.70%.
తేదీన మరియు ఆ తర్వాత పొందిన కొత్త కస్టమర్ల (లోన్ పంపిణీ చేయబడిన) కోసం పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ సిరీస్ 2 మార్చ్ 06, 2019 ఈ కింది విధంగా ఉంది:
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - జీతం పొందేవారు/స్వయం-ఉపాధిగల వృత్తి నిపుణులు: సంవత్సరానికి 12.04%.
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - వ్యాపారవేత్త /స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్: సంవత్సరానికి 12.10%.
తేదీన మరియు ఆ తర్వాత పొందిన కొత్త కస్టమర్ల (లోన్ పంపిణీ చేయబడిన) కోసం పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ సిరీస్ 1 జూలై 01, 2018 ఈ కింది విధంగా ఉంది:
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - జీతం పొందేవారు/స్వయం-ఉపాధిగల వృత్తి నిపుణులు: సంవత్సరానికి 12.15%.
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - వ్యాపారవేత్త /స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్: సంవత్సరానికి 12.30%.
01 మార్చి, 2017 – 30 జూన్, 2018 మధ్య (రుణ పంపిణీ) పొందిన ప్రస్తుత కస్టమర్ల కోసం పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ సిరీస్ 0, ఈ కింది విధంగా ఉంటుంది:
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - జీతం పొందేవారు/స్వయం-ఉపాధిగల వృత్తి నిపుణులు: సంవత్సరానికి 12.25%.
పిఎన్బిహెచ్ఎఫ్ఆర్ హోమ్ లోన్ - వ్యాపారవేత్త /స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్: సంవత్సరానికి 12.30%.
ఇంతకు ముందు ఉన్న కస్టమర్ల (లోన్ పంపిణీ పొందిన) కోసం పిఎన్‌బిహెచ్ఎఫ్ఆర్ మార్చ్ 01, 2017: సంవత్సరానికి 17.47%.
అధ్యయనం కోసం సిఫార్సు చేయబడినవి
హోమ్ లోన్ బ్లాగులు










హోమ్ లోన్ వడ్డీ రేటుకు సంబంధించినది
సాధారణ ప్రశ్నలు
ప్రతి రుణదాత మీరు వారి నుండి అప్పుగా తీసుకున్న పూర్తి హోమ్ లోన్ మొత్తంపై వడ్డీ వసూలు చేస్తారు. ఈ వడ్డీ మొత్తం హోమ్ లోన్ వడ్డీ రేటు అనే శాతం ఆధారంగా లెక్కించబడుతుంది. ఒక హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు, హోమ్ లోన్ మొత్తం మరియు లోన్ అవధిని నమోదు చేయడం ద్వారా, మీరు ఏదైనా ఇవ్వబడిన హోమ్ లోన్ మొత్తం కోసం నెలవారీ చెల్లించవలసిన ఇఎంఐ అలాగే మొత్తం వడ్డీ భాగాన్ని నిర్ణయించవచ్చు! పిఎన్‌బి హౌసింగ్ వద్ద, మీరు మా సులభమైన అర్హత ప్రమాణాలను నెరవేర్చినంత వరకు మార్కెట్లో ఉత్తమ హోమ్ లోన్ రేట్లను పొందుతారు.
ఎల్లప్పుడూ దేశవ్యాప్తంగా హోమ్ లోన్ రేట్లు సాధారణంగా మార్కెట్ మరియు ఇతర అంశాలపై ఆధారపడి దాదాపు ఒకేలా ఉంటాయి. నేడు పిఎన్‌బి హౌసింగ్ వద్ద హోమ్ లోన్ వడ్డీ రేటు సంవత్సరానికి 8.75%* నుండి ప్రారంభం అవుతుంది. అయితే, ఇది అంతిమ వడ్డీ రేటు కాదు. వాస్తవానికి మీరు పొందే వడ్డీ రేటు అనేది మీ ఆదాయం, రుణ మొత్తం, వడ్డీ రేటు రకం, క్రెడిట్ స్కోర్, హోమ్ లోన్ రకం మొదలైనటువంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మీకు వర్తించే కనీస హోమ్ లోన్ వడ్డీ రేటు తరచుగా మార్కెట్ పరిస్థితులు మరియు దరఖాస్తుదారు ఆదాయం, ఉపాధి రకం, క్రెడిట్ స్కోర్, హోమ్ లోన్ మొత్తం, ఎంచుకున్న వడ్డీ రకం మొదలైన ఇతర అంశాలకు లోబడి ఉంటుంది. అందువల్ల, ఇది ప్రతి రుణదాతకు మరియు ప్రతి దరఖాస్తుదారునికి మారుతుంది.
వ్యక్తులు గత 30 నిమిషాల్లో అప్లై చేశారు.
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.