విదేశాలలో పని చేయడానికి లేదా అక్కడ నివాసం ఏర్పరుచుకోవడానికి అనేక మంది భారతీయలు ప్రతి సంవత్సరం దేశాన్ని విడిచి వెళుతున్నారు, 'ఎన్ఆర్ఐ' (నాన్ రెసిడెంట్ ఇండియన్) అనే పదం వాడుక భాషలో బహుళ ప్రచారం పొందింది. విదేశంలో నివాసం ఏర్పరుచుకున్న ప్రతి భారతీయునికి తమ మాతృదేశంతో సంబంధం కొనసాగించాలని ఉంటుంది. భారతదేశంలో ఒక నివాసం ఉంటే, ఈ దేశంలో భాగం అనే భావనను అందిస్తుంది. మరియు ఒక ఇంటిని కొనుగోలు చేసే విషయంలో సాధారణంగా ఒక హోమ్ లోన్ కోసం కూడా అప్లై చేయవలసి ఉంటుంది. భారతదేశంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి అందించే హోమ్ లోన్‌తో పోలిస్తే, ఎన్ఆర్ఐ హోమ్ లోన్స్ కోసం ఉన్న అర్హతా ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి, కానీ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.
అప్లై చేయడానికి ముందు ఎన్ఆర్ఐ హోమ్ లోన్లకు సంబంధించిన వివిధ అర్హతా నిబంధనల గురించి ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
- ఉపాధి వ్యవధి మరియు వేతనం: సాధారణంగా, ఒక జీతం పొందే ఎన్‌ఆర్‌ఐ కనీసం ఒక సంవత్సరం పాటు విదేశంలో ఉద్యోగం చేసి ఉండాలి. అయితే, ఈ అర్హతలు ప్రతి రుణదాత వద్ద భిన్నంగా ఉండవచ్చు. రుణ సంస్థలు ఒక నిర్దిష్ట కనీస జీతం నిబంధనను అనుసరిస్తాయి, ఇది ప్రతి రుణదాతకు మారుతుంది. రుణదాత యొక్క విశ్వాసం ఉద్యోగం మరియు ఆదాయ స్థిరత్వం మీద ఆధారపడి ఉన్నందున ఉపాధి అవధి మరియు వేతనం ముఖ్యమైన పారామితులుగా ఉంటాయి.
- క్రెడిట్ రేటింగ్ మరియు ఇప్పటికే ఉన్న బాధ్యతల రీపేమెంట్ ట్రాక్: ఒక మంచి క్రెడిట్ స్కోర్ మరియు అవాంతరాలు లేని బాధ్యత రీపేమెంట్ ట్రాక్ ఒక హోమ్ లోన్ అప్లికెంట్ యొక్క ఫైనాన్షియల్ ప్రొఫైల్‌కు విలువను జోడిస్తుంది మరియు అప్లికేషన్ అంగీకారం గురించి సానుకూల నిర్ణయాన్ని పొందడానికి సహాయపడుతుంది.
- లోన్ అవధి: సాధారణ రీపేమెంట్ అవధి 15 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే, కొందరు రుణదాతలు 20 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిని అందిస్తారు ఇందులో మెచ్యూరిటీ వద్ద గరిష్ట వయస్సు కొన్ని నిర్దిష్ట వృత్తులలో ఉన్నవారికి 70 సంవత్సరాల వరకు ఉంటుంది
- డాక్యుమెంటేషన్: అవసరమైన డాక్యుమెంట్లలో చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కాపీ, వర్క్ పర్మిట్ లేదా వీసా కాపీ, జీతం సర్టిఫికెట్, ఉపాధి ఒప్పందం, బ్యాంక్ స్టేట్‌మెంట్లు (ఎన్ఆర్ఇ/ఎన్‌ఆర్‌ఒ అకౌంట్లు) మరియు పని అనుభవ సర్టిఫికెట్ ఉంటాయి.
- పవర్ ఆఫ్ అటార్నీ: భారతదేశంలో ఫార్మాలిటీలు మరియు డాక్యుమెంటేషన్ విధానాలను పూర్తి చేయడానికి అప్లికెంట్ భారతదేశంలో పవర్ ఆఫ్ అటార్నీ (పిఒఎ) హోల్డర్‌గా తమ బంధువులలో ఎవరినైనా నియమించవచ్చు. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న అదే నగరం నుండి పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ఉండడం అనుకూలంగా ఉంటుంది
చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి మరియు రుణ మొత్తాన్ని పంపిణీ చేయడానికి ఎన్ఆర్ఇ/ఎన్‌ఆర్‌ఒ అకౌంట్లు అవసరం. అయితే, బిల్డర్ ఆస్తుల కోసం, పంపిణీని నేరుగా బిల్డర్ యొక్క అకౌంటులోకి డెబిట్ చేయబడుతుంది
హౌసింగ్ ఫైనాన్స్‌లో రెండు దశాబ్దాలకు పైగా ప్రత్యేక అనుభవంతో, పిఎన్‌బి హౌసింగ్ ఎన్ఆర్ఐలకు (నాన్ రెసిడెంట్ ఇండియన్స్) మరియు పిఐఒలకు (భారత సంతతికి చెందిన వ్యక్తి) భారతదేశంలో ఒక రెసిడెన్షియల్ ఆస్తి కొనుగోలు, నిర్మాణం, మరమ్మత్తు మరియు పునరుద్ధరణ కోసం విస్తృత శ్రేణి హోమ్ లోన్ ప్రోడక్టులను అందిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్రాంచ్‌లు, బలమైన సర్వీస్ డెలివరీ మోడల్ మరియు మార్క్ టు మార్కెట్ క్రెడిట్ మరియు ఫైనాన్షియల్ పాలసీలు కస్టమర్‌లకు నమ్మకం మరియు నిబద్ధత దీర్ఘకాలిక సంబంధాన్ని నిర్మించడానికి సహాయపడతాయి.