ప్రస్తుత సందర్భంలో ముఖ్యంగా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయం మరియు పొదుపు చేసిన డబ్బుకు మించి అదనపు డబ్బు అవసరం ఏర్పడటం సాధారణ విషయం. ఈ డబ్బును పొందడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఎంచుకునే మార్గం పర్సనల్ లోన్. త్వరిత మంజూరు మరియు ఇంకా వేగవంతమైన పంపిణీ డబ్బును పొందడానికి ఇది ఒక లాభదాయకమైన మార్గం. కానీ, ఈ రకమైన లోన్ ఇది మాత్రమే కాదు. ఆస్తి పై లోన్ (ఎల్ఎపి) అనేది ఇటువంటి ప్రయోజనాలు కలిగి ఉన్న మరొక వనరు, కానీ ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు.
ఆస్తి పై లోన్ అనేది సెక్యూర్డ్ రూపంలో ఉన్న లోన్, ఇది స్వంతమైన లేదా ఒక హోమ్ లోన్ కింద ఉన్న ఆస్తి పై ఒక ఆర్థిక సంస్థ నుండి తీసుకునే రుణం. పరిగణనలో ఉన్న ఆస్తి యొక్క ప్రస్తుత మార్కెట్ విలువను తెలుసుకోవడానికి మదింపు చేయబడుతుంది మరియు ఈ విలువలో కొంత శాతం రుణం రూపంలో పంపిణీ చేయబడుతుంది, దీనిని లోన్ టు వాల్యూ (ఎల్‌టివి) అని పేర్కొంటారు. ఇతర అంశాలు కూడా ఉన్నాయి, అవి రీపేమెంట్ సామర్థ్యం, రుణం కోసం కారణం, మొదలైనవి, వీటిని డబ్బును మంజూరు చేయడానికి ముందు మదింపు చేస్తారు. ముందే నిర్ణయించబడిన వడ్డీ రేటు వద్ద పేర్కొనబడిన అవధి కోసం ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు (ఇఎంఐలు) వద్ద రుణం తిరిగి చెల్లించబడుతుంది. పిల్లల పెళ్లి, బిజినెస్ లోన్, విద్య మరియు ఇటువంటి మరిన్ని కారణాల కోసం కస్టమర్ ఎల్ఎపి ని పొందవచ్చు.
పర్సనల్ లోన్ అనేది ఒక బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) నుండి వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి తీసుకున్న ఒక రకమైన లోన్. పర్సనల్ లోన్లు పొందేటప్పుడు ఆదాయ స్థాయి, క్రెడిట్ మరియు ఉపాధి చరిత్ర, రీపేమెంట్ సామర్థ్యం మొదలైనవి ముఖ్యమైన ప్రమాణాలు. అటువంటి లోన్లు అన్‍సెక్యూర్డ్ కాబట్టి, రుణగ్రహీత దానిని పొందడానికి బంగారం లేదా ఆస్తి వంటి ఏదైనా కొలేటరల్ ఉంచవలసిన అవసరం లేదు.
అయితే, ఇతర రుణాలతో పోలిస్తే పర్సనల్ లోన్ల పై వడ్డీ రేట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి ఎందుకంటే అవి అన్‍సెక్యూర్డ్ రూపంలో ఉంటాయి మరియు ఈ లోన్లను పంపిణీ చేసేటప్పుడు ఆర్థిక సంస్థ ఎక్కువ రిస్క్ ఎదుర్కొంటుంది. పర్సనల్ లోన్ల అవధి కూడా సాధారణంగా ఆస్తి పై లోన్ కంటే తక్కువగా ఉంటుంది.
తప్పక చదవండి: ఇంటిని కొనుగోలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నారా? సరైన సమయం ఇదే!
రెండింటి యొక్క కీలక ఫీచర్లను వివరంగా చూద్దాం:
పర్సనల్ లోన్‌తో పోలిస్తే ఎల్ఎపి లో అధిక అవధి: ఎల్ఎపి అనేది ఒక సెక్యూర్డ్ లోన్ కాబట్టి, బ్యాంకులు వయస్సు, ఆదాయం మరియు ఇతర ఆస్తి పై లోన్ కోసం అప్లికెంట్ యొక్క అర్హతా ప్రమాణాల ఆధారంగా 15 సంవత్సరాల వరకు దీర్ఘ అవధిని అందిస్తాయి. దీర్ఘకాలిక అవధి ఇఎంఐని తగ్గిస్తుంది, కస్టమర్ వద్ద వినియోగించదగిన ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, పర్సనల్ లోన్లు సాధారణంగా 5 సంవత్సరాల వరకు మాత్రమే అందించబడతాయి.
మంజూరు చేయబడిన రుణ మొత్తం: దరఖాస్తుదారు ఆస్తి పై ఎల్ఎపి పొందుతారు కాబట్టి, ఆర్థిక సంస్థలు భౌతిక ఆస్తి రూపంలో ఒక సెక్యూరిటీ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల, వారు ఒక గణనీయమైన మొత్తాన్ని రుణంగా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, ఇది ఆస్తి యొక్క సమగ్ర పరిశీలన, ప్రస్తుత విలువ మరియు తనఖా విలువకు లోబడి ఉంటుంది. పర్సనల్ లోన్లలో, గరిష్ట లోన్ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది, సాధారణంగా ఇది ₹ 15-20 లక్షల శ్రేణిలో ఉంటుంది, మరియు ప్రధానంగా వ్యక్తి యొక్క ఆదాయం పై ఆధారపడి ఉంటుంది.
అందించబడే వడ్డీ రేట్లు: ఒక దరఖాస్తుదారు నిర్ణయం తీసుకునేటప్పుడు వడ్డీ రేటు కీలక పాత్ర పోషిస్తుంది. పర్సనల్ లోన్‌తో పోలిస్తే ఎల్ఎపి లో లోన్ తక్కువ వడ్డీ రేటు
పర్సనల్ లోన్లలో వేగవంతమైన పంపిణీ: పంపిణీ విషయంలో పర్సనల్ లోన్లలో ఎల్ఎపి కంటే వేగవంతమైన ప్రతిస్పందన సమయం ఉంటుంది, ఎందుకంటే ఎల్ఎపి లో ఆస్తి విలువ మదింపు కోసం సమగ్రమైన ప్రక్రియ అనుసరించబడుతుంది. అయితే, ఆర్థిక సంస్థలు వారి ప్రతిస్పందన సమయాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి మరియు ప్రస్తుత సందర్భంలో ఎల్ఎపి ని పంపిణీ చేయడానికి సగటున 7 రోజుల సమయం తీసుకుంటున్నాయి.
అదనపు రీడ్: ఫిక్స్‌డ్ వర్సెస్ ఫ్లోటింగ్ వడ్డీ రేటు - మీకు ఉత్తమంగా ఏది సరిపోతుంది
ప్రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ: కస్టమర్లు ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు లేకుండా పొందిన ఎల్ఎపి పై అనేక పాక్షిక చెల్లింపులు చేసే ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటారు, కానీ కొన్ని నిబంధనలు మరియు షరతులతో. అయితే, పర్సనల్ లోన్ల విషయంలో ఈ సౌలభ్యం అనేక సార్లు అందుబాటులో ఉండదు.
టాప్ అప్ లోన్ సౌకర్యం: కస్టమర్ ఇప్పటికే ఆస్తి పై లోన్ పొంది ఉంటే, కానీ గరిష్ట పరిమితి వరకు కాకపోతే, అతను లేదా ఆమె ఆర్థిక సంస్థ ద్వారా సమగ్ర పరిశీలన మరియు ఆథరైజేషన్ పూర్తి అయినా తర్వాత, ఇప్పటికే ఉన్న రుణం పై టాప్ అప్ పొందవచ్చు.
ఎల్ఎపి మరియు పర్సనల్ లోన్లు రెండూ తమ స్వంత ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దరఖాస్తుదారు సౌలభ్యం, ఆఫర్ పై వడ్డీ రేటు, ప్రాసెసింగ్ సమయం మరియు అవసరమైన మొత్తం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు.
రచయిత : షాజీ వర్గీస్
(పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు బిజినెస్ హెడ్ దీని రచయిత)