నాయకత్వ బృందం
ఎన్ఎస్ఇ: ₹ ▲ ▼ ₹
బిఎస్ఇ: ₹ ▲ ▼ ₹
చివరి అప్డేట్:
-
english
శోధించండి ఆన్లైన్ చెల్లింపు
-
లోన్ల ప్రోడక్టులు
-
హోసింగ్ లోన్లు
-
ఇతర హోమ్ లోన్లు
-
-
రోషిణి లోన్లు
-
సరసమైన హౌసింగ్
-
- ఫిక్స్డ్ డిపాజిట్
-
క్యాలిక్యులేటర్లు
-
మీ ఆర్థిక స్థితిని తెలుసుకోవడం
-
మీ ఆర్థికతను నిర్వహించడం
-
అదనపు ఖర్చులను లెక్కించడం
-
-
నాలెడ్జ్ హబ్
-
పెట్టుబడిదారులు
-
పెట్టుబడిదారు సంప్రదింపు
-
కార్పొరేట్ గవర్నెన్స్
-
ఆర్థికాంశాలు
-
తాజా సమాచారం @ పిఎన్‌బి హౌసింగ్
-
-
మా గురించి
-
ఈ సంస్థ గురించి
-
నిర్వహణ
-
ప్రెస్
-
ఉద్యోగి
-
- మమ్మల్ని సంప్రదించండి
పిఎన్‌బి హౌసింగ్
పిఎన్‌బి హౌసింగ్
నాయకత్వ బృందం
గిరీష్ కౌస్గి మా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మాస్టర్స్ డిప్లొమాను కలిగి ఉన్నారు. ఆర్థిక సేవా రంగంలో ఈయనకు 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో వీరు కేన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేసారు, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు రిటైల్ హెడ్‌గా ఉన్నారు, క్రెడిట్ మరియు రిస్క్ బాధ్యతలను నిర్వర్తించారు, అలాగే, ఐడిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా మరియు ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ జాయింట్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం గిరీష్ గారు పిహెచ్ఎఫ్ఎల్ హోమ్ లోన్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు పిఇహెచ్ఇఎల్ ఫౌండేషన్ అనే మా అనుబంధ సంస్థ బోర్డులో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 21 అక్టోబర్, 2022 నుండి మా బోర్డులో నియమితులయ్యారు.
వినయ్ గుప్తా మా కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. వీరు 26 అక్టోబర్, 2022న మా కంపెనీలో చేరారు. మా కంపెనీలో ఫైనాన్స్, ట్రెజరీ మరియు పెట్టుబడిదారు సంబంధాలకు సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తారు. వినయ్ గారు ఢిల్లీ యూనివర్సిటీ నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. అతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఒక సభ్యుడు. గతంలో వీరు ఎస్బిఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, జిఇ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ ప్రైస్ వాటర్‌హౌస్ నుండి మంచి వృత్తిపరమైన అనుభవం కలిగి ఉన్నారు.
శ్రీ అమిత్ సింగ్ మా కంపెనీకి చీఫ్ పీపుల్ ఆఫీసర్. వీరు 1 డిసెంబర్, 2021 నాడు మా కంపెనీలో చేరారు. హ్యూమన్ రిసోర్సెస్, లెర్నింగ్ మరియు అభివృద్ధి సంబంధిత విధులను నిర్వహించడం ద్వారా మా కంపెనీ, ప్రజల వ్యూహాన్ని నిర్వహించేందుకు బాధ్యత వహిస్తారు. వీరు సిఎస్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విధులకు కూడా నాయకత్వం వహిస్తారు. శ్రీ అమిత్ గారు మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని మరియు ఐసిఎఫ్ఎఐ బిజినెస్ స్కూల్, ఐసిఎఫ్ఎఐ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. గతంలో వీరి ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పనిచేసిన అనుభవం ఉంది.
జతుల్ ఆనంద్ మా కంపెనీకి చీఫ్ క్రెడిట్ మరియు కలెక్షన్స్ ఆఫీసర్. అతను 19 జూన్, 2013 న మా కంపెనీలో చేరారు. మా కంపెనీలో రిటైల్ వ్యాపారం కొరకు క్రెడిట్ పూచీకత్తు మరియు కలెక్షన్స్ బాధ్యతలను చూసుకుంటారు. జతుల్ గారు ఢిల్లీ యూనివర్సిటీ నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుంచి ఒక కోర్సును పూర్తి చేసారు. వీరు 2002 నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఒక సభ్యుడు. వీరికి ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో మంచి పని అనుభవం ఉంది.
అజయ్ కుమార్ మొహంతి మా కంపెనీకి ఇంటర్నల్ ఆడిట్ హెడ్‌గా నియమితులయ్యారు. వీరు 1 జూలై , 2020న మా కంపెనీలో చేరారు. వీరు కంపెనీ అంతర్గత ఆడిట్ పనితీరుకు నాయకత్వం వహించే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అజయ్ కుమార్ గారు ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి సీనియర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశాడు. వీరు 1989 నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సభ్యుడు. అంతేకాకుండా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్లో పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సును కూడా పూర్తి చేసారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో సర్టిఫైడ్ అసోసియేట్‌గా గుర్తింపు పొందారు. ఇంతకుముందు, వీరు ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.
అనుజై సక్సేనా మా కంపెనీలో అఫర్డబుల్ బిజినెస్‌కి బిజినెస్ హెడ్. వీరు 3 మే, 2021 నాడు మా కంపెనీలో చేరారు. మా కంపెనీ వ్యాపార పరివర్తన ప్రయాణానికి సంబంధించిన బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. వీరు ఉదయ్‌పూర్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీ నుండి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని మరియు నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (అడ్వర్టైజింగ్ మరియు కమ్యూనికేషన్ మేనేజ్మెంట్)లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఇంతకు మునుపు వీరు ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ మరియు పైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వృత్తిపరమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు.
శ్రీ వీణా జి కామత్ వయస్సు 53 సంవత్సరాలు. ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ (బిబిఎం) మరియు లా (ఎల్ఎల్బి)లో డిగ్రీని పూర్తి చేసింది. ఆమె 2008 నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ)లో సభ్యురాలు.
అక్టోబర్ 1998 నుండి ఆమెకు కాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌తో దీర్ఘకాలిక సంబంధం ఉంది. ఆమె పదవీకాలంలో కంపెనీ సెక్రటరీ మరియు కంప్లయెన్స్ ఆఫీసర్ (కీ మేనేజింగ్ పర్సనల్) గా పనిచేశారు. నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకున్నారు, వివిధ విధానాలను రూపొందించారు, రెగ్యులేటర్లతో సంప్రదించారు మరియు కంప్లయెన్స్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఆమె వివిధ విభాగాలకు నాయకత్వం వహించారు మరియ చట్టపరమైన, బోర్డు సెక్రటేరియట్, పన్ను విధింపు మొదలైన వాటిలో విస్తృతమైన జ్ఞానం, అనుభవం కలిగి ఉన్నారు. కార్పొరేట్ పాలనలో నైపుణ్యం సంపాదించారు. ఈ క్రమంలో ఆమె సంస్థలో అధికారి పదవి నుండి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. దీనికి ముందు ఆమె ఐసిడిఎస్ లిమిటెడ్, అద్దె కొనుగోలు మరియు లీజింగ్ కంపెనీలో (1995-1998) పనిచేశారు. ఆమె మైసూరు కోర్టులలో (1992-1995) కాలంలో సివిల్ లా ప్రాక్టీస్ చేసింది.
దిలీప్ వైతీశ్వరన్ సంస్థ యొక్క ముఖ్యమైన సేల్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈయన సంస్థ యొక్క రుణ విభాగం మరియు డిపాజిట్ల వ్యాపారంలో ప్రైమ్ మరియు ఎమర్జింగ్ మార్కెట్స్ వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన సంస్థ యొక్క బిజినెస్ ఇంటెలిజెన్స్ మరియు అనలిటిక్స్ ఫంక్షన్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. వీరు బిజినెస్ స్ట్రాటజీ, ప్రోడక్ట్ మరియు పోర్ట్‌ఫోలియో నిర్వహణ, సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్, లాభనష్టాల నిర్వహణతో పాటు రిటైల్ లెండింగ్ బిజినెస్‌లో 15+ సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. అతను ఏప్రిల్ 2023లో మా కంపెనీలో చేరాడు. కంపెనీ రిటైల్ వ్యాపారంలో వృద్ధి మరియు లాభదాయకత ఫలితాలకు అతను బాధ్యత వహిస్తున్నారు. అతను చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, న్యూఢిల్లీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మా వద్ద చేరడానికి ముందు అతను యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్‌లో విధులు నిర్వహించారు.
కృష్ణ కాంత్ కంపెనీకి ముఖ్య సమ్మతి అధికారిగా వ్యవహరిస్తున్నారు, డిసెంబర్ 2023 నుండి అయన ఈ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. కంప్లయన్స్ విభాగంలో అనుభవజ్ఞుడైన వీరికి, బిఎఫ్ఎస్ఐ రంగంలో రెండున్నర దశాబ్దాల అనుభవం ఉంది. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్‌లో కృష్ణ కాంత్, సంస్థ అంతటా సమ్మతి కార్యకలాపాలు సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా అమలు అయ్యేలా ప్రమాణాలను రూపొందించడానికి మరియు వాటికి విధానాలను అమలు చేయడం లాంటి సమ్మతి వ్యవహారాల కోసం అతను బాధ్యత వహిస్తారు. పిఎన్‌బి హౌసింగ్‌లో చేరడానికి ముందు వీరు బంధన్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లో వృత్తిపరమైన అనుభవం కలిగి ఉన్నారు.
ఈయన యుకెలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి గవర్నెన్స్, రిస్క్ మరియు కంప్లయన్స్‌లో ఐసిఎ డిప్లొమాను కలిగి ఉన్నారు మరియు న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి ఎగ్జిక్యూటివ్ పిజిడిఎం కోర్సును పూర్తి చేసారు. అంతేకాకుండా, వీరు ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో సర్టిఫైడ్ అసోసియేట్‌గా కూడా ఉన్నారు.
అన్షుల్ దలేలా మా కంపెనీకి కస్టమర్ సర్వీస్ మరియు కార్యకలాపాలు. వీరు 11 నవంబర్, 2016 న మా కంపెనీలో చేరారు. వీరు మా కంపెనీలో బ్రాంచ్ కార్యకలాపాలు మరియు కస్టమర్ సేవా నిర్వహణ కోసం బాధ్యత వహిస్తారు. వీరు జైపూర్‌లోని రాజస్థాన్ యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని మరియు జైపూర్‌లోని రాజస్థాన్ యూనివర్సిటీ నుండి వ్యాపార పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసారు. గతంలో వీరికి జెన్వర్త్ ఫైనాన్షియల్ మార్ట్గేజ్ గ్యారెంటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్‌లో పనిచేసిన అనుభవం ఉంది.
అనుభవ్ రాజ్‌పుత్ మా కంపెనీకి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. వీరు 12 ఏప్రిల్, 2022న మా కంపెనీలో చేరారు. మా కంపెనీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు డిజిటల్ కార్యక్రమాలను నిర్వహించేందుకు బాధ్యత వహిస్తారు. శ్రీ అనుభవ్ రాజపుత్, మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు, ఎస్.పి.జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మరియు రీసెర్చ్ నుండి సమాచార నిర్వహణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందుకున్నారు. ఇంతకు ముందు వీరు చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (గతంలో మాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలువబడేది)తో వృత్తిపరమైన అనుభవం కలిగి ఉన్నారు.
వల్లి శేఖర్ మా కంపెనీకి చీఫ్ సేల్స్ అండ్ కలెక్షన్ ఆఫీసర్, కంపెనీలో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తారు. వీరు 6 జూన్, 2022 న మా కంపెనీలో చేరారు. శ్రీ వల్లీ గారు మా కంపెనీ అఫోర్డబుల్ విభాగంలో సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ మరియు కలెక్షన్స్ సంబంధిత వ్యవహారాలను చూసుకుంటారు. వీరు మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం, తిరునల్వేలి నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. గతంలో, మోతీలాల్ ఓస్వాల్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో వృత్తి పరమైన బాధ్యతలు నిర్వహించారు.
కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ బిజినెస్‌కి వికాస్ రానా నేతృత్వం వహిస్తున్నారు. అతను 18 జూన్, 2024 న మా కంపెనీలో చేరారు. రిస్క్‌కు తగినట్లుగా సర్దుబాటు చేయబడిన కన్స్ట్రక్షన్ మరియు రియాల్టీ ఫైనాన్స్ వ్యాపార నిర్మాణానికి మరియు నిర్వహణకి ఈయన బాధ్యత వహిస్తున్నారు. ఈయన ముంబైలోని ఎన్ఎం కాలేజ్ నుండి బి.కామ్, కోల్‌కతాలోని ఐసిడబ్ల్యుఎఐ నుండి ఐసిడబ్ల్యుఎ, హైదరాబాద్‌లోని ఐసిఎఫ్ఎఐ నుండి సిఎఫ్ఎ పూర్తి చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ వద్ద నిర్మాణం మరియు రియల్టీ ఫండింగ్ బిజినెస్‌లో 13+ సంవత్సరాలతో సహా ఈయన బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో 30+ సంవత్సరాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈయన గతంలో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, విఎల్ఎస్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద పనిచేశారు. రియల్ ఎస్టేట్ ఫండింగ్, ఎస్ఎంఇ లెండింగ్, క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ బ్యాంకింగ్, ప్రభుత్వ బిజినెస్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌తో సహా వివిధ పాత్రలలో విధులు నిర్వహించారు.
భవ్య తనేజ మార్కెటింగ్ కోసం నేషనల్ హెడ్‌గా ఉన్నారు. వీరు 15 జూలై , 2019 నాడు మా కంపెనీలో చేరారు. 16 సంవత్సరాలకు పైగా ఉన్న కెరీర్‌తో మార్కెటింగ్ డొమైన్లో విస్తృత విభాగాల్లో పని చేశారు. సంస్థ యొక్క వ్యూహాత్మక మార్కెట్ స్థానాన్ని నిర్వచించడం, బ్రాండ్ నిర్వహణను పర్యవేక్షించడం, ప్రజా సంబంధాలను నిర్వహించడం మరియు అవుట్‌బౌండ్ కాంటాక్ట్ సెంటర్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడం కోసం ఈయన బాధ్యత వహిస్తారు. ఈయన ఐఐఎం ఇండోర్, మార్కెటింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా మరియు కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ నుండి డిజిటల్ మార్కెటింగ్ మరియు స్ట్రాటెజీలో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ కలిగి ఉన్నారు. గతంలో ఈయన ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్, హెచ్ఎస్బిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో సంబంధం కలిగి ఉన్నారు.
నీరజ్ మంచందా కంపెనీకి చీఫ్ రిస్క్ ఆఫీసర్. వీరు 15 ఏప్రిల్, 2013న మా కంపెనీలో చేరారు. మా కంపెనీలో పూర్తి రిస్క్ మేనేజ్మెంట్ కొరకు వీరు బాధ్యత వహిస్తారు. ఇతను ఢిల్లీ యూనివర్సిటీ నుండి కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని మరియు ఇక్ఫాయన్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోసం పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. గతంలో వీరికి హాబిటాట్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పనిచేసిన అనుభవం ఉంది.
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
తక్షణ హోమ్ లోన్ మంజూరు పొందండి
మీ ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ నుండి కాల్ పొందండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
మీ సందర్శనకు ధన్యవాదాలు, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
పిఎన్‌బి హౌసింగ్ వివరాలు






మీ ఆసక్తికి ధన్యవాదాలు! మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు
కాల్బ్యాక్ను అభ్యర్ధించండి
ఓటిపిని ధృవీకరించండి
మేము ఈ నంబర్‌కు ఓటిపి పంపాము: +91 .
దయచేసి క్రింద నమోదు చేయండి.