మీ క్రెడిట్ స్కోర్ ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డుకు సమానం; దానిని సులభమైన ఆర్థిక ప్రయాణం కోసం బాగా నిర్వహించడం చాలా ముఖ్యం. మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి రహస్యాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
• ప్రతిసారీ సకాలంలో చెల్లించండి: లోన్లు, క్రెడిట్ కార్డులు మరియు బిల్లుల సకాలంలో చెల్లింపులు బంగారం లాంటివి. స్థిరమైన చెల్లింపులు బాధ్యతను ప్రతిబింబిస్తాయి మరియు మీ స్కోర్‌ను పెంచుతాయి.
• క్రెడిట్ వినియోగం: మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్‌లో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకోండి. అధిక క్రెడిట్ వినియోగం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది మరియు మీ స్కోర్‌ను తగ్గిస్తుంది.
• విభిన్నక్రెడిట్ మిశ్రమం: క్రెడిట్ కార్డులు, లోన్లు మరియు తనఖా వంటి క్రెడిట్ రకాల మిశ్రమం - వివిధ ఆర్థిక బాధ్యతలను నిర్వహించే మీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.
• తరచుగా దరఖాస్తులు చేయడం నివారించండి: అతి తక్కువ సమయంలో అనేక క్రెడిట్ దరఖాస్తులు అనుమానాలు రేకెత్తించవచ్చు. మీ స్కోర్‌లో అనవసరమైన మార్పులు నివారించడానికి అవసరమైనప్పుడు మాత్రమే దరఖాస్తు చేయండి.
• క్రమం తప్పకుండా క్రెడిట్ రిపోర్టులను తనిఖీ చేయండి: లోపాలు లేదా వ్యత్యాసాల కోసం మీ క్రెడిట్ రిపోర్టులను పర్యవేక్షించండి. లోపాలను వెంటనే నివేదించడం చాలా ముఖ్యం.
• పాత అకౌంట్లను ఉంచండి: దీర్ఘకాలిక క్రెడిట్ చరిత్ర అనుకూలంగా ఉంటుంది. దయచేసి పాత అకౌంట్లను మూసివేయడానికి తొందరపడకండి; అవి మీ స్కోర్‌ను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి.
• బాధ్యతాయుతమైన క్రెడిట్ నిర్వహణ: మీకు అందుబాటులో ఉన్న పరిధిలో క్రెడిట్‌ను నిర్వహించడం ద్వారా అప్పు తీసుకునేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎక్కువగా ఖర్చుపెట్టడం అనేది పెరిగిన అప్పులకి దారితీయవచ్చు.
• కొత్త క్రెడిట్‌ను పరిమితం చేయండి: అనేక కొత్త ఖాతాలను తెరవడం అనేది రుణదాతలకు అనుమానాలు కలిగించవచ్చు మరియు మీ స్కోర్‌ను తగ్గించే అవకాశం ఉంది.
ఒక ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ నిర్మించడం మరియు సంరక్షించడం అనేది ఒక ప్రయాణం, పరుగు కాదు. ఈ చిట్కాలను గుర్తుంచుకోండి, తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి మరియు మీ క్రెడిట్ స్కోర్ మీ బాధ్యతాయుతమైన ఆర్థిక అలవాట్లను ప్రదర్శించడం గమనించండి. శ్రద్ధ మరియు తెలివైన ఎంపికలతో, మీ ఆర్థిక ప్రయాణం మీరు ఊహించిన దాని కంటే సులభంగా ఉండవచ్చు!