PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

పిఎన్‌బి హౌసింగ్

క్రెడిట్ స్కోర్ తనిఖీ

క్రెడిట్ స్కోర్ అనేది దరఖాస్తుదారుని క్రెడిట్ చరిత్ర మరియు పనితీరును సూచిస్తున్న మూడు అంకెల సంఖ్య. ఇది 300-900 వరకు ఉంటుంది. ఎక్కువ స్కోర్ గల దరఖాస్తుదారుని రుణదాతలు తక్కువ రిస్కు గల కస్టమర్లుగా పరిగణిస్తారు. అందువల్ల, క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఒక దరఖాస్తుదారుకు అంత ఎక్కువ క్రెడిట్ విలువ లభిస్తుంది. ఇది ఏదైనా లోన్ అభ్యర్థన కోసం అనగా, ఒక హోమ్ లోన్‌కు కూడా మెరుగైన అర్హతను చూపిస్తుంది.

ఉత్తమ క్రెడిట్ స్కోర్ వల్ల ప్రయోజనాలు

రుణాలపై తక్కువ వడ్డీ రేటు
క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్స్ పొందవచ్చు
దీర్ఘకాలిక రుణాలపై తక్షణ ఆమోదం
వేగవంతమైన లోన్ మరియు క్రెడిట్ కార్డ్ అప్రూవల్
+91

పిఎన్‌బి హౌసింగ్

క్రెడిట్ స్కోర్ పరిధి

  • 300 నుండి 579 వరకు
  • 580 నుండి 669 వరకు
  • 670 నుండి 739 వరకు
  • 740 నుండి 799
  • 800 నుండి 900 వరకు
300 నుండి 579 వరకు

పేవలమైన

ఈ స్కోర్ కలిగిన వ్యక్తులు సాధారణంగా కొత్త క్రెడిట్ కోసం ఆమోదం పొందడంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఒకవేళ మీరు కూడా పేలవమైన క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉంటే, కొత్తగా క్రెడిట్‌ కోసం అప్లై చేసుకోవడానికి ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

ఫర్వాలేదు

ఈ పరిధిలో ఉన్న వారు తరచుగా "సబ్‌ప్రైమ్" రుణగ్రహీతలుగా పరిగణించబడతారు. రుణదాతలు వీరిని అధిక రిస్క్‌ విభాగం కింద పరిగణించవచ్చు, వీరు కొత్త క్రెడిట్ కోసం ఆమోదం పొందడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.

మంచి

రుణదాతలు సాధారణంగా 670 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌లను కలిగి ఉన్న వ్యక్తులను ఆమోదయోగ్యమైన లేదా తక్కువ రిస్క్ గల రుణగ్రహీతలుగా పరిగణిస్తారు.

ఉత్తమం

మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతమైన క్రెడిట్ వినియోగం ట్రాక్ రికార్డ్ చూపిస్తే, అధిక క్రెడిట్ కోసం ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అత్యుత్తమం

800 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది, అంటే మీరు ప్రాధాన్యతగల నిబంధనల వద్ద రుణం పొందగల తక్కువ-రిస్క్ రుణగ్రహీత అయి ఉంటారు.

మీ క్రెడిట్ స్కోర్‌కు

దోహదపడే అంశాలు

రుణ చెల్లింపు చరిత్ర

ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన అంశం. గతంలో మీరు మీ క్రెడిట్ అకౌంట్లపై (లోన్లు, క్రెడిట్ కార్డులు, తనఖా మొదలైనవి) సకాలంలో చెల్లింపులు చేశారా లేదా అనే వివరాలను ఇది తెలియజేస్తుంది. అలాగే, ఆలస్య చెల్లింపులు, డిఫాల్ట్‌లు లేదా వసూళ్ల కోసం పంపబడిన అకౌంట్లు అనేవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

క్రెడిట్ వినియోగం రేటు
పూర్తి క్రెడిట్ చరిత్ర
క్రెడిట్/ప్రోడక్ట్ మిక్స్
కొత్త క్రెడిట్ దరఖాస్తులు
క్రెడిట్ ఖాతా వయస్సు మరియు కార్యాచరణ

ఏస్ ప్లాట్‌ఫారంలో ఒక హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

video-Icon

పిఎన్‌బి హౌసింగ్

మీ క్రెడిట్‌ను మెరుగ్గా నిర్వహించడానికి ఉత్తమ పద్ధతులు

మేలు చేసే చర్యలు

జీతం పొందే ఉద్యోగుల కోసం

  • మీ లోన్ చెల్లింపును పూర్తిగా మరియు సకాలంలో చెల్లించండి

  • మీ క్రెడిట్ వినియోగాన్ని తక్కువగా నిర్వహించండి

  • స్వచ్ఛమైన ఆర్థిక రికార్డులను నిర్వహించండి, సెక్యూర్డ్ మరియు అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ మధ్య మంచి సమతుల్యతను కలిగి ఉండండి

  • ఎప్పటికప్పుడు మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకోండి అలాగే, సిబిల్ రిపోర్ట్‌లో ఏవైనా లోపాలను పర్యవేక్షించండి

హాని చేసే చర్యలు

జీతం పొందే ఉద్యోగుల కోసం

  • అనేక బ్యాంకులు, ఇతర సంస్థలలో ఏకకాలంలో అనేకసార్లు క్రెడిట్ విచారణలు చేయవద్దు

  • కొత్త క్రెడిట్ కార్డుల కోసం అనేకసార్లు అప్లై చేయడం మానుకోండి

  • పర్సనల్ లోన్లు లేదా తనఖా లోన్ల కోసం ఆలస్య చెల్లింపులు నివారించండి

  • అధిక క్రెడిట్ వినియోగాన్ని నిర్వహించడం లేదా సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర కలిగిన పాత క్రెడిట్ కార్డులను మూసివేయడం

పిఎన్‌బి హౌసింగ్

క్రెడిట్ స్కోర్ మెరుగుపరచుకోవడానికి చిట్కాలు

సరైన సమయంలో
మీ బిల్లులను చెల్లించండి
అనేక లోన్లను నివారించండి
మానుకోండి
మీ క్రెడిట్ రిపోర్ట్‌ను
క్రమం తప్పకుండా చెక్ చేయండి
క్రెడిట్‌ను తెలివిగా
సద్వినియోగం చేసుకోండి
Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్