ఒక హోమ్ లోన్‌ను ఆమోదించేటప్పుడు ఆర్ధిక సంస్థలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. రెండు అత్యంత ముఖ్యమైనవి మీ ప్రస్తుత ఆర్థిక బాధ్యతలు మరియు రీపేమెంట్ సామర్థ్యం, ఇవి రెండూ మీ జీతంపై ఆధారపడి ఉంటాయి.
హోమ్ లోన్ అప్రూవల్ కోసం మెడికల్, ట్రావెల్ మొదలైన అలవెన్సులను మినహాయించి ఆర్థిక సంస్థలు మీ చేతికి వచ్చే జీతంను పరిగణిస్తాయి.
మీరు మీ హోమ్ లోన్ అర్హతను ఎలా లెక్కించవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:
పిఎన్‌బి హౌసింగ్ అర్హత క్యాలిక్యులేటర్‌ను తనిఖీ చేయండి
మీ హోమ్ లోన్ మొత్తం, అవధి, వడ్డీ రేటు మరియు ఇతర ప్రస్తుత ఇఎంఐలను నమోదు చేయండి
మీరు మీ నెలవారీ ఇఎంఐలు మరియు అర్హత కలిగిన రుణ మొత్తాన్ని పొందుతారు.
ఉమ్మడిగా అప్లై చేయండి, సహ-దరఖాస్తుదారు జీతం కూడా రుణం అప్రూవల్ కోసం లెక్కించబడుతుంది.
ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగాన్ని పొందండి.
ఇది మీ పని స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఉద్యోగాలను తరచుగా మార్చవద్దు
మీ ప్రస్తుత రుణాలను చెల్లించండి
యుటిలిటీ మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించండి